MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • మీరు ఇకపై చికెన్ తిన్నారో అంతే సంగతి..: కోళ్లను అడ్డుకునేందుకు తెలుగు రాష్ట్రాల్లో చెక్ పోస్టులు

మీరు ఇకపై చికెన్ తిన్నారో అంతే సంగతి..: కోళ్లను అడ్డుకునేందుకు తెలుగు రాష్ట్రాల్లో చెక్ పోస్టులు

మీరు చికెన్ ను ఇష్టంగా తింటారా? ముక్క లేకుంటే ముద్ద దిగదా?... అయితే మీరు కొద్దిరోజులు జాగ్రత్తగా వుండాలి. ఎందుకంటే చికెన్ ద్వారా ప్రమాదకర వైరస్ మనుషులకు సోకుతుంది... ఇది తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తోంది. ఆ వైరస్ ఏంటి? దాని లక్షణాలేంటి? తెలుసుకుందాం.. జాగ్రత్తగా వుందాం. 

3 Min read
Author : Arun Kumar P
| Updated : Feb 11 2025, 05:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Bird Flu

Bird Flu

Bird Flu : పొరుగురాష్ట్రాల్లో విజృంభిస్తున్న బర్డ్ ప్లూ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రవేశించింది. ఇప్పటికే తెలంగాణలో బర్డ్ ప్లూ సోకి కోళ్లు మృత్యువాతపడుతుండగా ఇప్పుడు ఇది ఆంధ్ర ప్రదేశ్ కు కూడా పాకింది. తూర్పు గోదావరి జిల్లాలో ఈ వైరస్ ను గుర్తించారు పశుసంవర్ధన శాఖ అధికారులు... జిల్లాలో ఇప్పటికే లక్షలాది కోళ్లు ఈ వైరస్ బారినపడి చనిపోయాయి. దీంతో ఈ వైరస్ మనుషులకు సోకకుండా వైద్యారోగ్య శాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలోని పౌల్ట్రీ ఫారాల్లో కోళ్లు హఠాత్తుగా మరణిస్తుండటంతో పశుసంవర్ధక శాఖ అధికారులు అప్రమత్తమయ్యాయి. మహారాష్ట్రతో పాటు తెలంగాణలో కూడా బర్డ్ ప్లూ కేసులు బైటపడటంతో చనిపోయిన కోళ్లనుండి శాంపిల్స్ సేకరించి టెస్టులు చేపట్టారు. ఈ క్రమంలో పెరవలి మండలం కానూరు గ్రామంలో తీసుకున్న కోళ్ల శాంపిల్స్ లో బర్డ్ ప్లూ పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో ప్రభుత్వం పశుసంవర్ధక,వైద్యారోగ్య, పోలీస్ తో పాటు ఇతర శాఖల అధికారులను అలర్ట్ చేసింది. 

ఈ బర్డ్ ప్లూ ఇతర జిల్లాలకు పాకకుండా అధికారులు చర్యలు చేపట్టారు. బర్డ్ ప్లూ బైటపడ్డ కానూరుకు 10 కిలోమీటర్ల పరిధిలో సెక్షన్ 144 విధించారు. ప్రజలు కూడా గుంపులు గుంపులుగా వుండకూడదని... ఏదయినా అనారోగ్య సమస్యతో బాధపడితే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. కొద్దిరోజులు చికెన్ తినకూడదని హెచ్చరిస్తున్నారు... బర్డ్ ప్లూ కోళ్ల ద్వారా మనుషులకు సోకే ప్రమాదముంది కాబట్టి అహార నియమాలు పాటించాలని సూచిస్తున్నారు వైద్యారోగ్య శాఖ అధికారులు. 

 ఇక పౌల్ట్రీ రైతులు కోళ్లు చనిపోతుంటే తమకు సమాచారం ఇవ్వాలని పశుసంవర్ధక శాఖ సూచించింది. రాజమండ్రి కలెక్టరేట్ లో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూంను ఏర్పాటుచేసారు... బర్డ్ ప్లూ లక్షణాలు కోళ్లలోగానీ, మనుషులలో గానీ కనిపిస్తే 95429 08025 కు సమచారం అందించాలని ప్రకటించారు. ఇప్పటికే ఎవరైనా బర్డ్ బ్లూ బారినపడితే వెంటనే సంప్రదించాలని... వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. 
 

23
Bird Flu

Bird Flu

బర్డ్ ప్లూ ఎలా సోకుతుంది? 

బర్డ్ ప్లూ సహజంగా జంతువుల నుండి మనుషులకు సోకుతుంది... ఇది కోళ్ళనుండే ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది.  బర్డ్ ప్లూ బారినపడ్డ జంతువులు, పక్షులకు దగ్గరగా ఎక్కువసేపు గడిపితే ఇది సోకే అవకాశం ఎక్కువగా వుంటుంది.

ఇక బర్డ్ ప్లూ సోకిన కోళ్లను తిన్నా వ్యాపిస్తుంది.  అయితే చికెన్ ను బాగా శుభ్రం చేసుకుని ఉడికించడం ద్వారా అందులోని వైరస్ చనిపోతుంది. అలాకాకుండా ఉడికీఉడకని చికెన్ తినడంద్వారా ఇది మనుషులకు వ్యాప్తి చెందుతుంది. అయితే ప్రస్తుతం బర్డ్ ప్లూ వ్యాప్తి ఎక్కువగా వున్న నేపథ్యంలో చికెన్ తినకుండా వుండటమే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 

బర్డ్ ప్లూ అనేది అంటువ్యాధి కాదు... ఒకరినుండి ఒకరికి వ్యాపించదు. కానీ జంతువులు, పక్షుల నుండి మనుషులకు మాత్రం వ్యాపిస్తుంది. పక్షుల్లో ఇది మరణాలకు దారితీస్తుంది... అలాగే మనుషుల్లో కూడా సమయానికి వైద్యం అందకుంటే ఇది ప్రాణాంతకం కావచ్చు. కాబట్టి బర్డ్ ప్లూ లక్షణాలు కనిపించగానే వైద్యసహాయం పొందడం ఉత్తమం. 

33
bird flu

bird flu

బర్డ్ ప్లూ లక్షణాలు : 

పౌల్ట్రీ ఫారాల్లో ఒకేసారి వందలాదిగా కోళ్లు చనిపోతే అందుకు బర్డ్ ప్లూ కారణం కావచ్చు.    ఇది పౌల్ట్రీ రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిలిస్తుంది. ఇది మనుషుల్లో తీవ్ర అనారోగ్యానికి కారణం అవుతుంది. ముఖ్యంగా  పౌల్ట్రీ రంగంలో పనిచేసేవారికి ఇది సోకే అవకాశం ఎక్కువగా వుంటుంది. 

బర్డ్ ప్లూ సోకిన 2 నుండి 6 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి. ఇది సోకినవారు జలుబు, ముక్కుకారడం, శ్వాస తీసుకోడంలో ఇబ్బంది వుంటుంది.ముక్కు మూసుకుపోవడం,గొంతునొప్పి, దగ్గు లక్షణాలు కనిపిస్తాయి.

కొందరిలో బర్డ్ ప్లూ కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. తీవ్రమైన తలనొప్పి, హైఫీవర్, తీవ్ర అలసట, కాళ్లు చేతుల కండరాల నొప్పులు, వికారం, వాంతులు విరేచనాలతో ఇబ్బందిపడతారు. ఒక్కోసారి ఇది అవయవ వైకల్యానికి ,న్యుమోనియాకు దారితీస్తుంది... ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. 

ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యసాయం పొందాలి. అయితే వైరస్ సోకినతర్వాత వైద్యం తీసుకోవడంకంటే సోకకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవడం మంచింది. కాబట్టి కొద్దిరోజులు చికెన్ కొద్దిరోజులు చికెన్ కు దూరంగా వుండటం మంచిది. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
CM Chandrababu Naidu: కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమ్మోనియా పరిశ్రమకు శంకుస్థాపన చేసిన సీఎం | Asianet
Recommended image2
Now Playing
CM Chandrababu Naidu: కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమ్మోనియాచంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu
Recommended image3
Now Playing
Pawan Kalyan Powerful Speech: ఇది దేశానికే గేమ్ చేంజర్ పవన్ పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved