సీఎంఓ నుండి పిలుపు: జగన్‌తో బాలినేని శ్రీనివాస్ రెడ్డి భేటీ
ఏపీ సీఎం వైఎస్ జగన్ తో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇవాళ భేటీ అయ్యారు
జగన్‌తో బాలినేని శ్రీనివాస్ రెడ్డి భేటీ
ఏపీ సీఎం వైఎస్ జగన్ తో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మంగళవారంనాడు భేటీ అయ్యారు. వైఎస్‌ఆర్‌సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ పదవికి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో బాలినేని శ్రీనివాస్ రెడ్డితో సీఎంఓ అధికారులు సంప్రదింపులు జరిపారు. సీఎంఓ అధికారుల సంప్రదింపుల తర్వాత బాలినేని శ్రీనివాస్ రెడ్డి సీఎం జగన్ తో భేటీకి అంగీకరించారు. ఇవాళ మధ్యాహ్నం ఒంగోలు నుండి తాడేపల్లికి చేరుకున్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి సీఎం జగన్ తో భేటీ అయ్యారు.
జగన్‌తో బాలినేని శ్రీనివాస్ రెడ్డి భేటీ
ఏడాది క్రితం మంత్రివర్గ విస్తరణనను జగన్ చేపట్టారు. మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణలో బాలినేని శ్రీనివాస్ రెడ్డిని మంత్రి పదవి నుండి తప్పించారు సీఎం జగన్. అయితే అదే జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేష్ ను మంత్రివర్గంలోనే కొనసాగించారు సీఎం జగన్..
జగన్‌తో బాలినేని శ్రీనివాస్ రెడ్డి భేటీ
ఈ విషయమై బాలినేని శ్రీనివాస్ రెడ్డి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డితో రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. ఆ తర్వాత సీఎం జగన్ తో బాలినేని శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. దీంతో పార్టీ ఇచ్చే ఏ బాధ్యతనైనా నిర్వహిస్తానని ఆయన ప్రకటించారు.
జగన్‌తో బాలినేని శ్రీనివాస్ రెడ్డి భేటీ
వైఎస్ఆర్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్ బాధ్యతలు నిర్వహిస్తున్న బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ప్రోటోకాల్ సమస్యలు తలెత్తాయి. గత మాసంలో మార్కాపురంలో జరిగిన సీఎం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన బాలినేని శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బాలినేని శ్రీనివాస్ రెడ్డి అక్కడి నుండి వెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం బాలినేని శ్రీనివాస్ రెడ్డిని పిలిపించారు
జగన్‌తో బాలినేని శ్రీనివాస్ రెడ్డి భేటీ
ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో మనోవేదనకు గురైన బాలినేని శ్రీనివాస్ రెడ్డి రీజినల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేశారు. ఈ విషయమై సీఎంఓ నుండి సంప్రదింపులు జరపడంతో ఇవాళ సీఎం జగన్ తో బాలినేని శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు.