MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Andhra Pradesh
  • అక్కడున్నది పవన్ ...పైసలు రాకుండా వుంటాయా..!! ఎన్నికోట్లు వచ్చాయో తెలుసా?

అక్కడున్నది పవన్ ...పైసలు రాకుండా వుంటాయా..!! ఎన్నికోట్లు వచ్చాయో తెలుసా?

కేంద్ర ప్రదేశ్ ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు శుభవార్త చెప్పింది. రాష్ట్రానికి భారీగా నిధులు విడుదల చేస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులన్నీ ప్రజల ఖ ాతాల్లో జమ కానున్నాయి...

2 Min read
Author : Arun Kumar P
| Updated : Aug 09 2024, 11:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan : కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ కు మరికొన్ని నిధులు మంజూరు చేసింది.  ఉపాధిహామీ పథకం కింద ఇటీవల భారీగా నిధులు విడుదల చేసిన ప్రభుత్వం తాజాగా మరిన్ని నిధులను మంజూరు చేసింది. ఇలా కేంద్రం నుండి విడుదలైన ఉపాధి హామీ నిధులకు సంబంధించిన వివరాలను ఏపీ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పవన్ కల్యాణ్ వివరించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Pawan Kalyan

Pawan Kalyan

2024-25 ఆర్థిక సంవత్సరం అంటే ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్ కు సంబంధించిన ఉపాధి హామీ వేతనాల చెల్లింపుకోసం కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ నిధులను కేటాయించిందని పవన్ తెలిపారు. ఇలా 21.5 కోట్ల పనిదినాలకు గాను మొత్తం రూ.5743.90 కోట్లను మంజూరు చేసారని మంత్రి తెలిపారు. 

36
Pawan Kalyan

Pawan Kalyan

అయితే గతంలో ఆమోదించిన 15 కోట్ల పనిదినాలకు సంబంధించిన వేతనాల కోసం ఇప్పటికే రూ.2934.80 కోట్లను విడుదల చేసారని పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఇప్పుడు మిగిలిన  రూ.2812.98 కోట్లను మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని మంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. 

46
Pawan Kalyan

Pawan Kalyan

ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.2809.10 కోట్లు రోజువారీ వేతన ఎఫ్.టి.ఓ.ల అప్ లోడ్ ఆధారంగా నేరుగా వేతనదారుల ఖాతాలకు జమ అయ్యాయని మంత్రి తెలిపారు. మిగిలిన మొత్తాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరలోనే వేతనదారుల ఖాతాలకు జమ అవుతాయని మంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు.
 

56
Pawan Kalyan

Pawan Kalyan

ఇదిలావుంటే బడ్జెట్ లోనూ ఆంధ్ర ప్రదేశ్ కు భారీగా నిధలను కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. ఎన్డీఏలో కీలక బాగస్వాములుగా వున్న టిడిపి, జనసేన అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ లు కేంద్రం నుండి నిధులు రాబట్టడంలో కీలకంగా వ్యవహరించారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం భారీగా నిధులు కేటాయించింది. 

66
Pawan Kalyan

Pawan Kalyan

ప్రధాని నరేంద్ర మోదీ పవన్ కల్యాణ్ పై ప్రత్యేక అభిమానం ప్రదర్శిస్తుంటారు. పవన్ కూడా ప్రధానిని ఎక్కడా తగ్గించకుండా చాలా గౌరవం ఇస్తారు.వీరిద్దరి మధ్య సత్సంబంధాలు కూడా ఏపీకి నిధులు రాబట్టడంలో పనిచేస్తున్నాయని జనసేన నాయకులు అంటున్నారు. ఏదైమైనా పవన్ కు కేటాయించిన శాఖలకు కేంద్రం నుండే కాదు రాష్ట్రంనుండి బాగానే నిధులు వస్తున్నాయన్నది కాదనలేని నిజం. పవన్ కల్యాణ్ కూడా పాలనా అనుభవం లేకున్నా చాలా సమర్ధవంతంగా తనకు కేటాయించిన శాఖల బాధ్యతలు చూసుకుంటున్నారు. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
10వేల కోట్ల పెట్టుబ‌డులు, 4వేల మందికి ఉద్యోగాలు ఏపీలో భారీ ప్రాజెక్టు| Anantapur Wind Energy Project
Recommended image2
Now Playing
జగన్‌కు రాఖీలు కట్టిన వైసీపీ కార్యకర్తలు | YS Jagan Celebrate Rakhi Pournami
Recommended image3
Andhra pradesh: ఏపీ ప్ర‌భుత్వం మ‌రో కీలక నిర్ణ‌యం.. రాష్ట్ర‌వ్యాప్తంగా సంజీవ‌ని ప్రాజెక్టు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved