రోజా పదవిపై ఉత్కంఠ: జగన్ మంత్రి వర్గంలో వీరే...

First Published 6, Jun 2019, 12:32 PM IST

మంత్రివర్గ ఏర్పాటుకు కేవలం రెండు రోజుల వ్యవధి మాత్రమే ఉండడంతో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేల్లో ఉత్కంఠ చోటు చేసుకుంది. రోజా విషయంలో జగన్ మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. తొలుత ఆమెకు స్పీకర్ పదవి ఇవ్వాలని అనుకున్నారు. అయితే, శాసనసభలో ప్రత్యర్థులను ఎదుర్కోవడం ఇబ్బంది అవుతుందనే దృష్టితో ఆమెను మంత్రిగా తీసుకోవాలనే ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది.

అమరావతి: సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రి వర్గ సభ్యుల జాబితాలో మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఆయన తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎవరికి ఏ శాఖలు కేటాయించాలనే విషయంపై కూడా ఆయన ఓ నిర్ధారణకు వచ్చినట్లు చెబుతున్నారు.

మంత్రివర్గ ఏర్పాటుకు కేవలం రెండు రోజుల వ్యవధి మాత్రమే ఉండడంతో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేల్లో ఉత్కంఠ చోటు చేసుకుంది. రోజా విషయంలో జగన్ మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. తొలుత ఆమెకు స్పీకర్ పదవి ఇవ్వాలని అనుకున్నారు. అయితే, శాసనసభలో ప్రత్యర్థులను ఎదుర్కోవడం ఇబ్బంది అవుతుందనే దృష్టితో ఆమెను మంత్రిగా తీసుకోవాలనే ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆమెకు మంత్రి పదవి ఇవ్వాలా, స్పీకర్ పదవి ఇవ్వాలా అనే విషయంపై ఇంకా జగన్ ఓ నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది.

పి. పుష్పవాణిని డిప్యూటీ స్పీకర్ గా చేయాలని జగన్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. రోజాకు మంత్రి పదవి ఇస్తే ఆమెను డిప్యూటీ స్పీకర్ గా ఎన్నుకునే అవకాశం ఉంది. భూమన కరుణాకర్ రెడ్డిని తొలి విడత మంత్రిగా తీసుకునే అవకాశం లేదనే వార్తలు వస్తున్నాయి. కోన రఘుపతిని మంత్రివర్గంలోకి తీసుకుని ఆయనకు దేవాదాయ శాఖను ఇవ్వాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి ఆనం రామనారాయణ రెడ్డిని స్పీకర్ గా చేయాలనే ఆలోచన జగన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. రోజాకు మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే రాజేంద్రనాథ్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం ఇంతకు ముందు జరిగింది. అయితే, ఆలోచన నుంచి వైదొలిగి రామనారాయణ రెడ్డిని స్పీకర్ చేస్తే సీనియర్ గా గౌరవించినట్లు అవుతుందని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.

కోన రఘుపతి - దేవాదాయ శాఖ. ఆళ్ల రామకృష్ణా రెడ్డి - వ్యవసాయ శాఖ. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి - ఆర్థిక శాఖ. కాకాని గోవర్ధన్ రెడ్డి - పరిశ్రమలు. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి - హోం శాఖ. కొడాలి నాని - భారీ నీటిపారుదల. మేకపాటి గౌతమ్ రెడ్డి - ఐటి శాఖ. తమ్మినేని సీతారాం - బీసీ సంక్షేమ శాఖ. జి. శ్రీకాంత్ రెడ్డి - మున్సిపల్ శాఖ. తానేటి వనిత - స్త్రీశిశు సంక్షేమ శాఖ. ఆనం రామనారాయణ రెడ్డి - స్పీకర్ లేదా మంత్రి. పిల్లి సుభాష్ చంద్రబోస్ - పౌర సరఫరాల శాఖ. బొత్స సత్యనారాయణ - రోడ్లు భవనాలు, ఆబ్కారీ. బాలినేని శ్రీనివాస్ రెడ్డి - మైనింగ్. అనంత వెంకట్రామి రెడ్డి - పంచాయతీరాజ్. శిల్ప చక్రపాణి రెడ్డి - అటవీ శాఖ. ధర్మాన ప్రసాద రావు - రెవెన్యూ శాఖ.

loader