షాకిచ్చిన జగన్: రోజాకు ఎందుకంత క్రేజ్?

First Published 10, Jun 2019, 4:54 PM IST

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు గాంచిన వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా మంత్రి పదవి దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆమె అభిమానులు, కార్యకర్తలు కూడా తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు గాంచిన వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా మంత్రి పదవి దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆమె అభిమానులు, కార్యకర్తలు కూడా తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అయితే, సామాజిక వర్గాలను సర్దుబాటు చేసే క్రమంలో జగన్ ఆమెకు మంత్రి పదవి ఇవ్వలేకపోయారని అంటున్నారు.

చిత్తూరు జిల్లా నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని తప్పనిసరిగా మంత్రివర్గంలోకి తీసుకోవాల్సి రావడంతో అదే వర్గానికి చెందిన రోజాను పక్కన పెట్టారని అంటున్నారు. అయితే, రోజా మంత్రి పదవికి ఆయన అడ్డుపడ్డారనే ప్రచారం కూడా ఉంది.

రోజాకు మంత్రి పదవి వస్తుందా, రాదా అనే ఉత్కంఠ చివరి నిమిషం వరకు కూడా కొనసాగింది. తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ అధినేత చంద్రబాబును ధీటుగా ఎదుర్కుని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి అండగా నిలిచిన రోజాకు మంత్రి పదవి దక్కకపోవడం చాలా మందిని ఆశ్చర్యానికి కూడా గురి చేసింది.

వైసీపీకి చెందిన ద్వితియ శ్రేణి నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా రోజాకు మంత్రి పదవి ఇచ్చి తీరాల్సిందే పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి కేవలం నలుగురికి మాత్రమే అవకాశం కల్పించి ఎస్సీ, ఎస్టీలు, బీసీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో రోజాకు మంత్రి పదవి రాలేదు. అయితే రెండున్నరేళ్ల తర్వాత కచ్చితంగా మంత్రి పదవి ఉంటుందని ఆమెకు జగన్ హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు.

పాపులారిటీ, గత ఎనిమిదేళ్ళుగా పార్టీలో పోషించిన పాత్రతో రోజాకు జనంలో చరిష్మాను, క్రేజ్‌ను సంపాదించి పెట్టాయి. వరుసగా రెండుసార్లూ గెలిచి ఎమ్మెల్యే అయ్యారు.  గాలి ముద్దకృష్ణమ నాయుడిని, ఆయన తనయుడిని ఓడించారు. ముఖ్యంగా గత ఐదేళ్ళ పాటు ఆమె అధికార టీడీపీని ఇరకాటంలో పెట్టారు.

శాసనసభలోనూ, వెలుపలా కూడా తెలుగుదేశం పార్టీపై, ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై తీవ్రమైన పదజాలంతో వాగ్యుద్ధం చేశారు. అసెంబ్లీ నుంచి సస్పెన్షన్‌ కు కూడా గురయ్యారు. అందువల్ల జగన్‌ క్యాబినెట్‌లో రోజాకు తప్పనిసరిగా స్థానం లభిస్తుందని ఆమె అనుచరులు గట్టిగా నమ్ముతూ వచ్చారు.

శుక్రవారం రాత్రి దాకా నగరి నియోజకవర్గంలో రోజా అనుచరవర్గం బాగా హడావిడి చేసింది. అమరావతికి బయల్దేరేందుకు కూడా సిద్ధమయ్యారు. అయితే జగన్‌ ప్రకటించిన మంత్రుల జాబితాలో ఆమె పేరు లేకపోవడం పార్టీ శ్రేణులను, అనుచర వర్గాన్ని షాక్‌కు గురి చేసింది. దీంతో నగరి, పుత్తూరుల్లో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శిబిరాలన్నీ మూగ నోము పట్టాయి.

loader