MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • తాజా సర్వే: ఏపీలో జగన్ కు లాస్, తెలంగాణలో కాంగ్రెస్ పై బీజేపీ ఆధిక్యం

తాజా సర్వే: ఏపీలో జగన్ కు లాస్, తెలంగాణలో కాంగ్రెస్ పై బీజేపీ ఆధిక్యం

Lok Sabha polls: రానున్న లోక్ స‌భ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాల‌ని దాదాపు అన్ని ప్ర‌ధాన పార్టీలు ఎన్నిక‌ల వ్యూహాల‌ను ప్రారంభించాయి. ఇదే స‌మ‌యంలో ఎన్నిక‌ల అంచనాలు వెలువ‌డుతున్నాయి. తాజాగా ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలకు ఎదురుదెబ్బ త‌గులుతుంద‌ని పేర్కొంది. ఏపీలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నాయ‌క‌త్వంలోని వైఎస్ఆర్సీపీ కొన్ని సీట్లు లాస్ అవుతుంద‌ని తెలిపింది. ఇదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ పై బీజేపీ పైచేయి సాధిస్తుందని పేర్కొంది. 
 

Mahesh Rajamoni | Published : Jul 31 2023, 10:51 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

దేశంలో ఇప్ప‌టికిప్పుడు లోక్ స‌భ ఎన్నిక‌ల జ‌రిగితే ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వైఎస్సార్సీపీదే పై చేయి అవుతుంద‌ని India TV-CNX Opinion Poll పేర్కొంది. ఏపీలోని మొత్తం 25 లోక్ స‌భ స్థానాల్లో వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పార్టీ 18 సీట్ల‌ను గెలుచుకుంటుంద‌ని తెలిపింది.  అంటే గ‌త ఎన్నిక‌ల్లో గెలుచుకున్న 22 సీట్ల కంటే నాలుగు త‌క్కువ‌. 
 

26
Asianet Image

ఇక ప్ర‌తిప‌క్ష పార్టీ అయిన తెలుగు దేశం పార్టీ 2019 లోక్ స‌భ ఎన్నిక‌ల్లో మూడు సీట్ల‌కే ప‌రిమితం అయింది. అయితే, ఈ సారి టీడీపీ ఏడు స్థానాల‌ను గెలుచుకుంటుంద‌ని ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ పేర్కొంది. 2019 ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబు బీజేపీతో తెగ‌దెంపులు చేసుకున్న సంగ‌తి తెలిసిందే.
 

36
Asianet Image

ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ఓటింగ్ శాతం గ‌మ‌నిస్తే..  వైఎస్సార్సీపీకి 46 శాతం, టీడీపీకి 36 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో ఒంటరిగా ఉన్న బీజేపీ 8 శాతం ఓట్లతో మూడో స్థానంలో ఉంటుంద‌ని అంచ‌నా వేసింది. మొత్తంగా ఆంధ్రాలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు డకౌట్ అవుతాయని అంచనా వేసింది. 
 

46
Asianet Image

అయితే, 2024 లోక్ స‌భ ఎన్నిక‌ల స‌మ‌యానికి ప‌రిస్థితులు మారే అవకాశం లేక‌పోలేదు. ఇటీవల కొత్త పొత్తులు ఏర్పడి విచ్ఛిన్నం కావడంతో మారుతున్న రాజకీయ పరిస్థితులతో 2024 ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ లో కొత్త కూటములు వస్తాయని భావిస్తున్నారు. ప్రతిపక్షాల మహాకూటమిలో చంద్రబాబు నాయుడు గానీ, జగన్మోహన్ రెడ్డి గానీ లేకపోవడం గమనార్హం. అయితే, వైసీపీ ప‌లు కీలక బిల్లులపై పార్లమెంటులో కేంద్రానికి మద్దతు పలికింది. 2024 ఎన్నికలకు ముందు టీడీపీ మళ్లీ ఎన్డీయే గూటికి చేరుతుందా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు.
 

56
Asianet Image

ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ ప్రకారం  తెలంగాణ‌లో అధికార బీఆర్ఎస్ అధిక స్థానాలు గెలుచుకుంటుంద‌ని తెలిపింది.  ముఖ్య‌మంత్రి కేసీఆర్ నాయ‌క‌త్వంలోని బీఆర్ఎస్ తెలంగాణ‌లో 8 స్థానాలు గెలుచుకుంటుంద‌ని తెలిపింది. 
 

66
Asianet Image

తెలంగాణ‌లో బీజేపీ త‌న అధిక్యం పెంచుకోనుంది. బీజేపీ ఆరు స్థానాల్లో విజ‌యం సాధిస్తుంద‌ని ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ తెలిపింది. ఇక కాంగ్రెస్ కు మ‌రోసారి నిరాశ త‌ప్ప‌ద‌ని పేర్కొంది. కాంగ్రెస్ రెండు, ఎంఐఎం ఒక స్థానంలో విజ‌యం సాధిస్తాయ‌ని తెలిపింది. 
 

Mahesh Rajamoni
About the Author
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు. Read More...
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
భారతీయ జనతా పార్టీ
 
Recommended Stories
Top Stories