రజనీకాంత్‌కు చంద్రబాబు తేనీటి విందు.. హాజరైన బాలకృష్ణ.. (ఫోటోలు)
సూపర్ స్టార్ రజనీకాంత్‌కు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తేనీటి విందు ఇచ్చారు.

సూపర్ స్టార్ రజనీకాంత్‌కు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తేనీటి విందు ఇచ్చారు. విజయవాడ పోరంకిలోని అనుమోలు గార్డెన్స్ లో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు హాజరయ్యేందుకు రజనీకాంత్ ఈ రోజు ఉదయం నగరానికి వచ్చారు.
విజయవాడ చేరుకున్న రజనీకాంత్‌కు ఎన్టీఆర్ తనయుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్వాగతం పలికారు. బాలయ్యను చూడగానే సూపర్‌స్టార్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. పలువురు టీడీపీ నేతలు కూడా రజనీకాంత్‌కు స్వాగతం పలికినవారిలో ఉన్నారు. అనంతరం ఇద్దరు నోవోటెల్‌కు చేరుకున్నారు. అక్కడ బాలకృష్ణ, రజనీకాంత్‌లు కాసేపు సమావేశమయ్యారు.
అనంతరం బాలకృష్ణ, రజనీకాంత్‌లు ఒకే కారులో నోవోటెల్‌కు చేరుకున్నారు. అక్కడ బాలకృష్ణ, రజనీకాంత్‌లు కాసేపు సమావేశమయ్యారు.
ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు హాజరయ్యేందుకు విజయవాడకు విచ్చేసిన రజనీ కాంత్‌ను చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసానికి ఆహ్వానించారు. ఈ క్రమంలోనే రజనీకాంత్ చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు.
అక్కడ రజనీకాంత్‌కు సాదర స్వాగతం పలికిన చంద్రబాబు.. తేనీటి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా బాలకృష్ణతో పాటు పలువురు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు హాజరుకానున్న సీనియర్ జర్నలిస్టు వెంకటనారాయణ కూడా చంద్రబాబు నివాసానికి వచ్చారు.
ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాల పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమంలో రజనీకాంత్ విశిష్ట అతిథిగా పాల్గొననున్నారు. ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాలపై ఈరోజు రెండు పుస్తకాల విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు.