MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Chandra Babu vs Jagan: జగన్‌ ఐదేళ్లలో చేసిన పని చంద్రబాబు 10 రోజుల్లోనే చేశారు

Chandra Babu vs Jagan: జగన్‌ ఐదేళ్లలో చేసిన పని చంద్రబాబు 10 రోజుల్లోనే చేశారు

‘గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక అవకతవకలకు పాల్పడింది. ఐదేళ్లు నిరర్థక పాలనతో ప్రజల్ని నష్టపరిచింది. గత జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన పని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 10 రోజుల్లోనే చేసింది’ అని ఆంధ్రప్రదేశ్ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. 

2 Min read
Author : Galam Venkata Rao
| Updated : Aug 02 2024, 10:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ys jagan

ys jagan

గత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విధానాలతో ఆంధ్రప్రదేశ్‌ తీవ్రంగా నష్టపోయిందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. అడ్డగోలు జీవోలతో సాక్షి మీడియాకి గత ప్రభుత్వం 403 కోట్ల రూపాయలు ప్రకటనల పేరుతో లబ్ధి చేకూర్చిందని ఆరోపించారు. ఇలాంటి ఆర్థిక అవకతవకల కారణంగా రాష్ట్రం ఎంతో నష్టపోయిందని చెప్పారు. 

25

ఏలూరు జిల్లా నూజివీడు మండలంలోని అన్నవరం గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను మంత్రి కొలుసు పార్థసారథి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వం అడ్డగోలు జీవోని తీసుకువచ్చి సాక్షి మీడియాకి 403 కోట్ల రూపాయలు, మిగిలిన అన్ని పత్రికలకు కలిపి 488 కోట్ల రూపాయలు ప్రకటనల రూపంలో ఇచ్చారన్నారు. గత ప్రభుత్వం చేసిన బాధ్యతా రాహిత్య పాలన కారణంగా రాష్ట్రం అభివృద్ధిలో మరో 15 సంవత్సరాలు వెనుకపడిపోయిందన్నారు.  

35
Chandra Babu

Chandra Babu

ఇటువంటి పరిస్థితిలో రాష్ట్రాభివృద్ధి గాడిలో పెట్టేందుకు సమర్థుడైన నాయకుడిగా చంద్రబాబునాయుడిని ప్రజలు గుర్తించి తమ పార్టీకి చారిత్రాత్మక విజయాన్ని అందించినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. ప్రజలు తమపై పెట్టిన నమ్మకాన్ని బాధ్యతగా భావించి ప్రజా క్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం 11 లక్షల కోట్ల రూపాయల అప్పులతో రాష్ట్రాన్ని నాశనం చేసిందని, 2.70 లక్షల కోట్లు సంక్షేమానికి ఖర్చుచేశామని చెప్పినప్పటికీ.. మిగిలిన 8 లక్షల కోట్ల రూపాయలు ఏమయ్యాయో తెలియదన్నారు.  

45

‘‘రాష్ట్రంలో గత 5 సంవత్సరాలలో జరిగిన ఆర్థిక అరాచకానికి సంబంధించి సాక్ష్యాలతో సహా ముఖ్యమంత్రి శ్వేతపత్రాలు విడుదల చేశారు. వాటిల్లో ఏమైనా అబద్దాలు ఉంటె  రుజువులతో వచ్చి నిరూపించుకోకుండా మాజీ ముఖ్యమంత్రి జగన్ అర్థం లేని విమర్శలు చేస్తున్నారు. అయినప్పటికీ రాష్ట్రాభివృద్ధికి సహకరించమని ప్రతిపక్షాన్ని కోరాం. ప్రభుత్వంపై బురద చల్లడమే పనిగా ప్రతిపక్షం పెట్టుకుంది’’ అని మంత్రి పార్థసారథి తెలిపారు.

55

ఆంధ్రప్రదేశ్‌లోని  65 లక్షల మందికి ప్రతీ నెల 2,712 కోట్ల రూపాయలను ఎన్టీఆర్  భరోసా పెన్షన్లుగా పంపిణీ చేస్తున్నారు. గత ప్రభుత్వానికి పేదలకు పెన్షన్‌ను 2 వేల నుంచి 3 వేల రూపాయలకు పెంచడానికి 5 సంవత్సరాల సమయం పడితే తమ ప్రభుత్వం 10 రోజుల్లోనే 3 వేల నుంచి 4 వేల రూపాయలకు పెంచింది. 3 నెలల బకాయిలను కూడా అందించింది. ఎన్నికలకు ముందు రాష్ట్రంలో  వాలంటీర్లే సర్వం అన్నట్లు గత ప్రభుత్వం చిత్రీకరిస్తే.. వారి అవసరం లేకుండానే చంద్రబాబు ప్రభుత్వం పనులు చేస్తోంది. రాష్ట్రంలోని ఉద్యోగులతో ఒక్కరోజులోనే ఆగస్టు నెల పింఛన్లను 98 శాతం పంపిణీ చేశారు. 

About the Author

GV
Galam Venkata Rao
వెంకట్ 8 సంవత్సరాలకు పైగా ప్రింట్, టెలివిజన్, డిజిటల్ మీడియా రంగాల్లో అనుభవం కలిగిన జర్నలిస్ట్. ఈనాడులో జర్నలిజం ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో వీడియో - సోషల్ మీడియా విభాగాలను పర్యవేక్షిస్తున్నారు.
ఆంధ్ర ప్రదేశ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Nimmala Ramanaidu Highlights Rayalaseema Irrigation Projects & Water Disputes | Asianet News Telugu
Recommended image2
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం పొంచివుందా..? ఈ ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు
Recommended image3
Now Playing
Nimmala Ramanaidu: ఈ రిజర్వాయర్ల భూ సేకరణలో జగన్ రైతులకు ఏం చేశారో తెలుసా? | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved