వింతవ్యాధితో ఏలూరువాసి మృతి...సర్కార్ పై చంద్రబాబు, లోకేష్ సీరియస్
First Published Dec 7, 2020, 10:06 AM IST
ఏలూరులో వింత వ్యాధి బారిన పడిన వారిలో తాజాగా ఒకరు మరణించారు.

అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో శనివారం ఉన్నట్టుండి వందలాదిమంది తీవ్ర అస్వస్థతకు గురయిన విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. శనివారం రాత్రి నగరంలోని పడమరవీధి, కొత్తపేట, తాపీమేస్త్రీ కాలనీ, అశోక్‌నగర్, తంగెళ్లమూడి, శనివారపుపేట, ఆదివారపుపేట, అరుంధతిపేట తదితర ప్రాంతాల్లోని ప్రజలు ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయారు. వీరంతా ప్రస్తుతం వివిధ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు.

ఏలూరు వాసుల అస్వస్ధతకు గల కారణాలను డాక్టర్లు ఇప్పటికీ గుర్తించకలేకపోతున్నారు. ఈ వింత వ్యాధి బారిన పడిన వారిలో తాజాగా ఒకరు మరణించారు. ఏలూరు విద్యానగర్‌కు చెందిన శ్రీధర్ (45) ఆదివారం ఉదయం మూర్చ లక్షణాలతో ఆస్పత్రిలో చేరాడు. ఉదయం నుంచి చికిత్స పొందిన శ్రీధర్ సాయంత్రం చనిపోయారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?