MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • SChool Holidays : వచ్చే నెలలో సెలవులే సెలవులు ... ఎన్నో తెలుస్తే స్టూడెంట్స్ ఎగిరిగంతేస్తారు

SChool Holidays : వచ్చే నెలలో సెలవులే సెలవులు ... ఎన్నో తెలుస్తే స్టూడెంట్స్ ఎగిరిగంతేస్తారు

సెలవులంటే ఎవరికి ఇష్టం వుండదు చెప్పండి. ఉద్యోగాలకు వెళ్లే పెద్దవారైనా... స్కూలుకు వెళ్లే చిన్నవాళ్లయినా సెలవులంటే ఎగిరి గంతేస్తారు. మరి ఈ ఇయర్ ఎండిగ్ డిసెంబర్ లో ఎన్ని సెలవులు వచ్చాయో చూద్దామా. 

3 Min read
Author : Arun Kumar P
| Updated : Nov 28 2024, 01:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
School Holidays

School Holidays

SChool Holidays : ఈ  సంవత్సరం విద్యార్ధులకు భారీగా సెలవులు వచ్చాయి. న్యూ ఇయర్, సంక్రాంతితో ప్రారంభమైన ఈ సెలవుల పరంపర ఇంకా కొనసాగుతూనే వుంది. పబ్లిక్ హాలిడేస్ కు తోడు భారీ వర్షాలు, వరదలు, బంద్ ల కారణంగా అదనపు సెలవులు వచ్చాయి. ఇక ప్రతినెలా నాలుగైదు ఆదివారాలు వుండనే వున్నాయి. ఈ సెలవులు చాలవన్నట్లు ఇయర్ ఎండింగ్ లో కూడా భారీగా సెలవులు వస్తున్నాయి. ఇది స్కూల్ విద్యార్థులు ఆనందంతో ఎగిరి గంతులేసే వార్త.

ఇప్పటికే 2024 సంవత్సరంలో 11 నెలలు గడిసిపోయినట్లే. ఇక మిగిలింది ఒకే ఒక నెల డిసెంబర్. ఈ డిసెంబర్ లోనూ విద్యాసంస్థలకు భారీగా సెలవులు వస్తున్నాయి. ఈ నెలలో విద్యార్థులకు ఏడెనిమిది సెలవులు వస్తున్నాయి. ఇలా డిసెంబర్ సెలవులతో ఇట్టే గడిచిపోయేలా వుంది.    
 

24
School Holiday

School Holiday

డిసెంబర్ 2024 లో సెలవులే సెలవులు :

సెలవు అన్న మాట వింటే ఉద్యోగులకే పట్టరాని ఆనందం వస్తుంది.. అలాంటిది విద్యార్థుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెలవులు వస్తే హాయిగా ఇంట్లో వుండొచ్చని, స్నేహితులతో సరదాగా ఆడుకోవచ్చని ప్రతి స్టూడెంట్ కోరుకుంటారు. వారు ఆనందించేలా ఈ డిసెంబర్ భారీ సెలవులను మోసుకువచ్చింది. 

వచ్చే నెలలో క్రిస్టియన్స్ ఎంతో సంబరంగా జరుపుకునే క్రిస్మస్ పండగ వుంది. కాబట్టి ఇరు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు రెండుమూడు రోజులు సెలవు వచ్చే అవకాశం వుంది.డిసెంబర్ 25న క్రిస్మస్... ఆ రోజు ఎలాగూ సెలవు వుంటుంది. ఆ తర్వాతి రోజు కూడా సెలవు ఇచ్చారు.ఇక క్రిస్మస్ ముందురోజు అంటే 24న ఈవ్ సందర్భంగా ఐచ్చిక సెలవు వుంటుంది... కొన్ని స్కూల్స్ ఆ రోజు హాఫ్ డే సెలవు ఇస్తారు. మొత్తంగా క్రిస్మస్ పండక్కి మూడురోజుల సెలవు వస్తుంది. 

ఇక ఈ నెలలో ఐదు ఆదివారాలు (డిసెంబర్ 1,8,15,22,29), ఓ రెండో శనివారం (డిసెంబర్ 14) కలుపుకుంటే ఆరు రోజులు స్కూల్స్ నడవవు. ఈ క్రిస్మస్ హాలిడేస్ ను కలుపుకుంటే మొత్తం నెలలో 9 రోజులు సెలవులే వుంటాయి. ఒకవేళ ప్రస్తుత ఫెంగల్ తుఫాను ప్రభావంతో డిసెంబర్ లో కూడా భారీ వర్షాలు కురిస్తే మరిన్నిసెలవులు వచ్చే అవకాశం వుంది.  

ఇక క్రిస్టియన్ మిషనరీ విద్యాసంస్థల క్రిస్మస్ సెలవులు భారీగా వుంటాయి. మిషనరీ పాఠశాలలకు 5 రోజుల క్రిస్మస్ సెలవులను ప్రకటించింది విద్యా శాఖ. అంటే డిసెంబర్ 23 నుండి 27 వరకు సెలవులు ఇచ్చారు. అంటే డిసెంబర్ లో మిషనరీ విద్యాసంస్థలకు 11 రోజుల సెలవులు రానున్నాయి. (5 క్రిస్మస్ సెలవులు, 5 ఆదివారాలు, 1 రెండో శనివారం).
 

34
School Holiday

School Holiday

నవంబర్ 29న సెలవు?

ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా మారుతోంది. ఇది తుఫానుగా మారి ఏపీతో పాటు తమిళనాడు, అండమాన్ నికోబార్ పై విరుచుకుపడుతుందని ఐఎండి హెచ్చరించింది.

ఈ ఫెంగల్ తుఫాను ప్రభావంలో ఇప్పటికే తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తుండటంతో విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చారు. ఏపీలోని కోస్తాంద్ర, రాయలసీమ జిల్లాలపైనా ఈ తుఫాను ప్రభావం వుంటుందని... పలుచోట్ల మోస్తరు నుండి భారీ, అతిభారీ వర్షాలు కురిసే అవకాశం వుందని హెచ్చరిస్తున్నారు. నవంబర్ 29న అంటే రేపు శుక్రవారం ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో వర్ష తీవ్రతను బట్టి విద్యాసంస్థలకు సెలవు ప్రకటించే అవకాశం వుంది.

ఇప్పటికే తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. భారీ వర్షాలు కురిసే అవకాశం వున్న జిల్లాల అధికారులను అప్రమత్తం చేసారు. జిల్లాల మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో వుండాలని... సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. నది పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నివాసముండే ప్రజలు అప్రమత్తంగా వుండాలని ప్రభుత్వం సూచించింది. 
 

44
School Holiday

School Holiday

తమిళనాడులో వరుస సెలవులు : 

ఫెంగల్ తుఫాను తమిళనాడుపై విరుచుకుపడుతోంది. కడలూరు, తిరువారూర్, నాగపట్టినం, మయిలాడుతురై, కారైకల్‌లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వర్ష తీవ్రత ఎక్కువగా వున్న ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. భారీ వర్షాలు, వరద పరిస్థితి నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా వుండాలని సూచిస్తున్నారు. 

గత మంగళవారం (నవంబర్ 26) నుండి వర్షాలు మొదలయ్యాయి. భారీ వర్షాలు కురిస్తున్న పలు ప్రాంతాల్లో నవంబర్ 27,28 తేదీల్లో సెలవులు ఇచ్చారు. ఈ తుఫాను ప్రభావంతో మరో రెండ్రోజులు వర్షాలు దంచికొట్టే అవకాశాలున్నాయి... దీంతో అప్పటివరకు ఈ సెలవులు ఇలాగే కొనసాగే అవకాశం వుంది. 


 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
AP Food Commission Strong Warning: మెమోలు గిమోలు అవసరం లేదు తీసేయండి | Asianet News Telugu
Recommended image2
Now Playing
Anganwadi Workers on Chandrababu:జీతాలుపెంచకపోతే ప్రాణాలు తీసుకోవడానికి సిద్దం | Asianet News Telugu
Recommended image3
Now Playing
ధర్నాలతో సమస్యలు పరిస్కారం కావు: Gummadi Sandhyarani on Anganwadi Workers | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved