ఏపీలో భారీగా పడిపోయిన మద్యం విక్రయాలు: 25 శాతం తగ్గిన ఆదాయం

First Published 7, Oct 2020, 1:36 PM

ఏపీ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలతో రాష్ట్రంలో మద్యం విక్రయాలు గత ఏడాదితో పోలిస్తే భారీగా పడిపోయాయి. మద్యం విక్రయాాలు పడిపోవడంతో ఆదాయం కూడ తగ్గింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం విక్రయాలు భారీగా పడిపోయాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 25 శాతం ఆదాయం కూడ తగ్గినట్టుగా ఏపీ ఎక్సైజ్ అధికారులు ప్రకటించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దశలవారీగా మద్యాన్ని నియంత్రిస్తామని  వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.

ఈ మేరకు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం దుకాణాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. అంతేకాదు మద్యం ధరలను భారీగా పెంచింది. ఏపీ రాష్ట్రానికి సరిహద్దుల్లో ఉన్న ఇతర రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున మద్యాన్ని కొనుగోలు చేసి రాష్ట్రానికి తరలిస్తున్నారు. ఏపీ రాష్ట్ర సరిహద్దుల్లో ఇతర రాష్ట్రాల నుండి మద్యాన్ని తరలిస్తున్న సమయంలో కేసులు నమోదయ్యాయి.

2019 ఏప్రిల్- సెప్టెంబర్ మధ్య మద్యం, బీర్ల విక్రయాల ద్వారా ఏపీ ప్రభుత్వానికి రూ.10,282 కోట్ల ఆదాయం వచ్చింది.ఈ ఏడాది ఏప్రిల్- సెప్టెంబర్ లో మద్యం విక్రయాల ద్వారా కేవలం రూ. 7,760 కోట్లు మాత్రమే వచ్చింది.  బీర్ల అమ్మకాలు సుమారు 89 పడిపోయినట్టుగా ప్రభుత్వ గణాంకాలు తెలుపుతున్నాయి.

2019-20 లో ఏప్రిల్ -సెప్టెంబర్ మాసంలో 159.35 లక్షల  కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది కేవలం 16.82 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు మాత్రమే జరిగినట్టుగా నివేదికలు చెబుతున్నాయి.

మద్యం విక్రయాలు కూడ గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 64 శాతం పడిపోయాయని ప్రభుత్వ రికార్డులు తెలుపుతున్నాయి.  ఈ ఏడాది ఏప్రిల్ - సెప్టెంబర్ లో 65.62 లక్షల మద్యం విక్రయాలు జరిగాయి. గత ఏడాది ఇదే సమయంలో 166 లక్షల  మద్యం విక్రయాలు చోటు చేసుకొన్నాయి.

రాష్ట్రంలో కరోనా ప్రభావంతో మద్యం దుకాణాలను మూసివేశారు. మద్యం ధరలు పెంచడంతో ఇతర రాష్ట్రాల నుండి మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఘటనలు కూడ రాష్ట్రంలో అనేకం చోటు చేసుకొంటున్నాయి.

loader