స్టీల్ ప్లాంట్ కార్మికుడి వేషధారణలో నారా లోకేష్... వైజాగ్ భారీ రోడ్ షో

First Published Mar 4, 2021, 1:52 PM IST

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విశాఖపట్నంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. గాజువాకలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి టిడిపి తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు,ముఖ్య నేతలతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే టిడిపి మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించి ఓటు వెయ్యాలని కోరారు. ఆ తర్వాత గాజువాకలోనే రోడ్ షో లో నిర్వహించారు లోకేష్. ఈ క్రమంలోనే కార్మికులు వాడే పార,హెల్మెట్ ను ధరించి స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా నిలిచారు.