చిరంజీవి కోటరీలో పొలిటికల్ ఉద్దండులు: రీ ఎంట్రీపై మెగా అభిమానుల్లో చర్చ, ఇక సంచలనమేనా...?

First Published Oct 10, 2019, 8:45 PM IST

మెగాస్టార్ చిరంజీవికి అన్ని పార్టీల నేతలు రెడ్ కార్పెట్ వేయడంతో స్వర్గలోకంలో సింహాసనం ఆ ఇంద్రుడిది అయితే ఈ ఇండస్ట్రీలో సింహాసనం చిరంజీవిదేనని అభిమానులు చెప్పుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. 

సినీ ఇండస్ట్రీలో రికార్డులు మోతమోగించడంలో ఆయనకు ఆయనే సాటి. ఏ పాత్ర ఇచ్చినా ఆపాత్రలో ఒదిగిపోవడం ఆయన నైజం. ఏ రంగంలోనైనా ఆయనకంటూ ఒక ప్రత్యేక అభిమానాన్ని సొంతం చేసుకోవడంలో ఆయనకు ఆయనే సాటి.

టాలీవుడ్ లో అగ్రనటుడుగా సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా వెలుగొందుతున్న మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రంగంలో అడుగుపెట్టారు. 2009లో రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన చిరంజీవి త్రిముఖ పోరులో కూడా కీలకస్థానాలను కైవసం చేసుకున్నారు.

అంతటితో ఆగిపోలేదు. ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా, కేంద్రమంత్రిగా ఇలా రాజకీయాల్లో ఎన్నో పదవులు చేపట్టిన ఆయన ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం సినిమాలపై దృష్టి సారించారు. దాదాపు తొమ్మిదేళ్లు సినీ ఇండస్ట్రీకి దూరమైన చిరంజీవి ఖైదీనంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు.

తొమ్మిదేళ్ల విరామం అనంతరం విడుదలవుతున్న ఖైదీ నంబర్ 150పై అందరికీ సందేహాలు నెలకొన్నాయి. చిరంజీవిని ప్రజలు ఆదరిస్తారా అన్న సందేహం నెలకొంటే ఆయన చిరంజీవి మాత్రం తన ఫ్యాన్స్ ని నమ్ముకున్నారు.

ఖైదీ నంబర్ 150 సినిమా విడుదలవ్వడం రికార్డులు బ్రేక్ చేయడంతో చిరంజీవి ఛరిష్మా ఏమాత్రం తగ్గలేదని నిరూపించారు. చిరంజీవి చిత్రానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బాస్ ఈజ్ బేక్ అంటూ జేజేలు పలికారు.

అదేపౌరుషం, అదే ఉత్సాహంతో మరో చారిత్రాత్మకమైన సబ్జెక్టుతో సైరా నరసింహారెడ్డి మూవీలో నటించారు. ఆ సినిమా కూడా విజయవంతం అయ్యింది. సినిమా ప్రమోషన్లో భాగంగా చిరంజీవి అండ్ టీం  దేశమంతా పర్యటించారు. నానా హంగామా చేశారు.

అయితే సైరా మూవీ రిలీజ్ అనంతరం చిరంజీవి తొలిసారిగా ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. చిరంజీవి సొంత జిల్లా అయిన పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించారు. దివంగత నటుడు ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహ ఆవిష్కరణకు హాజరయ్యారు.

ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహావిష్కరణకు హాజరైన చిరంజీవికి అన్ని రాజకీయ పార్టీల నేతలు దాసోహం అయ్యారంటే అతిశయోక్తి కాదు. అధికార, ప్రతిపక్ష, విపక్ష పార్టీలతో సహా అన్ని పార్టీల నేతలు చిరంజీవిపై అభిమానం చాటుకున్నారు.

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు, తాడేపల్లిగూడెం వైసీపీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణలు చిరంజీవి రాకకు సంబంధించి కీలక ఏర్పాట్లు చేశారు. కమిటీ ఉన్నప్పటికీ ఈ నేతలు ఇద్దరూ ముందు వరుసలో ఉండి చిరంజీవికి ఘన స్వాగతం పలికారు.

అంతేకాదు సినీ ఇండస్ట్రీ ఉన్నంత వరకు చిరంజీవి చిరంజీవేనంటూ ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రశంసలు కురిపించారు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి ఎదురైన సమస్యలను తొలగించడంలో కీలక పాత్ర వహించింది స్థానిక ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ. ఈ విషయాలను స్వయంగా చిరంజీవే ప్రకటించారు.

ఇకపోతే తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీమంత్రి, విశాఖపట్నం ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సైతం చిరంజీవి వెన్నంటే ఉన్నారు. చిరంజీవి కుటుంబంతో ఉన్న సత్సబంధాల నేపథ్యంలో ఆయన హైదరాబాద్ నుంచి చిరంజీవికి తోడుగా ఉన్నారు.

హైదరాబాద్ నుంచి నేరుగా తాడేపల్లిలోని విగ్రహ ఆవిష్కరణ వేదిక వరకు చిరంజీవిని తోడ్కొని వచ్చింది గంటా శ్రీనివాసరావే. ఇకపోతే తెలుగుదేశం పార్టీకి చెందిన మరో కీలక నేత ఈలి నాని సైతం విగ్రహ ఆవిష్కరణ వేడుకల్లో కీలక పాత్ర పోషించడం విశేషం.

మరోవైపు బీజేపీ నేతలు సైతం చిరంజీవికి బ్రహ్మరథం పట్టారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మాజీమంత్రి మాణిక్యాలరావు చిరంజీవి వెన్నంటే ఉన్నారు. స్టేజ్ వెనక ఉన్న ఆయనను చిరంజీవీ స్వయంగా పిలిచి మరీ పక్కన కూర్చోబెట్టుకున్నారు.

అంతేకాదండోయ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీమంత్రి వట్టి వసంతకుమార్ సైతం చిరంజీవి పర్యటనలో హల్ చల్ చేశారు. చిరంజీవితో ఉన్న సాన్నిహిత్యంతో మైక్ తీసుకుని అధ్యక్షత వహించారు వసంతకుమార్.

ఇలా చిరంజీవి పర్యటనలో అన్ని పార్టీల నేతలు పాల్గొనడంతో చిరంజీవి పొలిటికల్ ఫ్యూచర్ పై మరోసారి ఆసక్తికర చర్చ జరుగుతోంది. చిరంజీవి ఏ రంగంలో ఉన్నా ఆయన ఆదరణ ఏమాత్రం తగ్గలేదని ప్రజలు చెప్పుకుంటున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవిని తప్పక మళ్లీ ఆదరిస్తారన్న నమ్మకం ఉందంటున్నారు ప్రజలు.

అంతేకాదు గతంలో రాజకీయాల్లో కీలక నేతలుగా ఉంటూ ఒంటిచేత్తో రాజకీయాలను తిప్పిన ఉద్దండులు సైతం మెగాస్టార్ పర్యటనలో హల్ చల్ చేయడంతో వారంతా చిరంజీవికి అండగా ఉన్నారన్న సందేహాలు నెలకొన్నాయి.

ఈ సందర్భంగా ఇంద్ర సినిమాలోని ఒక డైలాగ్ గుర్తుకు తెస్తున్నారు మెగా అభిమానులు. వస్తాననుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గానీ ఆశ్చర్యపోతారే అన్నట్లుగా చిరంజీవి రాకతో పోల్చుతున్నారు.

రాననుకున్నారా రాలేననుకున్నారా... కాశీకి పోయాడు కాషాయం మనిషైపోయాడు అనుకుంటున్నారా.... వారణాసిలో బతికి ఉంటున్నాడు తన వరస మార్చి ఉంటాడనుకుంటున్నారా....అదే రక్తం.

అదే పౌరుషం  అంటూ చిరంజీవి చెప్పిన డైలాగులు మెగా అభిమాని ప్రతీ ఒక్కరూ తలచుకుంటున్నారు. రాజకీయాలు వదిలేసి సినిమా రంగంలోకి వెళ్లినా ఆయన పొలిటికల్ జోష్ ఏమాత్రం తగ్గలేదని చెప్పుకుంటున్నారు.

ఇప్పటికి ఇప్పుడు ఏపీలో చిరంజీవి పార్టీ పెడితే చేరేందుకు నేతలు క్యూ కడతారని చెప్పుకుంటున్నారు. అందుకు తాడేపల్లిలోని విగ్రహావిష్కరణ వేదికే నిదర్శనంగా చూపిస్తున్నారు మెగా పవర్ అభిమానులు. మెుత్తానికి చిరంజీవి అభిమానులు మాత్రం మాంచి జోష్ లో ఉన్నారనే చెప్పాలి.

ఇప్పటికి ఇప్పుడు ఏపీలో చిరంజీవి పార్టీ పెడితే చేరేందుకు నేతలు క్యూ కడతారని చెప్పుకుంటున్నారు. అందుకు తాడేపల్లిలోని విగ్రహావిష్కరణ వేదికే నిదర్శనంగా చూపిస్తున్నారు మెగా పవర్ అభిమానులు. మెుత్తానికి చిరంజీవి అభిమానులు మాత్రం మాంచి జోష్ లో ఉన్నారనే చెప్పాలి.

మెగాస్టార్ చిరంజీవికి అన్ని పార్టీల నేతలు రెడ్ కార్పెట్ వేయడంతో స్వర్గలోకంలో సింహాసనం ఆ ఇంద్రుడిది అయితే ఈ ఇండస్ట్రీలో సింహాసనం చిరంజీవిదేనని అభిమానులు చెప్పుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు.

మెగాస్టార్ చిరంజీవికి అన్ని పార్టీల నేతలు రెడ్ కార్పెట్ వేయడంతో స్వర్గలోకంలో సింహాసనం ఆ ఇంద్రుడిది అయితే ఈ ఇండస్ట్రీలో సింహాసనం చిరంజీవిదేనని అభిమానులు చెప్పుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?