గంటాతో చంద్రబాబుకు జగన్ చెక్: కాలం కలిసొచ్చింది
ఎట్టకేలకు గంటా నేరుగా కండువా కప్పుకోకున్నప్పటియికి... టెక్నికల్ గా టీడీపీ సభ్యుడైనప్పటికీ.... వైసీపీలో మాత్రం అనధికారికంగా ఎంట్రీ ఇచ్చేసారు. విశాఖ రాజధాని అనే అంశాన్ని లేవనెత్తుతూ విశాఖ అభివృద్ధే తనకు ముఖ్యం అంటూ అన్ని రకాలుగా బేరీజు వేసుకొని ఆయన వైసీపీ తీర్థాన్ని పుచ్చేసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్ని నెలలుగా గంటా శ్రీనివాసరావు కు సంబంధించిన చర్చ నడుస్తూనే ఉంది. ఫలితాలు వెలువడ్డ కొద్దీ కాలానికే గంటా బీజేపీలో చేరుతారు అని వార్తలు వచ్చాయి. కానీ గంటా మౌనం వహించారు. ఏకంగా టీడీపీ అధికారిక కార్యక్రమాల్లో వరుసగా పాల్గొని అలాంటిదేమి లేదు అని షాక్ ఇచ్చారు.

ఇక ఆ తరువాత గంటా వైసీపీలో చేరుతున్నారు అని వార్తలు వచ్చాయి. దానిపై కూడా ఆయన మౌనమే వహించారు. తన అనుచరుడు నలంద కిషోర్ ని అరెస్ట్ చేసినప్పుడు బహిరంగంగా వైసీపీ ని తిట్టడంతో అదేమిలేదు అని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా గంటా వైసీపీలో చేరుతున్నారు అన్న వార్తలు బలపడ్డాయి.

మంత్రి అవంతి, విజయసాయి రెడ్డి ఆరోపణల మధ్య ఆయన చేరుతారా లేదా అనే విషయం పై ఒకింత గందరగోళం నెలకొన్నప్పటికీ.... విజయసాయి రెడ్డి కరోనా సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో గంటా తన ప్లాన్ ని చక్కబెట్టేసి జగన్ చేత యెస్ అనిపించేసారు.

ఎట్టకేలకు గంటా నేరుగా కండువా కప్పుకోకున్నప్పటికి... టెక్నికల్ గా టీడీపీ సభ్యుడైనప్పటికీ.... వైసీపీలో మాత్రం అనధికారికంగా ఎంట్రీ ఇచ్చేసారు. విశాఖ రాజధాని అనే అంశాన్ని లేవనెత్తుతూ విశాఖ అభివృద్ధే తనకు ముఖ్యం అంటూ అన్ని రకాలుగా బేరీజు వేసుకొని ఆయన వైసీపీ తీర్థాన్ని పుచ్చేసుకున్నారు.

గంట వంటి సీనియర్ నేత పార్టీలోకి బేషరతుగానే వచ్చినప్పటికీ.... ఆయనకు సముచిత గౌరవం ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నారు. మంత్రి పదవి దక్కకున్నప్పటికీ.... ఏదైనా ఒక బలమైన పదవిలో ఉండాలని గంటా శ్రీనివాసరావు ఆకాంక్షిస్తున్నారు.

జగన్ సైతం గంటాకు ఒక పదవిని అప్పగించి రాజధాని విశాఖ ప్రాంతంలో లాభపడాలని యోచిస్తున్నారు. విశాఖలో ఇప్పటికే ఎమ్మెల్యే గణేష్ ని తమ వైపుగా తిప్పుకున్న వైసీపీ.... తాజాగా గంటా చేరికతో ఆ ప్రాంతంలో తమదైన ముద్ర వేయాలని చూస్తుంది. ఇందుకోసం గంటాను అక్కడ బలంగా ప్రోజెక్ట్ చేయాలని చూస్తుంది.

అమరావతి చంద్రబాబు బ్రాండ్ రాజధాని అయితే... విశాఖ జగన్ మార్కు రాజధానిగా చూపెట్టాలనేది వైసీపీ ప్రభుత్వ తాపత్రయంగా కనబడుతుంది. విశాఖలో టీడీపీని నామరూపాల్లేకుండా చేసి పూర్తి స్థాయిలో బలపడాలని యోచిస్తున్నారు వైసీపీ నాయకులు.

ద్రోణంరాజు గారు నిన్న అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ ను జయించినప్పటికీ... దాని తదనంతర పర్యవసానాల వల్ల ఆయన మరణించారు. ఇప్పుడు ద్రోణం రాజు మరణంతో విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ పోస్ట్ ఖాళీ అయింది.

ఇప్పుడు ఈ పోస్టును గంటా శ్రీనివాసరావుకు అప్పగిస్తే ఎలా ఉంటుందని వైసీపీ పెద్దలు యోచిస్తున్నారు. దీనివల్ల రెండు లాభాలు చేకూరుతాయి వైసీపీ అధిష్టానానికి. ఒకటి ఉత్తరాంధ్రలో మరింత బలపడడానికి ఆస్కారం లభించడంతోపాటుగా పార్టీ మారిన వారికి సముచిత గౌరవాన్ని వైసీపీ కల్పిస్తుందని మెసేజ్ కూడా ఒకటి ప్రజల్లోకి వెళ్తుంది. విజయసాయి రెడ్డి పార్టీలో నెంబర్ 2 ఇక కాదు కాదా అని అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ.... ఈయన నియామకం విజయసాయి వర్గానికి కూడా చెక్ పెట్టినట్టవుతుందని అంటున్నారు కొందరు.