విజయనగరం టీడీపీలో పంచాయితీ: ఆశోక్‌తో అమీతుమీకి గీత రెడీ
First Published Dec 25, 2020, 2:25 PM IST
టీడీపీ విజయనగరం జిల్లా నేతల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఈ విషయంలో పార్టీ నాయకత్వం జోక్యం చేసుకొంది. అయితే పార్టీ నాయకత్వం ఇచ్చిన హామీని అమలు చేయలేదని మీసాల గీత చెబుతున్నారు.

టీడీపీకి చెందిన విజయనగరం జిల్లా నేతల మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. పార్టీ అధిష్టానం సూచన మేరకు తాను ఏర్పాటు చేసిన కార్యాలయానికి బోర్డును తీసేసిన మాజీ ఎమ్మెల్యే మీసాల గీత మరోసారి పార్టీ బోర్డును ఏర్పాటు చేయడం టీడీపీలో చర్చకు దారి తీసింది.

విజయనగరం జిల్లా టీడీపీ వ్యవహరాల్లో మాజీ కేంద్ర మంత్రి ఆశోక్ గజపతి రాజు చెప్పినట్టే సాగుతోంది. కొంతకాలంగా ఆశోక్ గజపతిరాజుకు మాజీ ఎమ్మెల్యే మీసాల గీతకు మధ్య అంతరం పెరిగినట్టుగా కన్పిస్తోంది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?