కేవలం ఏపీ యువతకే ... ఎలాంటి పరీక్ష లేకుండానే డైరెక్ట్ ప్రభుత్వ ఉద్యోగాలు
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఎలాంటి పోటీ పరీక్ష లేకుండానే భారీ ఉద్యోగాల భర్తీ చేపడుతోంది... అదికూడా కేవలం ఏపీ వాసులకే ఛాయిస్. ఈ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
AP Govt Jobs 2024
AP Govt Jobs 2024 : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వైద్యారోగ్య శాఖలో భారీ ఉద్యోగాల భర్తీకి సిద్దమైంది. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో ఖాళీగా వున్న 488 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ ఈ నియామక ప్రక్రియ చేపడుతోంది. ఎలాంటి పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం జరగనుంది. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ https://apmsrb.ap.gov.in/msrb/ చూడండి.
AP Govt Jobs 2024
ఇవాళే అంటే శుక్రవారం (23-08-2024) నోటిఫికేషన్ వెలువడింది... దరఖాస్తు ప్రక్రియ కూడా ఇదేరోజు ప్రారంభమయ్యింది. సెప్టెంబర్ 23, 2024 దరఖాస్తు చేయడానికి చివరితేదీ...అంటే సరిగ్గా నెలరోజుల పాటు దరఖాస్తులకు అవకాశం కల్పించారు. అర్హతగల అభ్యర్థలు ఆన్ లైన్ లోనే మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
AP Govt Jobs 2024
విద్యార్హతలు :
1. అసిస్టెంట్ ప్రొఫెసర్ (క్లినికల్, నాన్ క్లినికల్) : ఈ పోస్టులకు పిజి డిగ్రీ (ఎండి/ఎంఎస్/ డిఎన్‌బి/ డిఎం) చేసినవారు అర్హులు. గుర్తింపుపొందిన విద్యాసంస్థల నుండి ఈ డిగ్రీ చేసివుండాలి.
2. అసిస్టెంట్ ప్రొఫెసర్ సూపర్ స్పెషాలిటీస్ : ఈ పోస్టులకు సూపర్ స్పెషాలిటీ పిజి డిగ్రీ (డిఎన్‌బి/డిఎం/ఎంసిహెచ్) చేసినవారు అర్హులు. ఎంసిఐ లేదా ఎన్ఎంసి ల నుండి గుర్తింపుపొందిన విద్యాసంస్థల్లో చదివినవారు అర్హులు.
AP Govt Jobs 2024
వయో పరిమితి :
ఓసి అభ్యర్థులు నోటిఫికేషన్ వెలువడిన నాటికి 42 ఏళ్లలోపు వుండాలి. అంటే 01/07/1982 తర్వాత పుట్టివుండాలి)
ఎస్సి,ఎస్టి,బిసి అభ్యర్థుల వయసు 47 ఏళ్లలోపు వుండాలి. అంటే 01/07/1977 కు ముందు పుట్టివుండకూడదు)
దివ్యాంగుల వయసు 53 ఏళ్లలోపు, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 50 ఏళ్లలోపు వయసుండాలి.
లోకల్ అభ్యర్థులు మాత్రమే అర్హులు :
ఈ అసిస్టెంట్ ఫ్రొఫెసర్ ఉద్యోగాలకు కేవలం స్థానిక అభ్యర్థులు అంటే ఆంధ్ర ప్రదేశ్ కు చెందినవారే అర్హులు. ఇతర రాష్ట్రాలకు చెందినవారు అనర్హులు.
నియామక ప్రక్రియ :
మెరిట్ లిస్ట్, రిజర్వేషన్ ఆధారంగానే నియమిస్తారు. అన్ని అర్హతలు కలిగివుండి దరఖాస్తు చేసుకున్నవారిలోంచి మెరిట్ లిస్ట్ తయారుచేస్తారు. 100 మార్కులకు గాను 75 మార్కులు మెరిట్ ఆధారంగానే అంటే నిర్ణయిస్తారు. మిగిలిన 25 మార్కలు అనేక విషయాలను పరిగణలోకి తీసుకుని కేటాయిస్తారు.
అప్లికేషన్ ఫీజు :
ఓసి అభ్యర్థులకు రూ.1000
బిసి, ఎస్సి,ఎస్టి అభ్యర్థులు రూ.500 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.