- Home
- Andhra Pradesh
- చంద్రబాబుపై వెల్లువెత్తుతోన్న అభిమానం .. తరలివస్తోన్న ప్రజలు, 2 గంటలైనా రాజమండ్రిలోనే కాన్వాయ్ (ఫోటోలు)
చంద్రబాబుపై వెల్లువెత్తుతోన్న అభిమానం .. తరలివస్తోన్న ప్రజలు, 2 గంటలైనా రాజమండ్రిలోనే కాన్వాయ్ (ఫోటోలు)
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో మధ్యంతర బెయిల్ లభించడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు . ప్రజలు కూడా చంద్రబాబు వాహన శ్రేణి ప్రయాణిస్తున్న రోడ్డుకు ఇరువైపులా నిలబడి సంఘీభావం తెలియజేస్తున్నారు.

chandrababu
జైలు నుంచి విడుదలయ్యాక రోడ్డు మార్గంలో అమరావతికి బయల్దేరారు చంద్రబాబు. అయితే భారీగా ప్రజలు తరలిరావడంతో రోడ్లపై ట్రాఫిక్ జాం అయ్యింది. బయల్దేరి 2 గంటలైనా చంద్రబాబు కాన్వాయ్ ఇంకా రాజమండ్రి దాటలేదు
chandrababu
తన ర్యాలీలో కోర్టు ఆదేశించిన బెయిల్ షరతులను పాటిస్తున్నారు చంద్రబాబు. టీడీపీ శ్రేణులు, ప్రజలకు కారులో వుండే అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. కార్యకర్తలు సంయమనం పాటిస్తూ సహకరించాలని అచ్చెన్నాయుడు కోరారు.
chandrababu
అడుగడుగునా పెట్టిన పోలీసు ఆంక్షలను లెక్కచేయకుండా రాజమండ్రి సమీపంలోని వేమగిరి వద్ద జాతీయ రహదారిపైకి చేరుకున్నారు వేలాది అభిమానులు . కనీవినీ ఎరుగని రీతిలో చంద్రబాబు నాయుడుకు పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజల అపూర్వస్వాగతం పలికారు.
chandrababu
రాజమండ్రి నగరమంతా జై బాబు.. జై తెలుగుదేశం నినాదాలతో మారుమోగుతోంది. అయితే కాన్వాయ్‌కి 3 కిలోమీటర్ల వెనుకనే పార్టీ శ్రేణుల వాహనాలను నిలిపివేస్తున్నారు పోలీసులు. అయినప్పటికీ బారికేడ్లను తోసుకుంటూ చంద్రబాబును చూసేందుకు రోడ్లపైకి జనం బారులు తీరుతున్నారు.
chandrababu
దివాన్ చెరువు వద్ద వ్యూహాత్మకంగా చంద్రబాబు కాన్వాయ్‌ని వదిలి ప్రైవేటు వాహనాలను అడ్డుపెట్టి ట్రాఫిక్ జామ్ చేశారు పోలీసులు . అలాగే చంద్రబాబును అనుసరిస్తున్న పార్టీ నేతల వాహనాలను దివాన్ చెరువు వద్దే నిలిపివేశారు. భారీకేడ్లను అడ్డుపెట్టి వాహనాలను నిలువరించడంతో పోలీసులపై టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.