MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • వివాహేతర సంబంధం : నాలుగు నెలల గర్భిణిని రోకలి బండతో కొట్టి చంపి.. భర్త పరార్...

వివాహేతర సంబంధం : నాలుగు నెలల గర్భిణిని రోకలి బండతో కొట్టి చంపి.. భర్త పరార్...

భార్య గర్భవతి అని కూడా చూడకుండా వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందన అది దారుణంగా హతమార్చాడో భర్త. రోకలి బండతో తలపై మోది పారిపోయాడు.  

1 Min read
Author : Bukka Sumabala
Published : Apr 07 2023, 09:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

వేలేరుపాడు : వివాహేతర సంబంధం నేపథ్యంలో.. అడ్డుగా ఉందని భార్యను అతి దారుణంగా హత మార్చాడో భర్త. అయితే భార్య 4 నెలల గర్భంతో ఉందని కూడా ఆలోచించలేదు ఆ కిరాతకుడు. భార్యను హత్య చేసిన తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. దీని మీద కేసు నమోదు కావడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లో కలకలం రేపింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి…

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఆంధ్ర ప్రదేశ్ లోని వేలేరుపాడు లోని పాత రెడ్డిగూడెంలో  ఈ ఘటన జరిగింది. ఈ గ్రామానికి చెందిన సోడే వెంకటేశ్వర్లకు రాధ అనే మహిళతో పదేళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఒక  కుమారుడు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఇటీవల వెంకటేశ్వర్లు మద్యానికి అలవాటు పడ్డాడు. మద్యం తాగి వచ్చి ఇంట్లో తరచుగా గొడవలు పడుతుండేవాడు. దీనికి తోడు గత కొంత కాలంగా ఒక గిరిజన యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.

34

గొడవ జరిగిన రోజు రాత్రి ఇంట్లో ఉన్న రోకలిబండతో రాధ తలపై బలంగా రెండుసార్లు మోదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే రక్తపు మడుగులో కుప్పకూలిపోయింది. ఆ తర్వాత వెంకటేశ్వర్లు అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్ర గాయాలతో పడిపోయి ఉన్న రాదను గమనించిన స్థానికులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

44

అక్కడ చికిత్స తీసుకుంటూ పరిస్థితి విషమించడంతో ఆమె ఏప్రిల్ ఒకటవ తేదీన ప్రాణాలు విడిచింది.  ఈ ఘటన మీద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుడైన వెంకటేశ్వరులను గురువారం నాడు వసంత వాడ వద్ద అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరిచారు.

About the Author

BS
Bukka Sumabala
 

Latest Videos
Recommended Stories
Recommended image1
YS Jagan: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాలి.. జ‌గ‌న్ డిమాండ్‌
Recommended image2
Now Playing
కోటంరెడ్డి వ్యాఖ్యలపై జగన్ ఫస్ట్ రియాక్షన్ | YS Jagan On Kotamreddy Sridhar Reddy | Asianet Telugu
Recommended image3
Navratri Celebrations: బెజవాడలో రాగా దాండియా ఉత్సవ్ 2.0.. ఘనంగ నవరాత్రి వేడుకలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved