- Home
- Andhra Pradesh
- ఇక నారా భువనేశ్వరి స్టైల్ పాలిటిక్స్...'మేలుకో తెలుగోడా' పేరిట రంగంలోకి ఎన్టీఆర్ కూతురు
ఇక నారా భువనేశ్వరి స్టైల్ పాలిటిక్స్...'మేలుకో తెలుగోడా' పేరిట రంగంలోకి ఎన్టీఆర్ కూతురు
చంద్రబాబు అరెస్ట్, లోకేష్ అరెస్ట్ ప్రచారంతో ఆందోళనలో వున్న టిడిపి శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు నారావారింటి కోడలు, ఎన్టీఆర్ కూతురు భువనేశ్వరి రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే గాంధీ జయంతిని నిరాహారదీక్షకు సిద్దమైన ఆమె ఆ తర్వాత బస్సు యాత్ర చేపట్టనున్నట్లు సమాచారం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
bhuvaneshwari
అమరావతి : భర్త చంద్రబాబును అరెస్ట్ చేసారు... కొడుకు లోకేష్ ను కూడా అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఇలా నారావారి కుటుంబం, తెలుగుదేశం పార్టీ కష్టాల్లో వుండటంతో స్వయంగా నారా భువనేశ్వరి రంగంలోకి దిగారు. తన కుటుంబానికి అండగా నిలవడమే కాదు టిడిపి శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి ఎన్టీఆర్ బిడ్డ రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు. భర్త అరెస్ట్ తర్వాత కేవలం నిరసనలకే పరిమితమైన భువనేశ్వరి ఇక ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. ఇందుకోసం ఇప్పటికే టిడిపి రాజకీయ కార్యాచరణ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
Chandrababu Arrest
అధినేత చంద్రబాబు జైల్లో, ఆయన కొడుకు లోకేష్ డిల్లీలో వుండటంతో టిడిపిలో నాయకత్వ లేమి స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో టిడిపి నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేవారు లేకుండాపోయారు. చంద్రబాబును జైల్లో పెట్టడంతో టిడిపి ఆందోళనకు పిలుపునిచ్చినా అవి ప్రజలను అంతగా కదిలించడం లేదు. దీంతో పార్టీ శ్రేణుల్లోనూ ఆందోళన మొదలయ్యింది. ఈ పరిస్థితిని గమనించిన టిడిపి సీనియర్లు నారా భువనేశ్వరిని రంగంలోకి దింపుతున్నారు.
Bhuvaneshwari
రాజకీయ నేపథ్యం గల కుటుంబంలో పుట్టిపెరిగి, రాజకీయ నాయకుడినే పెళ్ళాడారు నారా భువనేశ్వరి. కానీ ఆమె ఏనాడు రాజకీయాల్లో జోక్యం చేసుకున్నది లేదు. కానీ ఇప్పుడు అనివార్య పరిస్థితుల్లో ఆమె రాజకీయంగా యాక్టివ్ కావాల్సి వస్తోంది. తన భర్త అరెస్ట్ తర్వాత కేవలం ఆవేదనను వ్యక్తం చేస్తూ వస్తున్న భువనేశ్వరి ఇక టిడిపిని కాపాడుకునే బాధ్యతను కూడా భుజాన ఎత్తుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రజల్లోకి వెళ్లడానికి సిద్దమైన ఆమె బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.
tdp
ఈ వారంలోనే భువనేశ్వరి బస్సు యాత్రను ప్రారంభించేందుకు టిడిపి మూహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల సమావేశమైన టిడిపి రాజకీయ కార్యాచరణ కమిటీ సమావేశంలో ఈ బస్సుయాత్రపై చర్చించి రూట్ మ్యాప్ కూడా ఖరారు చేసినట్లు సమాచారం. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ బస్సు యాత్ర కొనసాగేలా, ఆయా జిల్లా కేంద్రాల్లో సభలు నిర్వహించేలనే ఆలోచనలో టిడిపి వుంది.
bhuvaneshwari
'మేలుకో తెలుగోడా' పేరును భువనేశ్వరి బస్సు యాత్రకు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు వారం రోజులపాటు ఈ యాత్ర సాగనుంది. ఏ తప్పూ చేయకున్నా తన భర్త చంద్రబాబును జైల్లో పెట్టారని ప్రజలకు తెలియజేయనున్నారు భువనేశ్వరి. అలాగే చంద్రబాబు అరెస్ట్ తర్వాత కాస్త ఢీలాపడ్డ టిడిపి శ్రేణుల్లో ఉత్తేజం నింపడానికి ఈ బస్సు యాత్ర ఉపయోగపడుతుందని టిడిపి పెద్దలు భావిస్తున్నారు.
Nara bhuvaneshwari
ఇదిలావుంటే చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా నారా భువనేశ్వరి నిరాహార దీక్షకు సిద్దమైనట్లు ఏపి టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజున (అక్టోబర్ 2న) ఆమె నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు.
TDP
ఇక గాంధీ జయంతి రోజున మరిన్ని నిరసన కార్యక్రమాలకు టిడిపి సిద్దమయ్యింది.చంద్రబాబు అరెస్ట్ కు వ్యతిరేకంగా అక్టోబర్ 2న రాత్రి 7గంటల నుండి 7.05 గంటల వరకు అంటే ఐదు నిమిషాలు ప్రతి ఇంట్లో లైట్లు ఆర్పేసి నిరసన తెలపాలని టిడిపి పిలుపునిచ్చింది. లైట్లు ఆర్పేసి కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలపాలని టిడిపి శ్రేణులు, రాష్ట్ర ప్రజలు అచ్చెన్నాయుడు సూచించారు.