ఏపీలో రోడ్ల పాలైన వలస కార్మికులు.... నిద్ర లేదు, తిండి కరువు
తాడేపల్లి మండల పరిధిలోని సీతానగరం పుష్కర ఘాట్ల వద్ద నిత్యం 200 మందికి పైగా వలసకార్మికులు ,యాచకులు దయనీయ స్థితిలో నివసిస్తున్నారు
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లక్షన్నర మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ ని తరిమికొట్టేందుకు ప్రభుత్వాలు నానా అవస్థలు పడుతున్నాయి.
ఈ వైరస్ ని అరికట్టడానికి సామాజిక దూరం ఒక్కటే మార్గం అని భావించి.. చాలా దేశాల్లో లాక్ డౌన్ ప్రకటించారు. దీనివల్ల వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు పడుతున్నారు. అయితే.. వలస కార్మికులు మాత్రం నానా అవస్థలు పడుతున్నారు.
తాడేపల్లి మండల పరిధిలోని సీతానగరం పుష్కర ఘాట్ల వద్ద నిత్యం 200 మందికి పైగా వలసకార్మికులు ,యాచకులు దయనీయ స్థితిలో నివసిస్తున్నారు
వివిధ సేవాసంస్థలు అందించిన ఆహరం పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు .
ఆవాసం లేక ఎండలో మాడుతూ , దోమలతో సావాసం చేస్తున్నారు.హృదయవిధాకారంగా జీవనం కొనసాగిస్తున్నారు.
అధికారుల నిర్లక్యం స్పష్టంగా కనపడుతోంది. ఆదుకోవాలంటూ కృష్ణమ్మ వైపు దిక్కులు చూస్తున్నారు.
వీరిలో అసాంగిక శక్తులు చేరి చిల్లరదొంగతనాలు పాల్పడతారేమోనని భయాందోళనలో స్థానికులు ఉన్నారు. లాక్ డౌన్ పూర్తయ్యేవరకు వారికి భోజనసదుపాయం తో పాటు వసతి కల్పించాలని వలస కార్మికులు అభ్యర్థిస్తున్నారు.
అధికార యంత్రాంగం స్పందించి వారిని ఆదుకోవాలని కార్మికులు కోరుకుంటున్నారు