జగన్ కు మోడీ భర్త్ డే విషెస్: వెల్లువెత్తుతున్న జన్మదిన శుభాకాంక్షలు
First Published Dec 21, 2020, 11:50 AM IST
దేశ ప్రధాని నరేంద్ర మోదీ జగన్ కు ప్రత్యేకంగా భర్త్ డే విషెస్ తెలిపారు. అలాగే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, తెలుగు రాష్ట్రాల్లో యూకే హైకమీషనర్, రాష్ట్ర మంత్రులు, వైసిపి ఎమ్మెల్యేలు, నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు రాష్ట్రంనుండే కాదు జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే దేశ ప్రధాని నరేంద్ర మోదీ జగన్ కు ప్రత్యేకంగా భర్త్ డే విషెస్ తెలిపారు. అలాగే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, తెలుగు రాష్ట్రాల్లో యూకే హైకమీషనర్, రాష్ట్ర మంత్రులు, వైసిపి ఎమ్మెల్యేలు, నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

''ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయనకు ఆ దేవుడు చిరకాలం ఆయురారోగ్యాలు ప్రసాధించాలని కోరుకుంటున్నా'' అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?