MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • ఏంటీ... రాజకీయ పార్టీల్లో ఓ నాయకుడు మాట్లాడాలంటే ఇంత తతంగం ఉంటుందా!

ఏంటీ... రాజకీయ పార్టీల్లో ఓ నాయకుడు మాట్లాడాలంటే ఇంత తతంగం ఉంటుందా!

రాజకీయ పార్టీల పనితీరే అధికారంలోకి తీసుకువస్తుంది, అధికారాని దూరం చేస్తుంది. అందుకే ప్రతి నాయకుడు, కార్యకర్త పార్టీ లైన్ లో నడిచేలా కొన్ని నియమనిబంధనలు రూపొందించుకుంటారు. ఇలా టిడిపిలో ఓ నాయకుడు మాట్లాడాలంటే ఎంత తతంగం ఉంటుందో తెలుసా? 

2 Min read
Author : Arun Kumar P
| Updated : Apr 03 2025, 01:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
Telugudesam Party

Telugudesam Party

Politics : రాజకీయ పార్టీ అనగానే అధికారంకోసం ఏమైనా చేస్తుందనే భావన ప్రజల్లో ఉంది. పార్టీ ఆదేశిస్తే ఏం చేయడానికైనా నాయకులు, కార్యకర్తలు ఎప్పుడూ సిద్దంగా ఉండాలి. అయితే ఏ రాజకీయ పార్టీకయినా కొన్ని నియనిబంధనలు ఉంటాయి... వాటిని ప్రతిఒక్కరూ అనుసరించాలి.  నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణగా ఉంటూ పార్టీ లైన్ లో నడవాలి. పార్టీలో ఎవరి బాధ్యతలు వారు చూసుకోవాల్సి ఉంటుంది... పార్టీ అదేశానుసారం నడుచుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఏ పార్టీ అయినా ప్రజలకు దగ్గరయి అధికారాన్ని పొందగలుగుతుంది.  

కొన్నిసార్లు కార్యకర్తల అభీష్టం మేరకు పార్టీ నడుచుకోవాల్సి ఉంటుంది. మరికొన్నిసార్లు వ్యూహాత్మక మౌనం పాటించాల్సి ఉంటుంది. నాయకులు ఏం మాట్లాడినా అది పార్టీ వాయిస్ గా ప్రజల్లోకి వెళుతుంది... కాబట్టి చాలా జాగ్రత్తగా నడుచుకోవాల్సి ఉంటుంది. ఇలా ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం వంటి పార్టీల్లో అయితే చాలా నియమ నిబంధనలు ఉంటాయి. ఈ పార్టీలో ఏదైనా విషయంపై  అధికార ప్రతినిధులు మాట్లాడాలంటే చాలా తతంగా ఉంటుంది. ఈ ప్రక్రియ ఎలా ఉంటుందో ఆ పార్టీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ వివరించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22
TDP Vijay Kumar

TDP Vijay Kumar

ఓ ప్రెస్ మీట్ పెట్టాలంటే ఇంత తతంగం ఉంటుందా? 

రాజకీయ పార్టీల వాయిస్ ను ప్రజలముందుకు తీసుకెళ్ళేది ఆ పార్టీ అధికార ప్రతినిధులు. అంటే ఏదయినా అంశంపై పార్టీ తరపున మాట్లాడేందుకు మీడియా ముందుకు వస్తుంటారు ఈ అధికార ప్రతినిధులు. ఇలా తెలుగుదేశం పార్టీలో ఆనం వెంకట్రమణారెడ్డి, విజయ్ కుమార్ లాంటివారు అధికార ప్రతినిధులుగా ఉన్నారు. వీరు మీడియా ముందుకు ఎక్కువగా వస్తుంటారు. తమ పార్టీ వాయిస్ ను వినిపించడమే కాదు ప్రత్యర్థి పార్టీల తీరును కూడా ఈ అధికార ప్రతినిధులు ఎండగడుతుంటాయి. 

అయితే ఇటీవల కొన్ని రాజకీయ అంశాలపై ఎందుకు స్పందించడంలేదని ఆనంతో పాటు తనను కొందరు అడుగుతున్నారని విజయ్ కుమార్ తెలిపారు. ఆ అంశమేమిటి? దానిగురించి ఎందుకు స్పందించడంలేదు? అధికార ప్రతినిధులుగా తమ పనితీరు ఎలా ఉంటుంది? అనేది విజయ్ కుమార్ వివరించారు.

''నిన్న నన్ను, ఆనం వెంకట్రమణా రెడ్డిలను టాగ్ చేసి, మేమెందుకు ఫలానా విషయం మీద మాట్లాడలేదు, ప్రెస్ మీట్ పెట్టలేదు,  జగన్ పిన్నమ్మ, జూపూడి ల గురించి పోస్ట్ పెట్టడానికి భయము...అంటూ ఏవేవో వ్రాసారు.... తనకు తెలీదు , ఒకరు చెప్తే వినరు అనే సామెత వుంది....ముందు రాజకీయ పార్టీలు ఎలా పని చేస్తాయో తెలుసుకోండి'' అని విజయ్ కుమార్ సూచించారు. 

''టిడిపిలో దాదాపు ముప్పై మంది అధికార ప్రతినిధులు వున్నారు. ప్రతి రోజు ఉదయం ఒక కమిటీ ఆన్లైన్లో సమావేశం అవుతుంది. ఆ రోజు ఏయే ఇష్యూలను తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోవాలి, ఎవరు మాట్లాడాలో నిర్ణయిస్తారు. ఆ నిర్ణయాన్ని వివిధ స్థాయిలో ఆమోదించిన పిమ్మట ప్రెస్ మీట్ పెట్టాల్సిన వ్యక్తికి చెప్తారు. సున్నితమైన ఆంశాలపై మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తారు... ఎవరు మాట్లాడాలో నిర్ణయిస్తారు. ఆ అంశాన్ని తీసుకోవాలా వద్దా? అన్నది కూడా నిర్ణయించేది కమిటీనే. దీని సూచనల మేరకే మేము నడుచుకోవాల్సి ఉంటుంది" అని విజయ్ కుమార్ తెలిపారు.   
 
''పార్టీ ఆఫీసులో మాట్లాడే ప్రతి ఒక్క ప్రెస్ మీట్ పార్టీ చెప్పిన ప్రకారమే జరుగుతాయి, అందుకే అది అఫీసియల్ ప్రెస్ మీట్ అవుతుంది. ఇవేమీ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు వ్రాసేస్తే ఎలా? ప్రతి పార్టీకి, సంస్థకు కొన్ని రూల్స్, రెగులేషన్స్ వుంటాయి కదా..! అవేమీ తెలియకుండా, మనం చెప్పినట్టు నడవాలి అంటూ రిమోట్ కంట్రోల్ చేద్దామని ప్రయత్నిస్తే ఎలా? కాస్త తెలుసుకొని వ్రాయండి...!'' అని విజయ్ కుమార్ సూచించారు. 
 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆంధ్ర ప్రదేశ్
తెలుగుదేశం పార్టీ
నారా చంద్రబాబు నాయుడు
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329
AUSAUS
(90.0 ov)330/4
Day 2
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Recommended Stories
Recommended image1
ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. అర్న‌బ్ తుపాను వేళ వారికి రూ. 5 ల‌క్ష‌ల సాయం
Recommended image2
IND W vs ZIM W: మూడో వ‌న్డేలోనూ అద‌ర‌గొట్టిన అమ్మాయిలు.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్
Recommended image3
School Holidays : అర్నబ్ తుపాను తీరందాటినా ఆగని వర్షబీభత్సం.. ఈ జిల్లాల్లో స్కూళ్ళకి సెలవులు పొడిగిస్తారా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved