ఏలూరే కాదు దెందులూరుకు పాకిన వింతరోగం: అధికారులకు సీఎం హెచ్చరిక
First Published Dec 7, 2020, 2:17 PM IST
ఏలూరులో వింత రోగం కారణంగా అస్వస్థతకు గురైన వారికి అందిస్తున్న వైద్య సహాయం సహా ఇప్పటివరకూ తీసుకున్న చర్యల గురించి వైద్యారోగ్య శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి జగన్.

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రజలు హటాత్తుగా అస్వస్థతకు గురయిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఇప్పుడు కేవలం ఏలూరులోనే కాదు యావత్ ఆంధ్ర ప్రదేశ్ లోనూ ఆందోళనకు కారణమయ్యింది. ఇలా వందల సంఖ్యలో ప్రజలు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం వైఎస్ జగన్ స్వయంగా పరామర్శించారు. వారికి అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. సీఎం వెంట ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, వైద్యారోగ్య శాఖ అధికారులు వున్నారు.

నేరుగా ఏలూరు ప్రభుత్వాసుపత్రికి చేరుకున్న సీఎం జగన్ బాధితులను కలుసుకున్న ధైర్యం చెప్పారు. ఆ తర్వాత వైద్యులను అడిగి చికిత్స వివరాలను తెలుసుకున్న సీఎం
తర్వాత జడ్పీ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశమయ్యారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?