MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Andhra Pradesh
  • జగనన్న కాలనీల్లో జగమంత అవినీతి: మంత్రి నాదెండ్ల

జగనన్న కాలనీల్లో జగమంత అవినీతి: మంత్రి నాదెండ్ల

‘పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం పెదరావురులో 78 ఎకరాల స్థలం కొన్నారు. ఇక్కడ రైతుల నుంచి ఎకరా రూ.90 లక్షల నుంచి కోటి రూపాయలకు కొనుగోలు చేశారు. ప్రభుత్వానికి మాత్రం రూ.399 కోట్లకు విక్రయించారు. ఇక్కడ ఒక్క చోటే దాదాపు రూ.300 కోట్ల ప్రజాధనం దోచుకున్నారు.’

3 Min read
Author : Galam Venkata Rao
Published : Aug 04 2024, 08:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

వైసీపీ హయాంలో పేదల ఇళ్ల స్థలాల కొనుగోళ్లు, నిర్మాణంలో భారీ అవకతవకలు జరిగాయని ఆంధ్రప్రదేశ్‌ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ అన్నారు. రాష్ట్రంలో ఏ లే- అవుట్ చూసినా వందల కోట్ల రూపాయలు పక్కదారి పట్టించారన్నారు. జగన్ హయాంలో పేదల ఇళ్ల పేరుతో పెద్దలు అవినీతి నాటకమాడారన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో లే- అవుట్లను మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. గృహ నిర్మాణం, ఇళ్ల స్థలాల పట్టాలు సమస్యలపై నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. అంతకు ముందు పెదరావూరు, సిరిపురం, దావులూరు ప్రాంతాల్లో పేదల కోసం నిర్మిస్తున్న లే- అవుట్లను పరిశీలించారు. లబ్ధిదారులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. కాలనీల్లో కనీస మౌలిక వసతులు లేకపోవడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగితాల్లో చూపించిన దానికి, వాస్తవ పరిస్థితికి అసలు పొంతన లేదని మండిపడ్డారు. వందల కోట్లు ఖర్చయినట్లు కాగితాల్లో చూపిస్తున్నారు తప్ప కాలనీల్లో కనీస వసతులు కల్పించలేకపోయారన్నారు. 

36
నాదెండ్ల మనోహర్

నాదెండ్ల మనోహర్

‘ప్రజాధనాన్ని కొల్లగొట్టి సొంత ఆస్తులను పెంచుకోవడానికే గత పాలకులు జగనన్న కాలనీల పథకం తీసుకొచ్చారు తప్ప పేదలకు మేలు చేయడానికి కాదు. పేదల ఇళ్ల స్థలాల కోసం భూముల కొనుగోళ్లు, గృహ నిర్మాణంలో భారీ అవినీతికి పాల్పడ్డారు. రైతుల నుంచి ఎకరా కోటి రూపాయలకు కొనుగోలు చేసి ప్రభుత్వానికి నాలుగైదు రెట్లు ఎక్కువకు విక్రయించి భారీగా ప్రజాధనాన్ని లూటీ చేశారు. ప్రజాధనాన్ని దోచుకున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. సమగ్ర విచారణ జరిపించి బాధ్యులను శిక్షిస్తాం’ అని మంత్రి నాదెండ్ల మనోహర్  హెచ్చరించారు. 

46

మంత్రి నాదెండ్ల మనోహర్ ఇంకా ఏమన్నారంటే...

‘కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇళ్ల నిర్మాణానికి ఇస్తున్న ఆర్థిక సాయాన్ని త్వరలోనే పెంచుతాం. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు.’ 

‘చిన్నపాటి వర్షానికి లే- అవుట్లు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లు, డ్రైనేజీ, తాగు నీరు, కరెంటు.. ఇలా ప్రతిదీ సమస్యే. పట్టాలు ఇచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా లబ్ధిదారులు తమకు మంజూరు చేసిన స్థలం ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి. మరికొంత మంది లబ్ధిదారులను ఇళ్లు నిర్మిస్తామని డబ్బులు తీసుకొని కాంట్రాక్టర్లు మోసం చేశారు. అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోతున్నాయి. ముఖ్యంగా గంజాయి బ్యాచ్, మందుబాబులు రెచ్చిపోతున్నారు. సొంతింటి కోసం కలలు కన్న ప్రతి పేదవాడికి న్యాయం జరిగేలా చేస్తాం. వచ్చే ఉగాది నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారుల ముఖాల్లో సంతోషం నింపుతాం.’

56

78 ఎకరాలు రూ.399 కోట్లా..? 

‘పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం పెదరావురులో 78 ఎకరాల స్థలం కొన్నారు. ఇక్కడ రైతుల నుంచి ఎకరా రూ.90 లక్షల నుంచి కోటి రూపాయలకు కొనుగోలు చేశారు. ప్రభుత్వానికి మాత్రం రూ.399 కోట్లకు విక్రయించారు. ఇక్కడ ఒక్క చోటే దాదాపు రూ.300 కోట్ల ప్రజాధనం దోచుకున్నారు. ఈ లే- అవుట్లో 3వేల 792 మంది లబ్ధిదారులకు ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. మొదటి విడతలో 1,900 ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. నాలుగేళ్లు అవుతున్నా ఇప్పటికి నిర్మించింది 489 ఇళ్లే. అది కూడా అరకొర వసతులతో.. అలాగే, సిరిపురం లే- అవుట్‌లో 9,735 మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరయ్యాయి. మొదటి విడతలో 3,338 ఇళ్లు నిర్మించాలి.. కానీ ఇప్పటికి నిర్మించింది 250 ఇళ్లే. నివాసం ఉంటున్నది మూడు కుటుంబాలే. దవులూరు లే- అవుట్‌లో 356 ఇళ్లు మంజూరైతే పూర్తి చేసింది 86 మాత్రమే. ప్రతి లే- అవుట్‌లో సవా లక్ష సమస్యలు. బటన్లు నొక్కా... బటన్లు నొక్కా అని పదేపదే చెప్పిన జగన్ ఎవరికీ లబ్ధి చేకూర్చారో మాత్రం చెప్పలేదు.’

66

కాంట్రాక్టర్లకు రెండు వారాలే గడువు...

‘తెనాలి నియోజకవర్గం పరిధిలో ఉన్న మూడు లే- అవుట్లను వీలైనంత త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం. వచ్చే ఉగాదికి ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేసి గృహ ప్రవేశాలు జరిగేలా చేస్తాం. అంతకు ముందు ఈ నెల రోజుల్లో ఎవరి ఇళ్ల స్థలం ఎక్కడుందో అర్థమయ్యే విధంగా లే- అవుట్ బయట రోడ్ నెంబర్, ఫ్లాట్ నెంబర్‌తో బోర్డులు ఏర్పాటు చేస్తాం. లబ్ధిదారులను మోసం చేసిన కాంట్రాక్టర్లకు రెండు వారాల సమయం ఇస్తున్నాం. మధ్యలో వదిలేసిన ఇళ్ల నిర్మాణ పనులు మొదలు పెట్టకపోతే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. కాలనీల్లో నివాసం ఉంటున్న కుటుంబాలకు రక్షిత మంచినీటిని అందించే ఏర్పాటు చేస్తాం. గృహ నిర్మాణ శాఖ నుంచి లబ్ధిదారులకు రావాల్సిన బకాయిలను విడుదల అయ్యేలా చేస్తాం. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం. తెనాలి నియోజకవర్గంలో ఉన్న ఈ మూడు లే- అవుట్లను ఆదర్శవంతమైన కాలనీలుగా తీర్చిదిద్దుతాం..’ అని మంత్రి నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు.

About the Author

GV
Galam Venkata Rao
వెంకట్ 8 సంవత్సరాలకు పైగా ప్రింట్, టెలివిజన్, డిజిటల్ మీడియా రంగాల్లో అనుభవం కలిగిన జర్నలిస్ట్. ఈనాడులో జర్నలిజం ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో వీడియో - సోషల్ మీడియా విభాగాలను పర్యవేక్షిస్తున్నారు.
ఆంధ్ర ప్రదేశ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
గన్నవరం ప్రజలకు బిగ్ రిలీఫ్ స్పాట్ లోనే పట్టాలు | Chandrababu Key Decision on 22A Lands
Recommended image2
Tirumala: తిరుమ‌ల‌కు వ‌చ్చే భ‌క్తుల‌కు ఉచితంగా రూ. 10 ల‌క్ష‌ల ఇన్సూరెన్స్‌
Recommended image3
Now Playing
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..గంటకు 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు | AP Telangana Rain Alert
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved