MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • వివాహేతర సంబంధం : అనుమానించాడని భర్తపై కత్తితో దాడిచేసి చంపేసిన భార్య, జీవితఖైదు విధించిన కోర్టు...

వివాహేతర సంబంధం : అనుమానించాడని భర్తపై కత్తితో దాడిచేసి చంపేసిన భార్య, జీవితఖైదు విధించిన కోర్టు...

వివాహేతర సంబంధం ఉందని అనుమానించిన భర్తను దారుణంగా హతమార్చిందో భార్య. ఈ కేసులో ఆమె ముద్దాయిగా తేలడంతో జీవితఖైదు విధించింది కోర్టు. 

2 Min read
Author : Bukka Sumabala
Published : Jun 28 2023, 10:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

విజయనగరం : పరాయి వ్యక్తులతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ దానిని ప్రశ్నించిన భర్తను అత్యంత దారుణంగా హతమార్చింది. ఈ కేసులో ముద్దాయిగా తేలడంతో సదరు మహిళకు జీవిత ఖైదు విధించింది కోర్టు. కొత్తవలస మండలం తుమ్మికాపల్లి గ్రామానికి చెందిన అడ్డూరి విజయలక్ష్మికి  జీవిత ఖైదుతో పాటు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. కల్యాణ చక్రవర్తి మంగళవారం తీర్పు చెప్పారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తండ్రి మృతి.. తల్లి జైలుకు వెళ్లడంతో అనాధలుగా మారిన ఇద్దరు పిల్లలకు ప్రభుత్వం చెరో మూడు లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేలూరి రఘురాం ఈ కేసుకు సంబంధించి అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయలక్ష్మి భర్త ముద్దాయి దేముడు కొత్త వలసలో ఓ గ్యాస్ కంపెనీలో పనిచేసేవాడు. 

36

దేముడికి విజయలక్ష్మితో 14 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఒక అబ్బాయి, అమ్మాయి ఉన్నారు. కొంతకాలంగా భార్య విజయలక్ష్మి ప్రవర్తన మీద భర్తకు అనుమానం వచ్చింది. భార్య వేరే వ్యక్తులతో వివాహేతర సంబంధంపెట్టుకుందని అనుమానించిన భర్త తరచుగా ఆమెతో గొడవలు పడుతుండేవాడు.

46

ఈ అనుమానానికి తోడు విజయలక్ష్మి కూడా ఇంట్లో చెప్పా పెట్టకుండా.. ఉదయం బయటికి  వెళ్లి సాయంత్రానికి వస్తుండేది.  భార్యను ఈ విషయంలో దేముడు అనేకసార్లు నిలదీశాడు.  దీంతో విసిగిపోయిన విజయలక్ష్మి భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనుకుంది. 2019 సెప్టెంబర్ 2వ తేదీన రాత్రి భర్త నిద్రపోయిన తర్వాత అతని పొట్టపై కత్తితో దాడి చేసింది.

56

ఈ దాడిలో దేముడు తీవ్రంగా గాయపడ్డాడు. అతని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స తీసుకుంటూ తెల్లవారి మృతి చెందాడు. దేముడు సమీప బంధువైన మురళీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొత్తవలస ఎస్సై బి మురళి అప్పుడు కేసు నమోదు చేశాడు. నిందితురాలైన భార్య విజయలక్ష్మిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. 

66

అప్పటి సీఐ జి గోవిందరావు దర్యాప్తు చేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం తుది తీర్పుకుముందు..  ప్రాసిక్యూషన్ 18 మంది సాక్షులను కోర్టులో విచారణ చేసింది. విజయలక్ష్మి మీద మోపిన అభియోగాలు రుజువు కావడంతో న్యాయమూర్తి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు. 

About the Author

BS
Bukka Sumabala
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update: తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. మరో 2 రోజులు దంచికొట్టనున్న భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు బిగ్ అలర్ట్
Recommended image2
Now Playing
అమరావతిని ప్రపంచమంతా మాట్లాడుకునేలా చేస్తా..!| Chandrababu Powerful Speech | Asianet News Telugu
Recommended image3
Now Playing
ఒకటే ఈలలు అరుపులు | Chandrababu Crazy Fans | Asianet Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved