Tirumala: భక్తులకు గుడ్ న్యూస్.. వాట్సాప్‌లో తిరుమల శ్రీవారి దర్శనం బుకింగ్స్
Tirumala: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ 'మన మిత్ర' కార్యక్రమం కింద మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో విజయవాడలోని దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం, శ్రీశైలం, శ్రీకాళహస్తి, సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల వంటి ఆలయాల సేవలు కూడా ఉన్నాయి.

tirumala tirupati
Tirumala darshan WhatsApp: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలను అందించడం మొదలుపెట్టింది. 'మన మిత్ర' పేరుతో వాట్సాప్ గవర్నెన్స్‌ను తీసుకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కారు ఈ సేవలను మరింతగా విస్తరించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా తిరుమల శ్రీవారి దర్శనం బుకింగ్స్ సేవలను కూడా అందుబాటులోకి తెస్తోంది.
tirumala tirupati
వాట్సాప్ లో తిరుమల తిరుపతి దేవస్థానం సేవలు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కు సంబంధించిన సేవలు త్వరలో వాట్సాప్‌లో అందుబాటులోకి రానున్నాయని ప్రభుత్వం తెలిపింది. వాట్సాప్ నుంచే భక్తులకు దర్శన టిక్కెట్లు, గదులు బుక్ చేసుకోవడం, విరాళాలు అందించడం వంటి సేవలుల వున్నాయి. దీంతో భక్తుల కష్టాలు మరింత తగ్గనున్నాయని చెప్పవచ్చు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్‌గా ప్రసిద్ధి చెందిన 'మన మిత్ర' కార్యక్రమం కింద ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. విజయవాడలోని దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం, శ్రీశైలం, శ్రీకాళహస్తి, సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల వంటి ఇతర ఆలయాల సేవలను వాట్సాప్‌లో చేర్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం సేవలు అందుబాటులో ఉన్నాయి.
tirumala tirupati
ఈ సేవలను ఎలా పొందాలి?
ఈ సేవలను పొందడానికి, ప్రభుత్వ వాట్సాప్ నంబర్ 9552300009 కు 'హాయ్' అని టెక్స్ట్ చేయాలి. తర్వాత సేవలు ఎంచుకోవాలి. ఆప్షన్‌లో టెంపుల్ బుకింగ్ సర్వీసేస్‌ను ఎంచుకోవాలి. ఎంచుకున్న ఆలయంలోని దర్శనాలు, పూజలు, విరాళాలు, ఇతర సేవల గురించి చాట్‌బాట్ సమాచారాన్ని అందిస్తుంది. సూచనలను పాటించి అందుబాటులో ఉన్న ఎంపికల నుండి అప్షన్లు ఎంచుకోవాలి.
WhatsApp support
వివరాలు అందించడం పూర్తియిన తర్వాత వెంటనే డిజిటల్ క్యాష్ పేమెంట్ గేట్‌వే కనిపిస్తుంది. క్యాష్ పేమెంట్ పూర్తయిన వెంటనే, టికెట్ చెల్లింపుదారుడి వాట్సాప్ నంబర్‌కు మెసెజ్ వస్తుంది. అంటే మీ బుకింగ్స్ వివరాలు అందుతాయి. భక్తులు ఈ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింటౌట్ తీసుకొని సంబంధిత ఆలయాలకు వెళ్లవచ్చు.
త్వరలో రైలు సేవలు సైతం
కేంద్రం అనుమతితో తమ ప్రభుత్వం రైలు టిక్కెట్లను కూడా వాట్సాప్ గవర్నెన్స్ 'మన మిత్ర'లో చేర్చడానికి ప్రయత్నిస్తుందని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు చెప్పారు.
సినిమా టిక్కెట్లను బుక్ చేసుకునే సౌకర్యం, APSRTC బస్సుల ప్రత్యక్ష GPS ట్రాకింగ్ కూడా వాట్సాప్ నంబర్‌కు జోడించనున్నారు. ఈ సేవలు తెలుగు, ఇంగ్లీష్ భాషలలో అందుబాటులో ఉంటాయి. స్మార్ట్‌ఫోన్‌లలో టెక్స్ట్ చేయలేని వారికి వాయిస్ సర్వీస్ కూడా అందుబాటులో ఉంటుంది.
మన మిత్ర'లోకి అన్ని ప్రభుత్వ సేవలు తేవడమే లక్ష్యం
జనవరి 30న ప్రారంభించబడిన వాట్సాప్ సేవల ద్వారా దాదాపు 2.64 లక్షల లావాదేవీలు జరిగాయని ప్రభుత్వం తెలిపింది. ఈ సౌకర్యంతో ప్రజల అనుభవాన్ని తెలుసుకోవడానికి త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఒక సర్వే నిర్వహించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సేవల సంఖ్యకు అదనంగా 45 రోజుల్లో మరో 161 సేవలను జాబితాలో చేర్చాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాబోయే ఆరు నెలల్లో అన్ని ప్రభుత్వ సేవలను వాట్సాప్ గవర్నెన్స్‌లోకి తీసుకురావాలనే ప్రయత్నాలు చేస్తోంది.