ఓవైపు క్రిస్మస్-మరోవైపు వైకుంఠ ఏకాదశి... ఓవైపు సంతోషం-మరోవైపు బాధ: సీఎం జగన్
First Published Dec 25, 2020, 1:32 PM IST
ఇళ్ల స్థలాల పంపిణీపై స్టే ఉన్న చోట్ల వాటి ఎత్తివేతకు సుప్రీంకోర్టుకు వెళ్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు.

పులివెందుల: క్రిస్మస్ పండగ సందర్భంగా పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో సీఎం వైయస్ జగన్ పాల్గొన్నారు. తల్లి విజయమ్మతో పాటు సీఎం జగన్ కుటుంబసభ్యులు, బంధువులు కూడా ఈ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. అందరూ కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనడమే కాదు కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు.

క్రిస్మస్ వేడుకల అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ... ఇళ్ల స్థలాల పంపిణీపై స్టే ఉన్న చోట్ల వాటి ఎత్తివేతకు సుప్రీంకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు.స్టేలు ఎత్తివేసేలా ప్రయత్నాలు చేస్తున్నామని... పైన దేవుడు ఉన్నాడని... మంచి పనికి తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడని అన్నారు.కోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుందని నమ్ముతున్నామన్నారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?