సొంతజిల్లాలో ఇదీ చంద్రబాబు పరిస్థితి... కటిక నేలపైనే కూర్చుని నిరసన (ఫోటోలు)

First Published Mar 1, 2021, 2:23 PM IST

తిరుపతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆయన తిరుపతిలో తలపెట్టిన దీక్షకు కూడా అనుమతి లేదని తేల్చి చెప్పారు. అయినప్పటికి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో చంద్రబాబు విమానాశ్రయంలో నేలపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు.