Tirumala : సప్తవాహనాలపై తిరుమలేషుడు.. కన్నుల విందుల శ్రీవారి రథసప్తమి వేడుకలు
Tirumala: తిరుమలలో రథసప్తమి వేడుకల క్రమంలో తెల్లవారుజాము నుంచే మలయప్పస్వామి రూపంలో శ్రీవారు ఏడు వాహనాలపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తకోటిని అనుగ్రహించారు. దీనికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. మొదట సూర్యప్రభ వాహనంపై తిరుమలేషుడు దర్శనమిచ్చారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
<p> tirumala : lakhs witness 7 vahana sevas on ratha saptami festival lord venkateswara swamy in telugu rma </p>
Tirumala: కలియుగ వైకుంఠంగా పెరుగాంచిన తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. సప్తవాహనాలపై తిరుమలేషుని ఊరేగింపుతో కన్నుల విందులగా రథసప్తమి వేడుకలు జరిగాయి. ఈ పవిత్ర కార్యక్రమానికి దాదాపు 2.50 లక్షల మంది భక్తులు హాజరయ్యారని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు తెలిపారు. ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించినట్టు వెల్లడించారు.
Tirumala
తిరుమలలో భారీ ఏర్పాట్లు
ఈ ఉత్సవాల సందర్భంగా తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అక్కడి వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భక్తులకు సౌకర్యంగా ఉండేలా, ఆలయ వీధుల వెంబడి టిటిడి విస్తృత ఏర్పాట్లు చేసిందని, సందర్శకులు సౌకర్యాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. ప్రధాన గ్యాలరీ వెలుపల ఉన్నవారు టిటిడి ఏర్పాటు చేసిన LED స్క్రీన్ల ద్వారా వాహన సేవను వీక్షించేలా కూడా ఏర్పాట్లు చేశారు.
శ్రీవారి ఆచారాలు ప్రారంభం నుండి వాహన సేవ ముగిసే వరకు వేడుకల అంతటా భక్తులకు నిరంతరాయంగా ఉచిత అన్న ప్రసాదం అందించినట్లు ఈఓ శ్యామలరావు తెలిపారు.
తెల్లవారుజాము నుంచే లక్షల మంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం వచ్చారు
రథ సప్తమి సందర్భంగా తిరుమలలో తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు సప్తవాహనాలపై శ్రీనివాసుడు శ్రీ మలయప్ప స్వామివారి రూపంలో దర్శనమించ్చారు. ఈ వైభవాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు.
తెల్లవారుజాము నుండే అన్ని గ్యాలరీలను పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. భక్తులు, అన్నప్రసాదం, తాగునీరు, పానీయాలు, బిస్కెట్లు అన్నింటికంటే ముఖ్యంగా జర్మన్ షెడ్లు వారికి నీడను అందించేలా చర్యలు తీసుకున్నారు. వేడి వాతావరణ పరిస్థితుల నుండి రక్షణ కల్పించడంతో సహా యాత్రికులకు అనుకూలమైన ఏర్పాట్లకు టిటిడిపై ప్రశంసలు కురుస్తున్నాయి.
<p> </p>
కల్పవృక్ష వాహన సేవ తర్వాత, టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు, కొంతమంది బోర్డు సభ్యులు, ఇఓ జె శ్యామలారావు, అదనపు ఇఓ సిహెచ్ వెంకయ్య చౌదరి, జెఇఓ వీరబ్రహ్మం, సివిఎస్ఓ ఇన్‌ఛార్జి మణికంఠ గ్యాలరీలను స్వయంగా పరిశీలించి, భక్తులతో సంభాషించి వారి అభిప్రాయాలను స్వీకరించారు.
మాడవీధుల్లో ఊరేగుతూ భక్తకోటిన అనుగ్రహించిన శ్రీవారు
తిరుమలలో రథసప్తమి వేడుకల క్రమంలో తెల్లవారుజాము నుంచే మలయప్పస్వామి రూపంలో శ్రీవారు ఏడు వాహనాలపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తకోటిని అనుగ్రహించారు. దీనికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. మంగళవారం 2 గంటల నుంచే అక్కడి పరిసరాలు జనంతో నిండిపోయాయి. ఉదయం 5.30కు సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. అయితే, సూర్య కిరణాల స్పర్శ కోసం వాయవ్య దిక్కున 6.48 గంటల వరకు అక్కడే ఉన్నారు. సూర్య కిరణాలు శ్రీవారిని తాకిన తర్వాత ఇతర ఆచారాలు పూర్తిచేశారు. ఆ తర్వాత ఇతర వాహనాలపై స్వామివారు దర్శనమించ్చారు.