స్కూళ్లకు సెలవులు... ఎప్పట్నుంచంటే?
కుండపోత వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా తయారయ్యింది. దీంతో తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఈ సెలవులు ఎప్పట్నుంచంటే...?
School Holidays
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర ప్రదేశ్ లోని పలు జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. మరో రెండుమూడు రోజులపాటు తెలుగురాష్ట్రాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వర్షపాతం ఎక్కువగా వున్న జిల్లాల్లో సోమవారం స్కూళ్లకు సెలవు ప్రకటించారు. వర్షాలు కొనసాగితే సెలవులు పొడిగించే అవకాశాలున్నాయి.
School Holidays
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. మరో రెండ్రోజులు కూడా నగరంలో భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో హైదరాబాద్ లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ సీఎస్ శాంతికుమారి కూడా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, జిల్లాల్లో పరిస్థితిపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కొన్నిప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా వుండాలని కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాల్లో పరిస్థితిని బట్టి స్కూళ్లకు సెలవులపై కలెక్టర్లే నిర్ణయం తీసుకోవాలని సీఎస్ సూచించారు.
School Holidays
ఇక ఆంధ్ర ప్రదేశ్ లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండురోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుంది...కొన్ని ప్రాంతాల్లో మరింత పెరిగి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలోనే వర్షతీవ్రత ఎక్కువగా వున్న జిల్లాల కలెక్టర్లు అప్రమత్తమయ్యారు.
ఇప్పటికే పలు జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవు ప్రకటించారు. రేపు ఎలాగు ఆదివారం కాబట్టి స్కూళ్లకు సెలవు వుంటుంది. సోమవారం కూడా వర్షాలు కొనసాగే అవకాశమున్న జిల్లాల్లో సెలవులు ప్రకటించనున్నారు.
ఇవాళ(శనివారం) విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు. గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, కాకినాడ, అల్లూరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. కాకినాడలో నేడు నిర్వహించాల్సిన పరీక్షను వాయిదా వేసారు. మిగతాజిల్లాల్లో కూడా పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకున్నారు.
School Holidays
ప్రస్తుతం ఏపీలో కురుస్తున్న కుండపోత వర్షాలు, వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. మంత్రులు, జిల్లాల కలెక్టర్లు,ఎస్పీలు, ముఖ్య అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించి పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్బంగా భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో వెంటనే విద్యసంస్థలకు సెలవు ప్రకటించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలే కాదు ప్రైవేట్ విద్యాసంస్థలు కూడా తప్పకుండా ఆదేశాలను పాటించాలని సూచించారు. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలా వద్దా అన్నది జిల్లా అధికారులే నిర్ణయిస్తారని చంద్రబాబు పేర్కొన్నారు.
School Holidays
తెలుగు రాష్ట్రాలకు ఐఎండి రెడ్ అలర్ట్ ప్రకటించింది. చత్తీస్ ఘడ్, ఒడిషా, విదర్భ, కర్ణాటకతో పాటు రాయలసీమకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆదివారం ఎలాగూ సెలవు కాబట్టి సోమవారం పలుజిల్లాల్లో ఇప్పటికే సెలవు ప్రకటించారు. ఆదివారం పరిస్థితిని బట్టి మరికొన్ని జిల్లాల్లో స్కూళ్లకు సెలవులపై నిర్ణయం తీసుకోనున్నారు. సోమవారం కూడా వర్షాలు కొనసాగితే పలు జిల్లాల్లో మంగళవారం కూడా సెలవు వుండే అవకాశాలున్నాయి. అంటే మూడు రోజుల పాటు స్కూళ్లకు వర్షాల కారణంగా వరుస సెలవు వస్తోంది.