వైసీపీ సర్కార్ పై చార్జీషీట్లు : మే 5 నుండి 15 వరకు బీజేపీ పోరుబాట
వైసీపీ సర్కార్ పై ప్రత్యక్ష పోరుకు బీజేపీ సన్నాహలు చేస్తుంది. ఈ విషయమై బీజేపీ నాయకత్వం కమిటీలను ఏర్పాటు చేసింది.
వైసీపీ సర్కార్ పై చార్జీషీట్లు
వైసీపీ ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటానికి బీజేపీ సన్నద్దమైంది. గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు పలు కార్యక్రమాలను నిర్వహించాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. వైసీపీ సర్కార్ విధానాలపై చార్జీషీట్లను బీజేపీ విడుదల చేయనుంది. . ఈ ఏడాది మే 5వ తేదీ నుండి మే 15వ తేదీ వరకు వైసీపీ సర్కార్ పై బీజేపీ పోరుబాట పట్టనుంది.
వైసీపీ సర్కార్ పై చార్జీషీట్లు
బీజేపీ కోర్ కమిటీ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో బీజేపీ నేతలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వైసీపీ సర్కార్ విధానాలపై గ్రామస్థాయి నుండి పోరాటం చేయాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. వైసీపీ సర్కార్ పై చార్జీషీట్లు విడుదల చేయాలని బీజేపీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీజేపీ సీనియర్లతో కమిటీని ఏర్పాటు చేసింది. 11 మంది సీనియర్లను చార్జీషీట్ల కమిటీని ఏర్పాటు చేశారు.
వైసీపీ సర్కార్ పై చార్జీషీట్లు
వైసీపీ సర్కార్ పై పోరుబాట విషయమై నలుగురు సభ్యులతో మరో కమిటీని ఏర్పాటు చేశారు.ఈ కమిటీలో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ . పురంధేశ్వరీ, సత్యకుమార్, మాజీ ఎమ్మెల్సీ మాధవ్ కు చోటు దక్కింది. ప్రభుత్వంపై శాఖల వారీగా చార్జీషీట్లు విడుదల చేయాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. పోలీస్ స్టేషన్ లో కూడా చార్జీషీట్లతో బీజేపీ ఫిర్యాదు చేసే అవకాశం లేకపోలేదు.
వైసీపీ సర్కార్ పై చార్జీషీట్లు
వైసీపీ సర్కార్ పై బీజేపీ నేతలు ఇటీవల కాలంలో తమ విమర్శల జోరును పెంచారు. వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో వైసీపీ , బీజేపీ మధ్య బంధం లేదని ఆ పార్టీ కీలక నేత ఒకరు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. బీజేపీ ఏపీ ఇంచార్జీ సునీల్ ధియోధర్ రాష్ట్ర పర్యటనకు వచ్చిన సమయంలో వైసీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
వైసీపీ సర్కార్ పై చార్జీషీట్లు
అదే సమయంలో టీడీపీ చీఫ్ చంద్రబాబు బీజేపీతో దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్టుగా సంకేతాలు ఇస్తున్నారు. ఓ జాతీయ టీవీ చానల్ కు ఇచ్చన ఇంటర్వ్యూలో మోడీని పొగడ్తలతో ముంచెత్తారు.
వైసీపీ సర్కార్ పై చార్జీషీట్లు
వచ్చే ఏడాదిలో ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసి వెళ్లే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే జనసేన తమతోనే ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో మూడింటిని టీడీపీ గెలుచుకుంది. అంతేకాదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలో కూడా ఓ స్థానాన్ని టీడీపీ దక్కించుకుంది. ఈ ఎన్నికల ఫలితాలపై ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చకు దారి తీశాయి.
వైసీపీ సర్కార్ పై చార్జీషీట్లు
ఈ తరుణంలో బీజేపీ వైసీపీ సర్కార్ పై ప్రత్యక్షపోరుకు సిద్దం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ సర్కార్ పై వైసీపీ ఏ రకమైన పోరాట వ్యూహంతో ముందుకు వెళ్లనుందో భవిష్యత్ తేల్చనుంది.