Rare earths : మీ భూముల్లో అలాంటి రాళ్లు ఉన్నాయా... అయితే బంగారం ఉన్నట్లే!
మీరు వ్యవసాయ భూమిని కలిగివున్నారా? ఆ భూమిలో రాళ్లురప్పలు వున్నాయా? అయితే అవి బంగారం కంటే విలువైన అరుదైన రాళ్లేమో చూడండి? ఆ రాళ్ల విలువ తెలియాలంటే రేర్ ఎర్త్ అని పిలిచే 17 మూలకాల గురించి తెలుసుకోవాల్సిందే.

rare earth elements
యుద్ధంలో ఉక్రెయిన్ కి అమెరికా సాయం చేయాలంటే.. ట్రంప్ ఆ దేశాన్ని ఒకే ఒక కోరిక కోరాడు. ఆ కోరిక ఏమిటంటే ఉక్రెయిన్ దగ్గరున్న రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అమెరికాకు ఇవ్వండి అని. ఎందుకంటే భవిష్యత్తులో వీటి విలువ బంగారాన్ని మించిపోనుంది. మన ఏపీలోని అనంతపురంలోనూ ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి. వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం.
rare earth elements
ఏమిటీ రేర్ ఎర్త్ మూలకాలు :
రేర్ ఎర్త్స్ అనేవి 17 రసాయన మూలకాలు. ఇవి నేటి అధునాతన సాంకేతిక పరికరాలకు కీలకమైన భాగాలు. ఇవి విద్యుత్ తయారీ పరిశ్రమకు ఆధారమైనవి. స్మార్ట్‌ఫోన్‌లు, కెమెరాలు, ఫ్లాట్-స్క్రీన్ టెలివిజన్‌లు, కంప్యూటర్‌లు, ఆయుధాలు వంటి అనేక ఉత్పత్తుల తయారీలో ఉపయోగపడతాయి. అందువల్లే వీటికి చాలా డిమాండ్ వుంది.
ఇలా ఎంతో ప్రాముఖ్యత కలిగిన రేర్ ఎర్త్స్ లో ప్రధాన మైనది నియోడిమియం. దీనిని విద్యుత్ కార్లు , విండ్ టర్బైన్ జనరేటర్లలో కనిపించే అధిక శక్తివంతమైన అయస్కాంతాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు.
ఇక మరో విలువైన మూలకం టెర్బియం... ఇది ఒక ఫాస్ఫోరసెంట్. అంటే బాగా ప్రకాశిస్తుంది. దీనిని LED లైట్లను మరింత ప్రకాశంగా చేసేందుకు వాడతారు. లాంతానం శక్తివంతమైన ఫైబర్ ఆప్టిక్స్ తయారీలో ఉపయోగించబడుతుంది. అలాగే సీరియం అనే అధిక శక్తి గల బ్యాటరీలు, కాంపాక్ట్ ఫ్లోరెసెంట్ లైట్లలో ఉపయోగిస్తారు.
rare earth elements
ఆంధ్ర ప్రదేశ్ లో రేర్ ఎర్త్స్ ఆనవాళ్లు :
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో ఈ అరుదైన భూమి మూలకాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. అనంతపురంలోని శిలలను అత్యంత సూక్ష్మంగా పరిశీలించామని.. వాటిలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్నట్టు నిర్ధారించుకున్నామని హైదరాబాద్‌లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు తెలిపారు.
ఇక్కడ లాంతనం, సెరియం, ప్రాసియోడైమియం, నియోడైమియం, ఇట్రియం, హాఫ్నియం, టాంటాలం, నియోబియం, జిర్కోనియం, స్కాండియం వంటి మూలకాలు ఉంటాయని చెబుతున్నారు.
ప్రస్తుతం ఉన్న డిమాండ్‌తో పోల్చుకుంటే 2050 నాటికి ఆర్‌ఈఈల అవసరం 26 రెట్లు పెరుగుతుందనేది నిపుణుల మాట. డిజిటలైజేషన్ పెరుగుతున్న కొద్దీ ఈ మూలకాల వినియోగం పెరుగుతుందని అంటున్నారు. వీటి డిమాండ్ బంగారాన్ని మించి పోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.