రఘురామ, వల్లభనేని వంశీ: జగన్, చంద్రబాబులకు సీన్ రిపీట్

First Published 18, Jul 2020, 4:55 PM

లోక్ సభలోని ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అచ్చంగా రాష్ట్రంలోని పరిస్థితులే కంటికి కట్టినట్టుగా కనబడుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రఘురామ వ్యవహారం మంచి రంజుమీదుంది. ఆయనమీద లోక్ సభ స్పీకర్ కి ఫిర్యాదు చేసి ఆయనపై అనర్హత వేటు కూడా వేయాలని కోరారు వైసీపీ సభ్యులు. ఆయనపై ఫిర్యాదు ఇవ్వడంతో రఘురామ ఇక పార్టీలోకి తిరిగి చేరే అవకాశం లేదన్న విషయం అర్థమైపోయింది.

ఇక ఆ సంఘటన జరిగిన తరువాత తాజాగా రఘురామా కూర్చునే సీటు లోక్ సభలో మార్పుకు గురయ్యింది. గతంలో నాలుగో లైన్ లో ఉన్న ఆయన సీటును ఏడో లైన్ లోకి మారుస్తూ లోకసభ అధికారులు సర్క్యులర్ జారీ చేశారు. వైసీపీ పక్ష నేత ఇచ్చిన సూచన మేరకు ఈ మార్పులు చేసినట్లు సంబంధిత అధికారులు చెప్పారు.

రఘురామకృష్ణమ రాజు 379వ సీటులో ఉండేవారు. ఇప్పుడు 445వ సీటుకు మారారు. మార్గాని భరత్ 385 నుంచి 379కు వచ్చారు. వారితో పాటు కోటగిరి శ్రీధర్ సీటును 421 నుంచి 385కు మార్చారు. బెల్లన చంద్రశేఖర్ సీటును 445 నుంచి 421 మార్చారు.సీటు నెంబర్ లను పక్కనబెడితే... రఘురామను మాత్రం వెనక్కి పంపించారు.

ఈ లోక్ సభలోని ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అచ్చంగా రాష్ట్రంలోని పరిస్థితులే కంటికి కట్టినట్టుగా కనబడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సైతం ఇదే పరిస్థితి మనకు కనబడుతుంది. టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం లు టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలుగా టీడీపీ వెనుక వరుసలో కూర్చుంటారు.

ఇక్కడ వారు సైతం టీడీపీ మీద దుమ్మెత్తిపోస్తారు, వేరే పార్టీ వైసీపీతో కలిసిమెలిసి తిరుగుతారు కానీ టెక్నికల్ గా మాత్రం టీడీపీ  వారిపై అనర్హత వేటు పడదు. వారిని అనర్హులుగా ప్రకటించమని టీడీపీ కోరినా కూడా స్పీకర్ వారిని అనర్హులుగా ప్రకటించరు.

లోక్ సభలో కూడా ఇప్పుడు ఏపీ అసెంబ్లీ పరిస్థితులే రిపీట్ అవుతున్నాయి. రఘురామ సైతం వైసీపీ నేతలను ఉతికి ఆరేస్తున్నారు. ఆయన జగన్ మా నాయకుడు అంటూనే వైసీపీ నేతలను ఒక ఆట ఆడుకుంటున్నాడు. ఆయన సైతం బీజేపీ నేతలతో కలిసి ఢిల్లీలో సన్నిహితంగా మెలుగుతున్నాడు.

టీడీపీ మీద విరుచుకుపడుతున్న టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల్లో కూడా వారంతా టీడీపీ విప్ జారీ చేస్తే వచ్చారు, కానీ చెల్లకుండా వోట్ వేశారు. ఇక ఆ తరువాత మళ్లీ యథాప్రకారంగా నాకు విప్ ఇచ్చేన్తా మొగుడా అంటూ విరుచుకుపడ్డారు. వీరంతా పార్టీ నుంచి బయటకు వెళ్లకుండా, పార్టీలోనే ఉంటూ సొంతపార్టీపై విరుచుకుపడుతున్నారు.

వీరందరిలో కనీసం వల్లభనేని వంశినైనా సూత్రప్రాయంగా బహిష్కరిస్తామని టీడీపీ చెప్పింది. మిగిలిన మద్దాలి గిరి, కారణం బలరాం లు అయితే... ఇంకా అధికారికంగా పార్టీలో కొనసాగుతున్నవారే. వారు ఒకరకంగా చెప్పాలంటే... వైసీపీ కండువాతో టీడీపీ సీట్లలో కూర్చున్నారాని అనవచ్చు.

జగన్ తమ పార్టీలోకి రావాలంటే... పదవికి రాజీనామా చేసి రావాలి అని చెప్పారు. వారంతా వైసీపీ ఖండువా కప్పుకొని జగన్ దగ్గర వైసీపీ తీర్థం పుచ్చుకున్నప్పటికీ... టెక్నికల్ గా వారంతా ఇంకా టీడీపీలో కొనసాగుతున్నవారే.

టీడీపీ రెబెల్స్ టెక్నికల్ గా టీడీపీ, మాట్లాడేది వైసీపీ తరుపున తిట్టేది టీడీపీ పార్టీని, టీడీపీ అధినేత చంద్రబాబుని. ఇక్కడ రఘురామకృష్ణంరాజు కూడా అచ్చం ఇలాగే ప్రవర్తిస్తున్నారు. ఆయన ఉండేది వైసీపీ, ఒకరకంగా పాడేది బీజేపీ పాట, తిట్టేది వైసీపీ నాయకులను.

రాష్ట్రంలోని అసెంబ్లీ వరకే పరిమితమైన ఈ పరిస్థితి ఇప్పుడు దేశ రాజధానిలోని పార్లమెంటుకు చేరింది. తనను ఏమీ చేయలేక ఇప్పుడు తన సీటును మార్చి సంతోషించాలని అనుకుంటున్నారని రఘురామ మరోసారి వైసీపీపై విరుచుకుపడ్డారు. దీనివల్ల నష్టం మాత్రం వైసీపీకే!

loader