మేము మూర్ఖులం.. కరోనాని వ్యాపిస్తాం..బయటకొస్తే.. ఇదే శిక్ష
ప్రజల క్షేమం కోసం పోలీసులు ప్రాణాలకు తెగించి మరీ విధులకు హాజరవుతున్నారు. లాక్ డౌన్ లో ఎండల్లోనే పడిగాపులు కాస్తూ లాక్ డౌన్ సక్రమంగా ఉందో లేదో పరిశీలిస్తున్నారు.
కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా వ్యాపిస్తోంది. చూస్తుండగానే.. వెయ్యికి చేరువలో కేసులు చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో వైరస్ ని అరికట్టేందుకు లాక్ డౌన్ విధించారు.
ప్రజల క్షేమం కోసం పోలీసులు ప్రాణాలకు తెగించి మరీ విధులకు హాజరవుతున్నారు. లాక్ డౌన్ లో ఎండల్లోనే పడిగాపులు కాస్తూ లాక్ డౌన్ సక్రమంగా ఉందో లేదో పరిశీలిస్తున్నారు.
అయితే.. కొందరు ఆకతాయిలు మాత్రం ఎంత వద్దన్నా.. బయట తిరుగుతున్నారు. ఎంత చెప్పినా వాళ్లు మారకపోవడంతో.. పోలీసులు కూడా వినూత్న శిక్షలు విధిస్తున్నారు.
తాజాగా గుంటూరు రూరల్ ఏరియాలోని కొల్లూరు పోలీసు.. లాక్ డౌన్ అతిక్రమించి బయటకు వచ్చిన వారికి వినూత్న శిక్షలు విధిస్తున్నారు. వీటికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.
లాక్ డౌన్ నిబంధనలు పాటించకుండ రోడ్ల పైకి వచ్చు వారికి వినూత్న శిక్ష కోసం ప్రత్యేకంగా ఓ సెల్ఫీ పాయింట్ కూడా ఏర్పాటు చేశారు.
ఆ సెల్ఫీపాయింట్ కి ఓ బోర్డ్ కూడా తయారు చేశారు. దాని మీద‘‘
నేను మూర్ఖుడిని
నేను మాస్క్ పెట్టుకొను
పని పాట లేకుండా రోడ్ల మీద తిరిగి కరోనా వైరస్ వ్యాప్తి చేస్తాను
ప్రజల ప్రాణాలతో ఆడుకుంటాను’’ అని రాసి ఉంది.
దాని వద్ద నిలబడి వాళ్లతో సెల్ఫీలు తీయిస్తున్నారు. అంటే.. వాళ్లకి వాళ్లు తాము నేరం చేశాం, తాము మూర్ఖులమనే భావన కలిగేలాచేస్తున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ అవుతాయనే భయంతోనైనా బయటకు రాకుండా ఉంటారనేది ఆ పోలీసు ఆలోచన. కాగా.. పోలీసుల ఆలోచన నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.