MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Andhra Pradesh
  • హీరో, పొలిటీషన్ ఒకే...పవన్ కల్యాణ్ బెస్ట్ క్రికెటర్ కూడానా...! ఎలాగబ్బా..!

హీరో, పొలిటీషన్ ఒకే...పవన్ కల్యాణ్ బెస్ట్ క్రికెటర్ కూడానా...! ఎలాగబ్బా..!

సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుండే నాగాబాబు తన తమ్ముడి గురించి చెప్పాలంటే మరింత యాక్టివ్ అవుతారు. ఇలా తాజాగా ఆయన పవన్ కల్యాణ్, అకీరా నందన్ తో పాటు అల్లు అర్జున్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 

2 Min read
Author : Arun Kumar P
| Updated : Aug 05 2024, 11:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Pawan Kalyan

Pawan Kalyan

పవన్ కల్యాణ్ ... ఇంతకాలం సినిమాల్లో గట్టిగా వినిపించిన ఈ పేరు ఇప్పుడు రాజకీయాల్లోనూ రీసౌండ్ వచ్చేలా వినిపిస్తోంది. ఒకప్పుడు పోటీచేసిన రెండుచోట్ల స్వయంగా ఓడినవాడు... ఇటీవల ఒంటిచేత్తో తన పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించుకున్నారు. టిటిడి అత్యధిక సీట్లు సాధించివుండవచ్చు... చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యుండవచ్చు... ఆ రెండు పవన్ కల్యాణ్ వల్లే సాధ్యమయ్యాయని ప్రత్యర్థి వైసిపి నాయకులే అంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు... పవర్ స్టార్ పొలిటికల్ పవర్ ఎలాంటిదో. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
Pawan Kalyan

Pawan Kalyan

ఇక కూటమి ప్రభుత్వంలో పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు... డిప్యూటీ సీఎంగానే కాకుండా కీలక మంత్రిత్వశాఖల బాధ్యతలు సమర్తవంతంగా నిర్వర్తిస్తున్నారు. ఇలా సినిమాల్లో, రాజకీయాల్లోనే కాదు పాలనలోనూ తన మార్క్ చూపిస్తున్నారు. ఇలా అత్యున్నత స్థాయిలో వున్న తన తమ్ముడిని చూసి మురిసిపోతున్నారు కొణిదల నాగబాబు.

 

38
Pawan Kalyan

Pawan Kalyan

జనసేన నాయకుడిగా తమ పార్టీ అధినేతను గౌరవిస్తూనే ఓ అన్నగా తమ్ముడిపై ప్రేమను ప్రదర్శిస్తుంటారు నాగబాబు. తమ్ముడికి రాజకీయంగా సహాయసహకారాలు అందించేందుకు ముందుకు వచ్చినపుడే పవన్ పై నాగబాబు ప్రేమ అర్థమయ్యింది. అయితే తాజాగా తన తమ్ముడి గురించి నెటిజన్ల ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు. ఇలా ఇన్ట్సాగ్రామ్ లో మెగా ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసారు నాగబాబు.

48
Pawan Kalyan

Pawan Kalyan

పవన్ కల్యాణ్ గురించి ఒక్కమాటల్లో  చెప్పండి అంటూ ఓ నెటిజన్ నాగబాబును అడిగాడు. ఇందుకాయన'కొణిదెల పవన్ కల్యాణ్' అంటూ చాలా చమత్కారంగా సమాధానం చెప్పారు.  
 

58
Pawan Kalyan

Pawan Kalyan

మరో నెటిజన్ డిప్యూటీ సీఎంగా, మంత్రిగా  పవన్ కల్యాణ్ బిజీ అయ్యారు... కాబట్టి ఆయన సినిమాలకు దూరమైనట్లే అంటూ జరుగుతున్నప్రచారంపై నాగబాబును క్లారిటీ కోరాడు. ఇకపై పవన్ కల్యాణ్ సినిమాల్లో నటిస్తారా? లేదా? అని అడిగాడు. ఇందకు చాలా తెలివిగా... ఆయన అక్కడా వుండాలి, ఇక్కడా వుండాలి అంటూ సమాధానం చెప్పారు నాగబాబు. 
 

68
Pawan Kalyan

Pawan Kalyan

ఇక మరికొన్ని ప్రశ్నలకు క్రికెట్ బాషలో సమాధానం చెప్పారు నాగబాబు. జనసేన పార్టీ 100శాతం స్ట్రైక్ రేట్ తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని... ఈ ఫీలింగ్ మాటల్లో చెప్పలేనిదని అన్నారు. ఇక తన అభిమాన హీరో, రాజకీయ నాయకుడే కాదు  క్రికెటర్ కూడా పవన్ కల్యాణే... ఆయనలా స్ట్రైక్ రేట్ మెయింటెన్ చేయడం ఎవరితరం కాదని నాగబాబు అన్నారు.
 

78
Pawan Kalyan

Pawan Kalyan

ఈ చిట్ చాట్ లో ఓ నెటిజన్ సిల్లీ ప్రశ్నకు నాగబాబు ఫన్నీ ఆన్సర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ ని కలవడం ఎలా? అన్న ప్రశ్నకు నేరుగా విజయవాడ దగ్గర మంగళగిరికి వెళ్లు...అక్కడ ఎవ్వరినైనా అడుగు పవన్ కల్యాణ్ ఇంటి అడ్రస్ ఎక్కడని... వాళ్లు చెబుతారు... కలిసిరా... ఇంకోమాట ఈ విషయం నేను చెప్పానని తమ్ముడికి చెప్పకు...మాటొస్తది అంటూ ఫన్నీ సమాదానం చెప్పారు నాగబాబు.  
 

88
Pawan Kalyan

Pawan Kalyan

పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ గురించి కూడా ఆసక్తికర కామెంట్స్ చేసారు  నాగబాబు. తండ్రిలాగే అకీరా మంచిమర్యాదలు తెలిసినవాడు... అందరినీ ప్రేమించే మనస్తత్వం వున్నవాడని అన్నారు. సైలెంట్ గా తన పనేంటో తాను చేసుకుపోయే రకం అంటూ అకీరా గురించి చెప్పారు. అలాగే అల్లుఅర్జున్ తో తనకేమీ విబేధాలు లేవన్నట్లుగా మాట్లాడారు. శ్రమించేతత్వం వున్న వ్యక్తి...పుష్ప2 కోసం ఎదురుచూస్తున్నానని నాగబాబు చెప్పారు. 
 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
అల్లు అర్జున్
పవన్ కళ్యాణ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
మారనున్న తిరుమల రూపురేఖలు సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం | CM Chandrababu Naidu Tirumala Visite
Recommended image2
Tirumala : శ్రీవారి భక్తులను గుడ్ న్యూస్.. అందుబాటులోకి 32 EV బస్సులు, ఇకపై ఫ్రీ జర్నీ
Recommended image3
Annadhanam Spots : మీ ప్రాంతంలో ఎక్కడ అన్నదానం జరుగుతుందో ఈజీగా తెలుసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved