జగన్ వ్యూహం: చంద్రబాబుపై ఎదురుదాడి, ఫిరాయింపుల క్రీడ

First Published 14, Jun 2019, 3:02 PM IST

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కా వ్యూహంతో ఎదురుదాడికి దిగుతున్నట్లు కనిపిస్తున్నారు. శాసనసభ సమావేశాల తీరు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. చంద్రబాబును ఆత్మరక్షణలో పడేయానికి ఆయన ఎదురుదాడి వ్యూహాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కా వ్యూహంతో ఎదురుదాడికి దిగుతున్నట్లు కనిపిస్తున్నారు. శాసనసభ సమావేశాల తీరు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. చంద్రబాబును ఆత్మరక్షణలో పడేయానికి ఆయన ఎదురుదాడి వ్యూహాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

ఐదుగురు శాసనసభ్యులను లాక్కుంటే టీడీపీ ప్రతిపక్ష హోదా గల్లంతవుతుందని, టీడీపీ ఎమ్మెల్యేలు కొంత మంది తమతో టచ్ లో ఉన్నారని జగన్ శాసనసభలో చెప్పారు. అంతేకాదు, తాను చంద్రబాబులా చేయబోనని, ఎవరైనా తమ పార్టీలోకి రావాలనుకుంటే పదవులకు రాజీనామా చేయాల్సిందేనని ఆయన చెప్పారు. దీన్నిబట్టి చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రజల్లోకి సంకేతాలు పంపించాలనే ఉద్దేశం జగన్ అలా మాట్లాడి ఉంటారని అనిపిస్తోంది.

అంతేకాకుండా, గురువారం శాసనసభలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రోజా చేసిన వ్యాఖ్యలను కూడా జగన్ వ్యూహరచనలో భాగంగానే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. స్పీకర్ ను కుర్చీపై కూర్చోబెట్టడానికి చంద్రబాబు తన బంట్రోతును పంపించారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యాఖ్యానించడం, తనను గతంలో సస్పెండ్ చేసిన విషయాన్ని రోజా ప్రస్తావించడం చూస్తుంటే, టీడీపీకి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ముందే నోరు పెద్ద చేసుకోవాలనే ఆలోచనలో వైఎస్సార్ కాంగ్రెసు ఉన్నట్లు కనిపిస్తోంది

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై జగన్ పక్కాగా మైండ్ గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తున్నారు. జగన్ ప్రకటనతో ఆగకుండా తమతో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ఓ రాజ్యసభ సభ్యుడు టచ్ లో ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పడం కూడా రాజకీయంగా టీడీపిని దెబ్బ తీయాలనే వ్యూహంలో భాగమేనని అంటున్నారు

జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నారని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా వైసిపిలో చేరబోరని ఆయన స్పష్టం చేశారు. వైసిపితో టచ్ లో ఉన్న తమ పార్టీ ఎమ్మెల్యేల పేర్లు చెప్పాలని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ శ్రీధర్ రెడ్డిని డిమాండ్ చేశారు. దీన్నిబట్టి ఈ చర్చను కొనసాగిస్తూ టీడీపీని కల్లోలపరచాలనే ఉద్దేశం వైసిపికి ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు.

వాస్తవానికి రాజకీయాల్లో కప్పల తక్కెడ వైఖరి కొనసాగుతూనే ఉన్నది. గతంలో తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఈసారి కాంగ్రెసు ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లోకి ఫిరాయించారు. మంత్రి పదవులు కూడా చేపట్టారు. అలాగే, చంద్రబాబు నాయుడు 23 మంది వైసిపి ఎమ్మెల్యేలను, ముగ్గురు పార్లమెంటు సభ్యులను టీడీపిలో చేర్చుకున్నారు. కొంత మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కూడా ఇచ్చారు. అదే రకంగా అధికారంలో ఉన్న వైసిపిలోకి ఫిరాయించడానికి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సిద్ధంగా లేరని చెప్పడానికి కూడా అవకాశమేమీ లేదు.

loader