విజయనగరంలో టీడీపీ ఆఫీస్: ఆశోక్‌గజపతిరాజుకి కొత్త తలనొప్పులు
First Published Dec 9, 2020, 4:35 PM IST
విజయనగరం జిల్లాలోని టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు బట్టబయలైంది. ఆశోక్ గజపతి రాజు బంగ్లాను కాదని కొత్తగా టీడీపీ కార్యాలయాన్ని విజయనగరంలో ఏర్పాటు చేయడం ప్రస్తుతం చర్చకు దారితీస్తోంది.

మాజీ కేంద్ర మంత్రి ఆశోక్ గజపతి రాజుకు పార్టీలోనే వ్యతిరేకవర్గం బహిరంగంగా సవాల్ విసిరింది. విజయనగరంలో మాజీ ఎమ్మెల్యే మీసాల గీత పార్టీ కార్యాలయాన్ని బుధవారం నాడు ప్రారంభించారు.

విజయనగరం జిల్లాలో మాజీ కేంద్ర మంత్రి ఆశోక్ గజపతి రాజు బంగ్లాలోనే టీడీపీ కార్యాలయం ఉంది. అయితే ఈ బంగ్లాలోని పార్టీ కార్యాలయాన్ని కాదని మాజీ ఎమ్మెల్యే మీసాల గీత ఇవాళ కార్యాలయాన్ని ప్రారంభించడం చర్చకు దారి తీసింది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?