MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • చంద్రబాబు తొలిసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్లు.. విజయాలు, అపజయాలివే

చంద్రబాబు తొలిసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్లు.. విజయాలు, అపజయాలివే

30 Years of Leadership: Chandrababu Naidu's Journey as Chief Minister: 2024 సెప్టెంబర్ 1 నాటికి నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఈ ఘట్టాన్ని ఘనంగా జరుపుకుంటోంది. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు చూపించిన దారులు, ఎదురైన సవాళ్లను ఎదుర్కొని.. సాగించిన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటోంది.

3 Min read
Galam Venkata Rao
Published : Sep 01 2024, 10:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Nara Chandra Babu Naidu

Nara Chandra Babu Naidu

30 Years of Leadership: Chandrababu Naidu's Journey as Chief Minister: నేటికి (సెప్టెంబర్ 1వ తేదీ నాటికి) నారా చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రిగా (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా) ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్లు గడుస్తోంది. ఈ సందర్భంగా ఆయన సేవలను రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు గుర్తుచేసుకుంటున్నారు. చంద్రబాబు లాంటి నాయకుడు రాష్ట్ర ప్రజలకు దోరకడం అదృష్టమని.. తెలుగు ప్రజల ఖ్యాతిని ఉన్నత స్థానంలో ఉంచడమే ఆయన లక్ష్యమని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. చంద్రబాబు ముందుచూపునకు ఎవరూ సాటి రాలేరని.. ఆయన విధానాలను నేడు అనేక రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని కొనియాడుతున్నారు. 

25
Chandra Babu

Chandra Babu

చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు. నవ్యాంధ్ర నిర్మాణం చంద్రబాబుతోనే సాధ్యమని రాష్ట్ర ప్రజలు నమ్మి.. విభజిత ఆంధ్రాలోనూ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రజలు ఆయనకే పట్టం కట్టారు. 1995 సెప్టెంబర్ 1న నారా చంద్రబాబు నాయుడుడు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

నాటి నుండి ఈరోజుకు ఎన్నోకష్టాలు, నష్టాలు, అపోహలు అవరోధాలను ఎదుర్కొని అహర్నిశలు తెలుగు జాతి ఉన్నతి కోసం శ్రమించారు. సమాజాన్ని ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలి.. సమాజాభివృద్ధే తన లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో రాజకీయాల్లో అపర చాణిక్యుడిగా, అభివృద్ధిలో తిరుగులేని వ్యక్తిగా ఎందరో గొప్పగొప్ప వ్యక్తుల ప్రశంసలు అందుకున్నారు చంద్రబాబు.

బిల్ గేట్స్, బిల్ కింటన్ , సుందర్ పిచ్చయ్, చంద్రశేఖరన్ లాంటి వ్యక్తులు ప్రశంసించారంటే సమాజం పట్ల ఆయనకు ఉన్న ధ్యేయం, సమాజం ఎలా అభివృద్ధి చెందాలని నిరంతరం తప్పించే ఆయన ఆలోచన విధానం, ఆయన ముందు చూపు నేటి తరానికి ఆదర్శం.

35
Chandra Babu

Chandra Babu

అధికారం ఉన్నా.. అధికారం లేకపోయిన ప్రజలతో మమేకైన ఒకే ఒక వ్యక్తి భారత దేశ చరిత్రలో చంద్రబాబు నాయుడు. తెలుగు జాతి గర్వించే వ్యక్తి ఆయన. ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడితే.. తెలుగు ప్రజలకు ఆత్మవిశ్వాసాన్ని పెంచిన నాయకుడు చంద్రబాబు. సుధీర్ఘకాలం ఒక మహిళ దేశ ప్రధానిగా ఉన్నా.. మహిళల గురించి  ఆమె ఏం పట్టించుకున్నారో తెలియాదు కానీ... మహిళా సాధికారత అనే పదానికి అర్థం, పరామర్థం చెప్పిన ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు మాత్రమే. సంక్షేమ పథకాలతో సామాజిక మార్పు తీసుకొచ్చినఅనితర సాధ్యుడు చంద్రబాబు. సమాజంలో సగభాగమైన బీసీలను గుర్తించింది కూడా తెలుగుదేశం పార్టీనే పేరుంది. ఎస్సీ, ఎస్టీల్లాగే బీసీలకు కూడా సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి కృషి చేశారు చంద్రబాబు.

45
Chandra Babu

Chandra Babu

వ్యవసాయ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత చంద్రబాబుదే. నేడు రాజధానుల్లో మేలైన రాజధాని ఏదని చెప్పుకోవాంటే అందరూ హైదరాబాద్‌నే చూపిస్తున్నారంటే ఆ ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. నాడు చంద్రబాబు విజనరీ థింకింగ్ వల్లే సైబరాబాద్ సాధ్యమైందని చెప్పవచ్చు. 

ఇక, గతంలో ఉద్యోగాల కోసం తెలుగువారు చెన్నై, బాంబే, బెంగళూరులకు వెళ్లేవారు.. నేడు హైదరాబాద్ వెళ్తున్నారు.. అది చంద్రబాబు ముందుచూపు ఆలోచనతో చేసిన అభివృద్ధి వలనే సాధ్యమైంది. ఏ నిర్ణయాలు తీసుకుంటే సమాజంలో మార్పువస్తుందో..  ఆ మార్పుతో వికాసవంతమైన సమాజానికి మానవ వనరులను ఎలా పెంపొందించుకోవచ్చే తెలిసిన విజనరీ నాయకుడు చంద్రబాబు. ఎక్కడైతే మానవ వనరులు అభివృద్ధి చెందితే.. ఆ రాష్ట్రం ఆదేశం అభివృద్ధి చెందుతుందని బలంగా నమ్మిన వ్యక్తి ఆయన. సాంకేతిక అభివృద్ధికి నాంది పలికింది కూడా ఆయనే. 

55
Chandra Babu

Chandra Babu

ఎన్ని ఇబ్బందులు ఎదురువచ్చిన అత్మవిశ్వాసంతో నిలబడటం చంద్రబాబు నైజం. కష్టాలను అవకాశాలుగా మలుచుకోని విజయం దిశగా చంద్రబాబు అడుగులు వేస్తారు. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు నిత్యం తపిస్తున్నారు.

ఇంకా, నాడు కేవలం 5 వేల మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి అయ్యే రాష్ట్రంలో నేడు 20 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందంటే అది చంద్రబాబు వల్లే సాధ్యమైంది. పోలవరం ప్రాజెక్టుకు ప్రతి సోమవారం కేటాయించి డయాఫ్రం వాల్ నిర్మించారు. ఇక, వీలైనంత తొందరగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేసి... జీవనాడిని ప్రజలకు అందించాలని చంద్రబాబు ప్రతినిత్యం తపిస్తున్నారు.

ప్రతిపక్షంలో ఇలా... 

చంద్రబాబు నాయుడు జీవితంలో 2019 ముందు రాజకీయాలు ఒక రకంగా, 2019 తరువాత రాజకీయాలు మరోక రకంగా ఉన్నాయి. నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా 2014 నుంచి 2019 వరకు పని చేసిన చంద్రాబు నాయుడు... 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో గత ప్రభుత్వం జైలుకు పంపింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌తో పాటు అనేక కేసులు నమోదయ్యాయి. అయినా చంద్రబాబు నాయుడు భయపడలేదు. కేసులపై పోరాటం చేసి బయటకు వచ్చారు.

చివరికి గత ప్రభుత్వంలో ఆయన ఇంటిపైనా దాడులు జరిగాయి. ఆ తర్వాత జనసేన, బీజేపీతో తెలుగుదేశం కూటమి కట్టారు చంద్రబాబు. ప్రజల మద్దతుతో గతంలో ఎన్నడూ సాధించనన్ని మెజారిటీ స్థానాల్లో ఆంధ్రప్రదేశ్‌లో విజయం సాధించారు. 

About the Author

GV
Galam Venkata Rao
వెంకట్ 8 సంవత్సరాలకు పైగా ప్రింట్, టెలివిజన్, డిజిటల్ మీడియా రంగాల్లో అనుభవం కలిగిన జర్నలిస్ట్. ఈనాడులో జర్నలిజం ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో వీడియో - సోషల్ మీడియా విభాగాలను పర్యవేక్షిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?
Recommended image2
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Recommended image3
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved