గుంటూరు తూర్పు నుండి టీడీపీ అభ్యర్ధిగా సినీ నటుడు అలీ?

First Published 3, Mar 2019, 4:40 PM

గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో అభ్యర్థుల ఖరారు కోసం ఏపీ సీఎం చంద్రబాబునాయడు ఆదివారం నాడు కసరత్తు నిర్వహించారు

గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో అభ్యర్థుల ఖరారు కోసం ఏపీ సీఎం చంద్రబాబునాయడు ఆదివారం నాడు కసరత్తు నిర్వహించారు.సోమవారం నాడు మరోసారి సమావేశం కావాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ నియోజకవర్గం పరిధిలో రెండు సీట్లలో అభ్యర్థులను ఖరారు చేశారు. గుంటూరు తూర్పు స్థానం నుండి సినీ నటుడు అలీ పేరును చంద్రబాబునాయుడు పరిశీలిస్తున్నారు.

ఆదివారం నాడు అమరావతిలో  గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన నేతలతో చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. గుంటూరు  పార్లమెంట్ నియోజకవర్గంలోని పొన్నూరు అసెంబ్లీ స్థానం నుండి  దూళిపాళ నరేంద్ర, తెనాలి నుండి ఆలపాటి రాజా పేర్లు దాదాపుగా ఖరారైనట్టుగా సమాచారం.

గుంటూరు తూర్పు నియోజకవర్గంలో తనకు ఓటు హక్కును కల్పించాలని కోరుతూ సినీ నటుడు అలీ ధరఖాస్తు చేసుకొన్నారు. అయితే  అలీకి హైద్రాబాద్‌లో ఓటు ఉన్న విషయాన్ని  అధికారులు అలీ దృష్టికి తీసుకొచ్చారు. అవసరమైతే హైద్రాబాద్‌లో ఉన్న తన  ఓటును తొలగించి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఓటు హక్కును కల్పించాలని అలీ అధికారులను కోరారు.

గుంటూరు తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుండి సినీ నటుడు అలీ పేరును చంద్రబాబునాయుడు పరిశీలిస్తున్నారు. అలీ కాకపోతే షరీఫ్ పేరును పరిశీలిస్తున్నారు.గత ఎన్నికల సమయంలో కూడ అలీని గుంటూరు సిటీలోని ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయించాలని  టీడీపీ ప్రయత్నించింది. అయితే కొన్ని కారణాలతో అలీ అభ్యర్ధిత్వం ఖరారు కాలేదు.

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి ప్రస్తుతం టీడీపీ అభ్యర్ధిగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.  నిన్న, ఇవాళ జరిగిన సమీక్ష సమావేశాలకు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాత్రం హాజరుకాలేదు.

గుంటూరు పశ్చిమ స్థానం నుండి  మద్దాల గిరి, కోవెలమూడి రవీంద్ర పేర్లను పరిశీలిస్తున్నారు. వీరిద్దరూ కాకపోతే ఎస్పీ, కాపు లేదా రెడ్డి సామాజిక వర్గం నుండి బరిలోకి దింపాలని ఆ పార్టీ భావిస్తోంది. మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా స్థానికంగా ఉన్న వైరి వర్గం నిరసనలు చేస్తోంది. మోదుగుల వైసీపీలో చేరుతారనే ప్రచారం చాలా కాలంగా సాగుతోంది.

తాడికొండ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ పై కూడ అసమ్మతి ఉంది. ఈ స్థానం నుండి మాల్యాద్రి లేదా మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్  పేర్లను పరిశీలిస్తున్నారు. ప్రత్తిపాడుకు డొక్కా మాణిక్య వరప్రసాద్ కుమార్తె లేదా కందుకూరు వీరయ్య, లేదా రిైటర్డ్ అధికారి ఒకరిని ఎంపిక చేసే ఛాన్స్ ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

మంగళగిరి స్థానానికి చిరంజీవులు, ఎం. హనుమంతరావు,టి.శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల పేర్లు విన్పిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఈ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా గంజి చిరంజీవి పోటీ చేసి వైసీపీ అభ్యర్ధి ఆళ్ల రామకృష్ణారెడ్డిపై 12 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈ స్ధానం నుండి వైసీపీ టిక్కెట్టును టీడీపీ నుండి వైసీపీలో చేరిన ఉడతా శ్రీనివాస్‌కు కేటాయించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.