MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Andhra Pradesh
  • Janasena : నన్ను తిట్టని తిట్టు లేదు.. అసెంబ్లీ గేటు బద్దలు కొట్టా : పవన్ కళ్యాణ్

Janasena : నన్ను తిట్టని తిట్టు లేదు.. అసెంబ్లీ గేటు బద్దలు కొట్టా : పవన్ కళ్యాణ్

Pawan Kalyan: జనసేన వార్షికోత్సవ సభలో జనసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణలో కరెంట్ షాక్ వచ్చి తాను చనిపోయే ప‌రిస్థితి వ‌స్తే తనకు కొండగట్టు ఆంజనేయ స్వామి, తెలంగాణ నేల పునర్జన్మను ఇచ్చిందని చెప్పారు. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 14 2025, 11:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
Pawan Kalyan, Janasena

Pawan Kalyan, Janasena

Jana Sena Annual Meeting: గత దశాబ్దంలో అనేక సవాళ్లను ఎదుర్కొని నిల‌బడిన‌ పార్టీ జనసేన.. 2024లో సార్వత్రిక ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్‌తో అద్భుతమైన విజ‌యంతో యావ‌త్ భార‌తావ‌ని దృష్టిని ఆకర్షించింది. ప‌వ‌ర్ స్టార్ కొణిదెల పవన్ కళ్యాణ్ మార్చి 14, 2014న స్థాపించిన ఈ పార్టీ ఇప్పుడు దాని వార్షికోత్స‌వాన్ని ఘ‌నంగా జ‌రుపుకుంది. శుక్రవారం పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోని చిత్రాడ గ్రామంలో భారీ ప్లీనరీతో జ‌న‌సేన పార్టీ త‌న 12వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది. 

జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ స‌భ జ‌య‌కేత‌నంలో ఆ పార్టీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ.. త‌న రాజ‌కీయ జీవితంలో త‌న‌ను తిట్టని తిట్టు లేదని అన్నారు. అంచుకు కూడా రానివ్వ‌మ‌న్న చోట అసెంబ్లీ గేటు బద్దలు కొట్టుకుంటూ వచ్చామ‌ని ప‌వ‌ర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు. 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమ‌ని త‌న‌ను తీవ్రంగా అవమానించారనీ,  అలాంటిది అసెంబ్లీ గేటు బద్దలు కొట్టుకుంటూ వందశాతం స్ట్రైక్ రేట్ సాధించామని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్ర‌జ‌ల ఆశీర్వాదంతో ముందుకు న‌డుస్తున్నామ‌ని చెప్పారు. గ‌త వైకాపా పాల‌న‌ను ప్ర‌స్తావిస్తూ..  గత ఐదేండ్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో హింసను సాగించారనీ, ప్రతిపక్షాలను వేధించారని పేర్కొన్నారు. తనను గ‌త ప్ర‌భుత్వ నాయ‌కులు, వైకాపా నేతలు తిట్టని తిట్టు లేదన్నారు. వారికి ప్ర‌జ‌లు త‌గిన బుద్ది చెప్పార‌న్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22
AP Deputy CM Pawan Kalyan, janasena, Pawan Kalyan

AP Deputy CM Pawan Kalyan, janasena, Pawan Kalyan

అలాగే, త‌న‌పై, స‌నాత‌న‌ధ‌ర్మంపై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని పేర్కొన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. తాను మొద‌టి నుంచి  నుంచి సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాని చెప్పారు. కానీ, చాలా మంది తాను సెక్యులర్ నుంచి సనాతన ధర్మానికి మారిపోయాను అనుకుంటున్నార‌ని పేర్కొన్నారు. కొంత‌కాలం క్రితం పాతబస్తీలో ఒక నేత ఒక గంట టైమ్ ఇస్తే హిందువులను చంపేస్తామనే కామెంట్స్ ను ప్ర‌స్తావిస్తూ.. అలాంటి వ్యాఖ్య‌లు చేస్తే త‌మ‌కు కోసం  రాదా.. మ‌న రాముడి తలను నరికేస్తామంటే మాకు కోపం రావొద్దంటే ఎలా అని ప్ర‌శ్న‌లు కురిపించారు. 

జనసేన జన్మస్థలం తెలంగాణ అయితే కర్మస్థానం ఆంధ్ర‌ప్ర‌దేశ్ అని జ‌న‌సేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణ కోటీ ర‌త‌నాల వీణ అంటూ త‌న ప్ర‌సంగం ముందుకు సాగించిన ప‌వ‌న్.. తెలంగాణ అంటే త‌న‌కు ఎంతో గౌరవమని చెప్పారు. తెలంగాణతో జనసేనకు విడదీయరాని అనుబంధం ఉంద‌నీ, అక్కడి నుంచి జ‌య‌కేత‌నం స‌భ‌కు వ‌చ్చిన వారికి ధన్యవాదాలు తెలిపారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
జనసేన
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Crop insurance: రైతులకు గుడ్ న్యూస్.. పంటల బీమా గడువు పెంపు.. దీని ప్రయోజనాలు ఏంటో తెలుసా?
Recommended image2
Dakshina Kailasam: గ్రహణ సమయంలోనూ మూయని ఏకైక గుడి.. ఈ ఆలయానికి జీవితంలో ఒక్కసారైనా ఎందుకు వెళ్లాలి?
Recommended image3
Weather Update: పసిఫిక్ లో 2 తుపాన్లు.. ఇటు బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు అలర్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved