Tirumala : తిరుపతిలో పరిస్థితి ఇంత దారుణమా : ఇది ఓ శ్రీవారి భక్తుడి ఆవేదన
Tirumala : శ్రీవారి భక్తులను తిరుపతిలో కొందరు వ్యాపారులు ఎలా మోసం చేస్తున్నారో తెలియజేసే కథనమిది. స్వామి దర్శనం కోసం తిరుపతిలో దిగిన దంపతులు ఎంతలా ఇబ్బంది పడ్డది సోషల్ మీడియా వేదికన బైటపెట్టారు.

ఓ స్వామి భక్తుడి ఆవేదన...
Tiruala : తిరుమల ఏడుకొండలపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తులు కలియుగ ప్రత్యక్షదైవంగా కొలుస్తుంటారు. కేవలం తెలుగువారే కాదు దేశవిదేశాల నుండి కూడా స్వామివారిని దర్శించుకునేందుకు ప్రతిరోజు వేలాదిమంది తిరుమలకు వెళుతుంటారు. వందల కిలోమీటర్లు ప్రయాణించి... పదులు కిలోమీటర్లు కాలినడకన ఏడుకొండలెక్కి... గంటలతరబడి క్యూలైన్లలో వేచివుండి స్వామివారిని దర్శించుంటారు... ఇలా ఒక్క క్షణం స్వామిని దర్శించుకున్నంతనే అక్కడికి చేరుకునే వరకు భక్తులు పడిన బాధలన్ని మటుమాయం అవుతాయి. ఇలా ఆ స్వామి సన్నిధిలో భక్తులు తరించిపోతారు.
ఇదీ తిరుపతిలో శ్రీవారి భక్తుల పరిస్థితి...
అయితే ఆ వెంకటేశ్వర స్వామిపై భక్తుల నమ్మాకాన్నే కొందరు తమ వ్యాపారానికి పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. భక్తుల సౌకర్యార్థం అంటు తిరుమల, ఇటు తిరుపతిలో అనేక హోటల్స్ వెలిశాయి… ఇందులో చాలావరకు భక్తులకు మెరుగైన సేవలే అందిస్తున్నాయి. కానీ కొన్ని హోటల్లు మాత్రం స్వామివారి భక్తులను మోసం చేసేందుకు చీఫ్ ట్రిక్స్ ఫాలో అవుతున్నాయి. ఇలాంటి హోటళ్ల భారినపడ్డ ఓ భక్తుడు తిరుపతిలో తనకు ఎదురైన చేదు అనుభవాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
తిరుపతిలో భక్తుల పరిస్థితి ఇంత దారుణమా..!
ఇటీవల బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు భార్యతో కలిసి తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లాడట. ఈ సందర్భంగా తమకు ఎదురైన భయంకరమైన పరిస్థితులకు ఇంకా మర్చిపోలేకపోతున్నామంటూ అతడు సోషల్ మీడియా వేదికన వెల్లడించారు. ఎంతో భక్తిభావంతో తిరుపతిలో దిగిన దంపతులకు అక్కడ హోటల్స్ లో చేదు అనుభవాలు ఎదురయ్యాయట... చాలా అపరిశుభ్ర పరిస్థితులను చూశామని, మోసానికి కూడా గురయ్యామని తెలిపారు. కాబట్టి శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించాడు.
సదరు భక్తుడు సోషల్ మీడియాలో వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. బెంగళూరు నుండి తిరుపతికి చేరుకోగానే రైల్వే స్టేషన్ లోని ఓ హోటల్లో భోజనం చేయడానికి వెళ్లడంతో తమ సమస్యలు ప్రారంభం అయ్యాయని తెలిపాడు. అక్కడ ఆహారం రుచికరంగా లేకపోవడమే కాదు పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి... సిబ్బంది తీరు కూడా దారుణంగా ఉందన్నాడు. తాముతిన్న రెండు చపాతీలు ఉప్పుతో నిండిపోయి ఉన్నాయని... సెట్ దోసె కూడా దారుణంగా ఉంది... ఇదేం ఫుడ్ అని అడిగితే కనీసం పట్టించుకునేవారు లేకుండాపోయారని వాపోయారు. చివరకు హోటల్లో తినడానికి ఉపయోగించే ప్లేట్లు, స్పూన్స్ వంటి వస్తువులు కూడా అపరిశుభ్రంగా ఉన్నాయని వాపోయాడు.
ఇంత దరిద్రంగా ఉన్న హోటల్లో బిల్లు మాత్రం ఫైవ్ స్టాన్ హోటల్ స్థాయిలో ఉందట. కేవలం రెండు చపాతీలు, ఓ సెట్ దోసెకు ఏకంగా రూ.480 బిల్ వేశారని... చేసేదేమిలేక వాళ్లు అడిగినంత బిల్ చెల్లించి బయటకు వచ్చామని భక్తుడు తెలిపాడు. ఇలా తిరుపతితో భోజనం విషయంలో తనకు ఎదురైన అనుభవాన్ని వెల్లడించాడు.
ఇదీ ఓ హోటలేనా...
ఇంతటితో తమ సమస్యలు ఆగలేదు... ముందుకు సాగుతూనే ఉన్నాయన్నాడు భక్తుడు. తిరుపతిలోని రాత్రి బసచేసి ఉదయమే తిరుమలకు వెళ్లాలని భావించారు సదరు దంపతులు. దీంతో తిరుపతిలో మంచి హోటల్ కోసం ఆన్ లైన్ లో వెతికి ఒకదాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఫోన్ లో అద్భుతమైన రూం, హోటల్ పరిసరాలు బాగుండటంతో అందులో దిగేందుకు నిర్ణయించుకుని అక్కడికి వెళ్ళామని అతడు తెలిపాడు. తీరా ఆ హోటల్ ని, అందులోని రూంలు చూసి ఆశ్చర్యపోయారట... పరమ చెత్తగా ఉందట. దీంతో అక్కడ ఉండేదుకు ఇష్టపడక వెళ్లిపోయేందుకు సిద్దమైతే హోటల్ సిబ్బంది తమను బెదిరించి చాలా అసహ్యంగా తెలుగులో దుర్భాషలాడినట్లు సదరు భక్తుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ హోటల్లో ఓ రాత్రి బస చేసేందుకు ఆన్ లైన్ లో రూ.1000 చార్జ్ చేస్తారని చూపించగా... అక్కడ మాత్రం రూ.1500 డిమాండ్ చేశారట. ఈ రాత్రి సమయంలో బయటకు వెళ్లడం మంచిదికాదు... ఇతర హోటల్స్ లో ఇంకా ఎక్కవ మోసాలుంటాయి... ఇక్కడే కొంచెం నయం అని సిబ్బంది చెప్పారట. దీంతో ఇక్కడా చేసేదేమిలేక బల్లులు, దోమలు, బొద్దింకలు, ఎలుకలు, సాలీడు గూళ్లతో కూడిన ఆ అపరిశుభ్రమైన రూంలోనే ఉండాల్సి వచ్చిందన్నారు.
ఎలాగోలా ఆ రాత్రి గడిపి ఉదయమే తిరుమలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకుని దేవుడా అనుకుంటూ తిరిగి బెంగళూరుకు బయలుదేరినట్లు భక్తుడు తెలిపాడు. ఇలా తనకు తిరుపతిలో ఎదురైన అనుభవాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్న భక్తుడు తిరుమల వెళ్ళేవారికి కొన్ని సూచనలు చేశాడు.
శ్రీవారి భక్తులు జాగ్రత్త
1. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనంకోసం తిరుపతిలో దిగే భక్తులు హోటల్లు మరీ ముఖ్యంగా రైల్వేస్టేషన్ సమీపంలోని వాటితో జాగ్రత్త.
2. తిరుమలకు వెళ్లేముందే అన్నింటి గురించి తెలుసుకొండి... వెళ్లాక చూసుకుందాంలే అని అనుకోవద్దు.
3. తిరుపతికి వెళితే అక్కడి అపరిశుభ్రమైన పరిస్థితులు, స్కాంలను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండండి.
4. ఇతర రాష్ట్రాల నుండి శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి వెళ్ళే భక్తులకు బాష సమస్య ఎదురుకావచ్చు.
ఈ సమస్యలన్ని తిరుపతిలో తమకు ఎదురయ్యాయి... కాబట్టి స్వామివారి భక్తులు తిరుపతిలో చాలా జాగ్రత్తగా ఉండాలని సదరు భక్తుడు సూచించాడు. అతడి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది... దీంతో తిరుపతిలో భక్తుల పరిస్థితిపై తీవ్ర చర్చ జరుగుతోంది. తిరుపతిలో ఇంత దారుణ పరిస్థితులు ఉన్నాాయా..! అని ఆశ్చర్యపోతున్నారు.