జగన్ ముందస్తు కసరత్తు: భారత్ ‘లుక్ ఈస్ట్’ విధాన దిశగా...

First Published Aug 8, 2019, 6:49 PM IST

-జాన్ సన్ చోరగుడి 

రాష్ట్ర విభజన జరిగిన తర్వాత గడచిన ఐదేళ్ళ తర్వాత మొట్ట మొదటిసారి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పెట్టుబడులు దేశ పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పన కోసం ఒక అంతర్జాతీయ సదస్సును ఆగస్టు 9 న విజయవాడలో నిర్వహిస్తున్నది. సుమారు 35 దేశాల రాయబారులు, దేశీ పారిశ్రామిక రంగ ప్రతినిధులు దీనికి హాజరవుతున్నారు. 

ఆం ధ్రప్రదేశ్ లో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంత కాలానికి ఇక్కడి ప్రభుత్వ పరిపాలన ఒక గాడిన పడుతున్నట్టుగా వుంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత గడచిన ఐదేళ్ళ తర్వాత మొట్ట మొదటిసారి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పెట్టుబడులు దేశ పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పన కోసం ఒక అంతర్జాతీయ సదస్సును ఆగస్టు 9 న విజయవాడలో నిర్వహిస్తున్నది. సుమారు 35 దేశాల రాయబారులు, దేశీ పారిశ్రామిక రంగ ప్రతినిధులు దీనికి హాజరవుతున్నారు.

ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సదస్సు కోసం భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ సాధారణ పరిపాలన శాఖ, రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం, మౌలికవసతులు, పెట్టుబడులు శాఖ ఉమ్మడిగా సన్నాహాలు చేస్తున్నాయి. రాష్ట్ర పరిశ్రమల శాఖ సి.ఐ.ఐ. తో కలిసి గత ఐదేళ్లుగా విశాఖపట్టణంలో భాగస్వామ్య సదస్సు పేరుతో జరిగిన ప్రయత్నాలు ఏవో కొన్ని పారిశ్రామిక సంస్థలు, కంపెనీలతో ఎం.ఓ.యు.లు చేసుకోవడానికే పరిమితం అయ్యాయి. అయితే అవి క్షేత్ర స్థాయిలో ఎంతమేర కార్యరూపం దాల్చాయి అనేది వేరే చర్చ.

రిపబ్లిక్ ఆఫ్ ఇండియాగా వ్యవహరించే మన యూనియన్ - ఫెడరల్ రాజ్యాంగ చట్రం పరిధిలో ఒక రాష్ట్ర లెజిస్లేచర్ మరియు దాని బ్యురోక్రసి, అది తన ప్రాదేశిక (టెరిటోరియల్) సరిహద్దులకు అవతల ఉన్న బయట దేశాలతో జరపవలసిన ఎటువంటి లావాదేవీలు అయినా, అవి ఆ దేశ రాజ్యాంగ చట్రంలో ఒక పరిధికి లోబడి జరగవలసి వుంటుంది. అయితే ఆర్ధిక సంస్కరణలు తెచ్చిన సరళీకరణ తర్వాత ‘ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా’ (ఎఫ్.డి.ఐ) విధానం మొదలయింది. ఇందువల్ల గణనీయంగా ఇక్కడ ఉపాధి పెరిగింది.

‘ఫైనాన్సియల్ టైమ్స్’ కధనం మేరకు 2015 లో మనదేశం ఎఫ్.డి.ఐ. పెట్టుబడుల్లో చైనా, అమెరికాను కూడా అధిగమించింది. అయితే మనవద్దకు బయట పెట్టుబడుల రావడానికి రెండు మార్గాలు అనుమతిస్తున్నారు. ఒకటి- బయట నుంచి నేరుగా పెట్టుబడులు ఇక్కడికి రావడం. రెండవది- ప్రభుత్వం నుంచి ముందుగా అనుమతి పొందిన తర్వాత రావడం. ఈ ప్రక్రియ వేగవంతంగా జరగడానికి ఇప్పటికే పలు ఏర్పాట్లు కేంద్ర రాష్ట్ర స్థాయిల్లో ఉన్నాయి. ఈ రెండు పద్దతుల్లో ఏ పద్దతిలో పెట్టుబడులు ఇక్కడికి వచ్చినప్పటికీ, కొన్ని అనుమతించిన రంగాల్లో మాత్రమే వాటిని ఇక్కడ మదుపు పెట్టాల్సివుంటుంది. అవి – మౌలికవసతులు రంగం, ఆటోమోటివ్స్, సర్వీసులు, ఫార్మాసూటికల్స్, రైల్వేలు, కెమికల్స్, టెక్స్ టైల్స్, ఎయిర్ లైన్స్ రంగాలు. రాష్ట్ర విభజన జరిగిన 2014 నాటికి విదేశీ పెట్టుబడుల రంగంలో దేశీయ విధానం ఇలా వుంది. అయితే దేశమంతా ఎలా ఉన్నప్పటికీ ప్రత్యేకించి మనవద్ద పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నమైంది.

విభజన చట్టంలో ఉన్న ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగరాన్ని, అక్కడ మనకు అందుబాటులో వున్న కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలు, విజ్ఞాన సంస్థలు, ప్రాంతీయ పరిశోధనాలయాల అందుబాటులో ఉన్న వాటి విలువైన సర్వీసులు అన్నీ వొదులుకుని మరీ ఇవతలకు వచ్చింది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం. అటువంటి నిస్సహాయ స్థితిలో, కనీసం విదేశీ పెట్టుబడులను మన రాష్ట్రంలోకి రప్పించే విషయంగా అయినా మనకు కేంద్ర ప్రభుత్వం పూచీ ఉండేట్టుగా, అందుకోసం పాటించవలసిన విధివిధానాలు డిల్లీ సర్కార్ కనుసన్నల్లో జరిగేట్టుగా మనం చూసుకుని వుంటే, అప్పుడు మనకుండే భరోసా వేరుగా ఉండేది. ఇక్కడ పెట్టుబడులు పెట్టే దేశాల డిల్లీ రాయబార కార్యాలయాల ప్రతినిధులతో మన విదేశాంగ శాఖ ద్వారా నేరుగా అమరావతి నుంచి సంబంధిత శాఖల సెక్రటరీలు సమన్వయం చేసుకోవడం గత ఐదేళ్లుగా తేలికై వుండేది.

అయితే అవేవీ జరగలేదు. నిజానికి ఆసియాలో పారిశ్రామిక పెట్టుబడులు, వాణిజ్య రంగంలో అగ్రగామి దేశంగా మోడీ ప్రభుత్వం దేశ సరిహద్దుల్లో చైనాకు గట్టి పోటీ ఇస్తున్న కాలమిది. అటువంటప్పుడు తూర్పుతీరాన్నిఆంధ్రప్రదేశ్ ‘షో కేసింగ్’ చేసుకోవడానికి అందివచ్చిన అవకాశాన్ని, ఐదేళ్ళు పాటు మనం పోగొట్టుకున్నాము. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం అంత మేర ఆలోచించలేదు. విభజన జరిగి మనది సముద్రతీర కేంద్రిత రాష్ట్రం అయ్యాక, భారత ప్రభుత్వ ఆగ్నేయ ఆసియా విధానం దృష్ట్యా; ‘ఆసియాన్’ ఒడంబడిక అమలులోకి చొచ్చుకు పోవల్సిన సృజనాత్మకత క్రియాశీలత, చొరవ, ఇక్కడి ప్రభుత్వంలో లేకపోయింది.

నిజానికి 2014 ఎన్నికలు మొదలు 2017 వరకు తెలుగుదేశం - బిజే.పి. మధ్య రాజకీయంగా సయోధ్య సాగింది. కేంద్ర మంత్రి మండలిలో రాష్ట్రానికి సముచితమైన భాగస్వామ్యముంది. అయినప్పటికీ ఇటు రాష్ట్రం నుండి కానీ అటు కేంద్రం నుంచి గాని, ఈ దిశలో ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ఇటు మన వైపు నుంచి మనం కూడా చొరవ చూపని కారణంగా, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2017 జూన్, ఆగస్టు నెలల్లో ‘ఏసియాన్’ సంబధిత సదస్సులు కొన్నిటిని తూర్పు తీరాన్ని విడిచి త్రివేండ్రం, భోపాల్, గోవాల్లో నిర్వహించింది.

దేశంలో సీనియర్ గా ‘విజన్’ వున్న సంస్కరణల సి.ఎం. గా తనను తాను తరుచూ అభివర్ణించుకునే నారా చంద్రబాబు నాయుడు 2014 తర్వాత కూడా తాను ఇంకా 23 జిల్లాల రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నట్టుగానే, ఎక్కువ సార్లు ఆయన ప్రవర్తన ఉండేది. కేంద్రంలో ప్రణాళిక సంఘం స్థానంలో ‘నీతి అయోగ్’ ఏర్పడ్డాక, ఇక్కడ రాష్ట్రంలో కూడా ‘సిట్-ఏ.పి.’ (Strategic Institute for transforming AP) పేరుతో ఒక సంస్థను అప్పట్లో ఆయన ఏర్పాటుచేశారు. అయితే, ఆ తర్వాత దాని పురోగతి గురించి ముఖ్యమంత్రి ఏ అధికారిక కార్యక్రమాల్లో మాట్లాడలేదు.

చివరికి కొత్త రాష్ట్రంలోకి రావాల్సిన పెట్టుబడులు వంటి ప్రాముఖ్యమైన అంశం కూడా, గతంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో జరిగిన ‘ఈవెంట్ మేనేజ్ మెంట్’ మాదిరిగానే ఇక్కడ సాగాయి. అయితే ఇప్పటి ఈ ప్రభుత్వం, ముందునుంచి కూడా తను పాటించవలసిన నియమ నిబంధనల పరిధికి లోబడి పనిచేస్తున్నది కనుక, మొదటి ప్రయత్నంలోనే అది ఈ సదస్సులో కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖను భాగస్వామిని చేసింది. ఏ.పి. కొత్త మంత్రి మండలి జూన్ 8 న ప్రమాణస్వీకారం చేసింది. సరిగ్గా రెండు నెలల్లో జగన్ ప్రభుత్వం డిల్లీ స్థాయిలో జరగవలసిన ఒక అంతర్జాతీయ సదస్సును విజయవాడకు తెచ్చింది.

ముందుగా ఇందుకోసం కొంత కసరత్తు గత రెండు మూడు వారాలుగా జరిగింది. చెన్నైలో ఉన్న జపాన్‌ కాన్సులేట్‌ జనరల్‌ కొజిరొ ఉచియామ ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు సహా ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. జపాన్‌లో పర్యటించాలంటూ ముఖ్యమంత్రిని ఆయన ఆహ్వానించారు. అవినీతిలేని, పారదర్శక పాలనకోసం రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను సీఎం వివరించారు. దీనివల్ల భూములు, నీళ్లు, కరెంటు రేట్లు తగ్గుతాయని, పారిశ్రామిక వర్గాలకు మేలు జరుగుతుందని జపాన్‌ కాన్సులేట్‌ జనరల్‌కు సీఎం వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ అండ్‌ మానిటరింగ్‌ సెల్ ద్వారా, పెట్టుబడుల ఆలోచన దశ నుంచి ఉత్పత్తి దశ వరకూ కూడా పూర్తిస్థాయిలో తమ ప్రభుత్వం సహాయకారిగా ఉంటుందని సీఎం వివరించారు. ఏ దశలోనూ లంచాలకు, రెడ్‌టేపిజానికి తావులేని విధంగా తాము తోడుగా ఉంటామని చెప్పారు. పరిశ్రమలు వద్ధి చెందాలంటే శాంతి, సహద్భావ వాతావరణం కూడా అవసరమని, దీంట్లో భాగంగానే తమ ప్రభుత్వం పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం ఉద్యోగాలు కల్పించేలా రిజర్వేషన్లు తెచ్చామని వివరించారు. ఇందుకోసం వారికి అవసరమైన నైపుణ్యాభివద్ధి కోసం మానవ వనరుల ప్రత్యేక శిక్షణా కేంద్రాల ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రవేశపెట్టే ఆలోచన చేస్తున్నామని, ఆదిశగా పెట్టుబడుల పెట్టే ఆలోచన చేయాలని జపాన్ ప్రతినిధిని ముఖ్యమంత్రి కోరారు.

ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఔషధ తయారీ పరిశ్రమలకోసం భూములు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ప్రభుత్వం తెలిపింది. కోల్డ్‌ స్టోరేజీలు, గోదాములు, అగ్రిల్యాబ్‌లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టబడులకు అవకాశాలను పరిశీలించాలని విజ్ఞప్తిచేసింది. అత్యాధునిక వసతులున్న పోర్టులు, మౌలిక సదుపాయాలు, నైపుణ్యమున్న మానవవనరులు అందుబాటులో ఉన్నందున జపాన్‌ కంపెనీలకు ఆంధ్రప్రదేశ్‌ అనుకూలంగా ఉంటున్న విషయాన్నీ కూడా ప్రభుత్వం వారికి వెల్లడించింది. రాష్ట్రంలో ఆహార ఉత్పత్తి పెంపుదల, ఆహార సంబంధిత పరిశ్రమలు, మత్స్య రంగాల్లో అవకాశాలపై జపాన్‌ వ్యవసాయశాఖ ఇన్ఫర్మేషన్‌ మరియు రీసెర్చ్‌ ఇనిస్ట్యూట్‌ ద్వారా ఇప్పటికే విశ్లేషణ చేయిస్తున్నట్టు జపాన్ ప్రతినిధి తెలిపారు.

జులై చివరి వారంలో చెన్నైలోని ఆస్ట్రేలియా కాన్సులేట్‌ జనరల్‌ సూసన్‌ గ్రేస్‌ ముఖ్యమంత్రి జగన్ ను కలుసుకున్నారు. వివిధ రంగాలకు చెందిన 22 మంది ప్రతినిధులు ఆమె నేతృత్వంలో సీఎంతో భేటీ అయ్యారు. గనులు, ఇంధనం, లిథియం బ్యాటరీల తయారీ, విద్య, లాజిస్టిక్స్, విమానాశ్రయాల నిర్వహణల్లో పెట్టుబడుల అవకాశాలపైనా చర్చించారు. రెండురోజుల పాటు రాష్ట్రంలో పర్యటించిన ఆస్ట్రేలియా బృందం వివిధ శాఖల మంత్రులను, కార్యదర్శులను, పారిశ్రామిక వేత్తలను కూడా కలుసుకుంది. పారిశ్రామిక రంగం అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని ఈ సంద‌ర్భంగా సీఎం వారికి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అందిస్తున్న పారదర్శక పాలన, పారిశ్రామిక రంగానికి మరింత మేలు చేస్తుందని ఆస్ట్రేలియన్‌ బృందంతో సీఎం వ్యాఖ్యానించారు. కాలుష్యం తగ్గించడానికి, మెరుగైన రవాణా కోసం ఎలక్ట్రిక్‌ బస్సులను వవేశపెట్టడానికి ఆసక్తితో ఉన్నామని, దానిపై ఆలోచన చేయాలని సీఎం కోరారు.

అయితే, ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన ఇంత తక్కువ సమయంలో ఇదంతా ఎలా జరుగుతున్నది అని తెరవెనక్కి కూడా చూడాలి. నాయకుడు తన ‘టీం’ ను ఎంపిక చేసుకోవడమే కాదు, వాళ్ళ మీద నమ్మకం కూడా ఉంచినప్పుడు ఇటువంటివి సాధ్యమవుతాయి. అలా చూసినప్పుడు, కొందరు కనిపిస్తున్నారు. విద్యావంతుడు యువకుడైన గౌతం రెడ్డికి సి.ఎం జగన్ పరిశ్రమల శాఖ వంటి కీలక శాఖ బాధ్యతలు అప్పగించారు. ఇక డా. పి.వి. రమేష్ సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారి, గత ప్రభుత్వంలో ఆయన ఆర్ధిక శాఖలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు, రెండున్నర ఏళ్ల క్రితం ఉన్నట్టుండి ఆయన్ని ఆ బాధ్యతల నుంచి తొలగించింది. దాంతో రమేష్ కేంద్ర సర్వీసులకు వెళ్ళారు. ప్రభుత్వం మారాక, తిరిగివచ్చిన ఆయనకు జగన్ ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా పరిశ్రమలు, వాణిజ్యం, పెట్టుబడులు వంటి అతి కీలక శాఖల బాధ్యతలు అప్పగించారు.

డా. రజిత్ బార్గవ మరో సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారి. బెజవాడ సబ్ కలక్టర్ గా సర్వీస్ ప్రారంభించిన ఈయన గత ఇరవై ఏళ్లుగా కేంద్ర సర్వీసుల్లో పలు కీలక శాఖల్లో వున్నారు. కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖలో చానాళ్లు వున్నారు, అమరావతి తిరిగి వచ్చేముందు ‘క్లీన్ గంగ’ ప్రాజెక్ట్ డైరక్టర్ గా చేసారు. డిల్లీలో ఆయనకు కేంద్ర మంత్రిత్వ శాఖలతో వున్న సమన్వయం దృష్ట్యా ఆయనకు జగన్ రెడ్డి ప్రభుత్వంలో పరిశ్రమలు, వాణిజ్యం, మౌలిక వసతులు వంటి కీలక శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది. ఇక ముఖ్యమంత్రికి సాధారణ పరిపాలన శాఖ ప్రధాన సలహాదారుగా వున్నది మాజీ చీఫ్ సెక్రటరీ అజేయ కల్లం. వీరంతా కాకుండా ప్రత్యేక పరిస్థితుల్లో సి.ఎస్. గా నియామకం అయిన ఎల్వీ సుబ్రహ్మణ్యం, తెరవెనుక వీరి సారధ్యంలో ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద సదస్సు ఇక్కడ జరగబోతున్నది.

శుక్రవారం జరగబోయే ఈ సదస్సులో పలు దేశాల రాయబారులు, ప్రతినిధులతో జరగబోతున్నది ప్రధానంగా దౌత్య సంబంధాల సదస్సు. సుమారు 35 దేశాల నుంచి హాజరవుతున్న అతిధులతో ముఖ్యమంత్రి సమిష్టిగా అందరితో కలిసి మాట్లాడతారు. మరొక సెషన్ లో ఒక్కొక్కరితో విడివిడిగా కూడా మాట్లాడబోతున్నారు. ఈ సదస్సుకు అమెరికా, కొరియా, సింగపూర్, ఆస్ట్రియా, పోలాండ్, బల్గేరియా, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్ డం, థాయ్ లాండ్, అంగోలా, జపాన్, కెనడా, నెదర్ లాండ్స్, ఇంకా పలు దేశాలు హాజరవుతున్నాయి.

మన దేశంలో పెట్టుబడులకు అనుమతించిన రంగాల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉన్న అనుకూలతలను ప్రభుత్వం వారికి వివరిస్తుంది. ఈ తొలి పరిచయాల తర్వాత ఇక్కడ ఆయా దేశాలకు ఉన్న ఆసక్తులు మేరకు పెట్టుబడులు, వాణిజ్యం, సాంకేతిక సహకారం, వంటివి ఇకముందు పరస్పరం అందించుకోవడం జరుగుతుంది. ఇందుకోసం ఇప్పటికే మన రాష్ట్రం టోక్యో, సియోల్ లో ‘ఇన్వెస్టర్ డెస్క్’ లను ఏర్పాటు చేస్తున్నది. ఇవి కాకుండా దేశంలో డిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నై, నగరాల్లో కూడా బిజినెస్ సెంటర్ లను పెట్టబోతున్నది. ఇటువంటి ఏర్పాటు చేయడానికి అవకాశం లేనిచోట ‘ఫిక్కి’ ‘సి.ఐ.ఐ.’ వంటి వాణిజ్య వేదికల సహకారం ప్రభుత్వం కోరబోతున్నది.

తెలుగు ప్రధాని పి.వి.నరసింహారావు మొదటిసారి ఒక ఉవాచగా అన్న భారత్ ‘లుక్ ఈస్ట్’ విధానం అంచెలంచలుగా యు.పి.ఏ. రెండు నాటికి భారత్ ‘ఆసియాన్’ ఒప్పందం చేసుకుకునే దశకు చేరింది. డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా వున్న కాలంలో అప్పటి కేంద్ర మంత్రి జై రాం రమేష్ సహకారంతో మన విశాఖ ఏజెన్సీ అరుకు కాఫీని ఆసియాన్ ‘ఫ్రీ ట్రేడ్ ఏరియా’ లో చేర్చారు. అప్పటి నుంచి ఇన్నాళ్ళు తర్వాత తిరిగి మళ్ళీ విభజిత ఆంధ్రప్రదేశ్ లో 2020 కి మరో నాలుగు నెలల ముందు జరుగుతున్న ఈసదస్సు భారత్ ‘లుక్ ఈస్ట్’ విధానాన కార్యాచరణ దిశలో ఇప్పటినుంచి ఇదొక నిరంతర కొనసాగింపు కావాలి         -జాన్ సన్ చోరగుడి

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?