MLA Roja: జబర్దస్త్ షోకు రోజా గుడ్ బై: ప్రమాణ స్వీకారానికి ముందు కీలక ప్రకటన
వైసీపీలో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఎమ్మెల్యే రోజాకు తాజాగా కేబినెట్‌లో చోటు దక్కింది. దీంతో ఆమె జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పారు. ఈ మేరకు ఆమె కీలక ప్రకటన చేశారు.

వైసీపీలో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఎమ్మెల్యే రోజాకు తాజాగా కేబినెట్‌లో చోటు దక్కింది. దీంతో ఆమె జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పారు. ఈ మేరకు ఆమె ప్రమాణ స్వీకారానికి ముందు కీలక ప్రకటన చేశారు.
మంత్రివర్గంలో చోటుదక్కించుకున్న ఇందుకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఇక, టీవీ, సినిమా షూటింగ్‌లలో పాల్గొననని రోజా స్పష్టం చేశారు. మంత్రి అయినందున షూటింగ్‌లు మానేస్తున్నట్టుగా చెప్పారు.
సీఎం జగన్ తనకు ఇచ్చిన గుర్తింపును ఎప్పటికీ మర్చిపోనని రోజా చెప్పారు. తనను అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వని చంద్రబాబు అన్నారని.. కానీ జగన్ రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఇప్పుడు మంత్రిగా అవకాశమిచ్చారని తెలిపారు.
సీఎం జగన్ కేబినెట్‌లో మంత్రిగా ఉండటం తన అదృష్టం అని చెప్పారు. గతంలో ఐరన్ లెగ్ అని దుష్ప్రచారం చేశారని అన్నారు. కానీ ఈరోజు తనను మంత్రిగా చేశారని చెప్పారు. తన ప్రాణం ఉన్నంత వరకు జగనన్న కోసం పనిచేస్తానని రోజా
ఇక, కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం నేడు జరగనుంది. అయితే రోజాకు జగన్ ఏ మంత్రిత్వ శాఖ కేటాయిస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇక, గత తొమ్మిదేళ్లుగా రోజా జబర్దస్త్ షో జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈటీవీ స్పెషల్ ఈవెంట్స్‌లో కూడా రోజా సందడి చేస్తున్నారు. అయితే తాజాగా మంత్రివర్గంలో బెర్త్ దక్కడంతో ఆమె వాటికి గుడ్ బై చెప్పారు. టీవీ, సినిమా షూటింగ్‌లకే దూరంగా కానున్నట్టుగా రోజా ప్రకటించడంతో.. ఆమె మొత్తంగా బుల్లితెరకు దూరం కానున్నారు.