తిరుపతి బైపోల్: టీడీపీ, వైసీపీ రెడీ, బీజేపీ, జనసేన కూటమి నుండి రాని స్పష్టత
First Published Dec 22, 2020, 4:15 PM IST
తిరుపతి లోక్ సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికలను ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి.

తిరుపతి ఎంపీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో జనసేన, బీజేపీల తరపున ఏ పార్టీ అభ్యర్ధి బరిలోకి దిగుతారనేది ఇంకా స్పష్టం కాలేదు. రెండు పార్టీలు ఈ స్థానం నుండి పోటీకి రంగం సిద్దం చేసుకొంటున్నాయి. ఉమ్మడి అభ్యర్ధి ఈ స్థానం నుండి బరిలోకి దిగుతారని బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు ఇటీవలనే ప్రకటించారు.

తిరుపతి ఎంపీ స్థానం నుండి పోటీకి జనసేన ఆసక్తిని చూపుతోంది. గత ఎన్నికల సమయంలో ఈ స్థానాన్ని బీఎస్పీకి జనసేన కేటాయించింది. గత ఎన్నికల్లో లెఫ్ట్ బీఎస్పీతో కలిసి జనసేన పోటీ చేసింది. తిరుపతి ఎంపీ స్థానం నుండి బీఎస్పీ అభ్యర్ధి పోటీ చేశారు. బీఎస్పీ అభ్యర్ధికి 20,971 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసిన బొమ్మిన శ్రీహరి రావుకు 16, 125 ఓట్లు మాత్రమే వచ్చాయి.ఈ స్థానంలో నోటాకు 25, 781 ఓట్లు దక్కాయి.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?