కనీసం కూర్చోలేని స్థితిలో చంద్రబాబు వున్నారట... కటకటాల్లో భర్తను చూసి తల్లడిల్లిన భువనేశ్వరి
అనారోగ్యంతో బాధపడుతూ జైలుగోడల మధ్య బందీగా వున్న భర్త చంద్రబాబు నాాయుడిని చూసి నారా భువనేశ్వరి తల్లడిల్లిపోయారట. ఒంటిపై దద్దుర్లు, బరువు తగ్గిన ఆయన కనీసం కూర్చోలేని పరిస్థితిలో వున్నట్లు సమాచారం.
Nara Bhuvaneshwari
రాజమండ్రి : రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా, టిడిపి అధినేతగా ఎప్పుడూ ఠీవీగా కనిపించే భర్త చంద్రబాబును కటకటాల వెనక చూసి నారా భువనేశ్వరి కన్నీటిపర్యంతం అయినట్లు తెలుస్తోంది. జైలు గోడల మద్య భర్త బందీగా వుండటమే ఆమెను బాధిస్తుంటే... ఆయన అనారోగ్యం పాలవడంతో మరింత తల్లడిల్లేలా చేస్తోందట. బాగా బరువుతగ్గి, ఒళ్ళంతా దద్దుర్లతో చంద్రబాబును చూసిన భువనేశ్వరి, నారా లోకేష్ భావోద్వేగానికి గురయ్యారు.
lokesh
శనివారం సాయంత్రం నారా భువనేశ్వరి, లోకేష్ లతో పాటు తెలంగాణ టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. ఇలా రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్లి భర్తను చూడగానే భువనేశ్వరి తట్టుకోలేకపోయారని... భావోద్వేగానికి గురయినట్లు తెలుస్తోంది. గత నెలరోజులకు పైగా జైల్లో వుంటున్న భర్తను భువనేశ్వరి చాలాసార్లు కలిసారు... కానీ ఏనాడూ ఆమె ఇంతలా బాధపడింది లేదట. కనీసం కూర్చోడానికి కూడా చంద్రబాబు ఇబ్బంది పడుతున్నాడని... అతడి ధీన పరిస్థితిని చూసి భువనేశ్వరి కన్నీటిపర్యంతం అయ్యారట.
bhuvaneshwari
ఎప్పుడు చంద్రబాబుతో ములాఖత్ అయినా జైలు వద్దే మీడియాతో మాట్లాడుతుంటారు ఆయన కుటుంబసభ్యులు. ఇలా శనివారం కూడా ములాఖత్ అనంతరం లోకేష్ లేదంటే భువనేశ్వరి మాట్లాడతారని అందరూ భావించారు. కానీ జైల్లో చంద్రబాబు పరిస్థితిని చూసిన కుటుంబసభ్యులు ఆ బాధలో మాట్లాడలేక పోయారు. మీడియాతో మాట్లాడకుండానే తల్లిని తీసుకుని లోకేష్ రాజమండ్రిలోని తన శిబిరం వద్దకు వెళ్ళిపోయాడు.
bhuvaneshwari
రాజమండ్రి జైల్లో తీవ్రమైన ఉక్కపోత కారణంగా చంద్రబాబు చర్మ సంబంధిత సమస్యను ఎదుర్కొంటున్నారు. అతేకాదు ఆయన దాదాపు ఐదు కిలోల బరువు తగ్గినట్లు కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర నీరసంగా వున్న ఆయన కనీసం సరిగ్గా కూర్చోలేకపోతున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇలా అనారోగ్య సమస్యతో జైల్లో వున్న భర్తను చూసిన భువనేశ్వరి మనసు తల్లడిల్లిపోయిందట.
Nara Lokesh
తన తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నా రాజమండ్రి జైలు సిబ్బంది సరైన రీతిలో స్పందించడంలేదని... ఆయనకు ఏమైనా బాధ్యత మీదేనంటూ నారా లోకేష్ హెచ్చరించారు. చంద్రబాబు చర్మ సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్దారించి 48 గంటలు అయ్యింది... ఇప్పటివరకు వైద్యుల సూచనను ఎందుకు పాటించడంలేదని జైళ్ల శాఖ డిఐజిని లోకేష్ ప్రశ్నించారు. వైద్యుల నివేదిక అందిన తర్వాత కూడా చంద్రబాబు ఆరోగ్యంగానే వున్నారంటూ వైసిపి నాయకుడిలా మాట్లాడుతూ టిడిపి శ్రేణులను, రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని జైళ్ల శాఖ డిఐజిపై లోకేష్ ఆరోపణలు చేసారు.
తన తండ్రి ఆరోగ్యం గురించి ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించిన జైళ్ల శాఖ డిఐజి రవికుమార్ పట్టించుకోలేదని... ములాఖత్ సమయం ముగిసింది వెళ్లిపోవాలంటూ చాలా దురుసుగా ప్రవర్తించినట్లు టిడిపి పేర్కొంది. ఈ మేరకు చంద్రబాబుతో ఆయన కుటుంబం ములాఖత్, డిఐజి తీరుకు సంబంధించిన వివరాలను టిడిపి కార్యాలయం మీడియాకు విడుదల చేసారు.