- Home
- Andhra Pradesh
- AP Cabinet Reshuffle: కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ.. జిల్లాల వారీగా రేసులో ఉన్నది వీరే..!
AP Cabinet Reshuffle: కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ.. జిల్లాల వారీగా రేసులో ఉన్నది వీరే..!
ఆంధ్రప్రదేశ్‌లో కేబినెట్ పునర్ వ్యవస్థీకరణకు సమయం దగ్గరపడుతోంది. ఏప్రిల్ 11వ తేదీన కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే రేపు(ఏప్రిల్ 7)న జరిగే కేబినెట్ భేటీలో ప్రస్తుతం ఉన్న మంత్రులు అందరిచేత రాజీనామాలు చేయించనున్నట్టుగా తెలిసింది.

ఆంధ్రప్రదేశ్‌లో కేబినెట్ పునర్ వ్యవస్థీకరణకు సమయం దగ్గరపడుతోంది. ఏప్రిల్ 11వ తేదీన కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే రేపు(ఏప్రిల్ 7)న జరిగే కేబినెట్ భేటీలో ప్రస్తుతం ఉన్న మంత్రులు అందరిచేత రాజీనామాలు చేయించనున్నట్టుగా తెలిసింది. బుధవారం సాయంత్రం భేటీ కానున్న సీఎం జగన్ తొలగించనున్న మంత్రుల వివరాలు.. కొత్తగా కేబినెట్‌లోకి తీసుకుంటున్న వారి జాబితాను సమర్పించే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది.
అయితే ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో దాదాపు అందరిని తొలగించడం ఖాయమనే ప్రచారం సాగుతుంది. అయితే కొత్తగా ఎవరికి కేబినెట్‌లో సీఎం జగన్ చోటు కల్పిస్తారనే అంశంపై ఏపీ రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ సాగుతుంది. 2024 ఎన్నికలే లక్ష్యంగా సామాజిక సమీకరణలను, ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకుని జగన్.. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కేబినెట్‌లోకి తీసుకునే వారిపై జగన్ ఒక స్పష్టతకు వచ్చినట్టుగా చెబుతున్నారు.
అయితే ప్రస్తుతం కీలకంగా వ్యవహరిస్తున్న మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిలను కూడా జగన్ కేబినెట్ నుంచి తొలగించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక, సీనియర్ నేతలుగా ఉన్న ఆనం రామనారాయణరెడ్డి, ధర్మాన ప్రసాదరావులకు కేబినెట్ బెర్త్ దక్కుతుందా లేదా అనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతుంది. వీరికి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక వీరిని మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం కూడా సాగింది. కానీ వీరికి అవకాశం దక్కలేదు.
ఇక, నగిరి ఎమ్మెల్యే రోజా కేబినెట్ బెర్త్‌పై చాలా ఆశలు పెట్టుకున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక.. రోజాకు మంత్రిపదవి దక్కుతుందనే రాజకీయ వర్గాలు భావించాయి. అయితే జగన్ ఆమెను ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా నియమించారు. ఆ పదవీ కాలం ముగిసినప్పటికీ.. మళ్లీ పొడగించలేదు. అయితే ఇప్పుడు మాత్రం తనకు కేబినెట్ బెర్త్ దక్కుతుందని రోజా ఆశతో ఉన్నారు. అయితే రోజాకు, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనికి మధ్య పోటీ ఉందని.. ఇద్దరిలో ఎవరికో ఒకరికి కేబినెట్ బెర్త్ దక్కుతుందనే ప్రచారం సాగుతుంది. మరోవైపు జిల్లాల వారీగా తీసుకుంటే తిరుపతి నుంచి రోజాకు పోటీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా కేబినెట్‌లో రేసులో ఉన్నారు.
మరోవైపు స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతిలు కేబినెట్ బెర్త్‌పై ఆశలు పెట్టుకున్నారు. మంత్రివర్గంలో చోటు కోసం వారి ప్రయత్నాలు వారు చేసినట్టుగా తెలిసింది. ప్రకాశం జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేశ్‌ను.. మంత్రి వర్గంలో కొనసాగించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణపై ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో కొందరు అంతర్గతంగా అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. ఇక, ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై తీవ్రమైన చర్చ సాగుతుంది. అయితే కేబినెట్ చోటు దక్కే అవకాశం వీరికే ఉందంటూ.. కొందరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.
ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఒక్కరే మంత్రివర్గంలో ఉన్నారు. విశాఖ జిల్లా కొత్తగా విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలుగా ఏర్పడిన నేపథ్యంలో కొత్త కూర్పులో అనకాపల్లి జిల్లాకు అవకాశం లభించే అవకాశముందనే ప్రచారం సాగుతంది. ఈ నేపథ్యంలోనే అనకాపల్లి ఎమ్మెల్యే అమరనాథ్‌కు కేబినెట్ గ్యారెంటీ అనే మాట బలంగా వినిపిస్తోంది. ఇక, కొత్త జిల్లా వారీగా చూస్తే.. కొన్ని జిల్లాలకు మంత్రివర్గ కూర్పులో అవకాశం దక్కకపోవచ్చని తెలుస్తోంది.
అయితే జిల్లాల వారీగా కేబినెట్ రేసులో ఉన్నవారి పేర్లను పరిశీలిస్తే.. తిరుపతి: రోజా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కర్నూలు: హఫీజ్‌ఖాన్, అన్నమయ్య: గడికోట శ్రీకాంతరెడ్డి, నవాజ్‌పాషా, శ్రీ సత్యసాయి: అనంత వెంకట్రామిరెడ్డి, తిప్పేస్వామి, నెల్లూరు: కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, నంద్యాల: కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ప్రకాశం: ఆదిమూలపు సురేశ్, అన్నే రాంబాబు, మద్దిశెట్టి వేణుగోపాల్, టీజేఆర్ సుధాకర్‌బాబు , పల్నాడు: విడదల రజని, బ్రహ్మనాయుడు, బాపట్ల: మేరుగ నాగార్జున, కోన రఘుపతి, గుంటూరు: ఆళ్ల రామకృష్ణారెడ్డి, పల్నాడు: విడదల రజని రజక, బ్రహ్మనాయుడు కమ్మ, ఎన్‌టీఆర్: సామినేని ఉదయభాను, రక్షణనిధి, వసంత కృష్ణప్రసాద్, కృష్ణా: కొలుసు పార్థసారథి, జోగి రమేశ్
పశ్చిమ గోదావరి: ముదునూరు ప్రసాదరాజు, గ్రంధి శ్రీనివాస్, కారుమూరి నాగేశ్వరరావు, ఏలూరు: మేకా ప్రతాప వెంకట అప్పారావు, బాలరాజు, ఎలీజా, అబ్బయ్యచౌదరి, కోనసీమ: విశ్వరూప్, చెల్లుబోయిన వేణు, పొన్నాడ సతీశ్, రాజమహేంద్రవరం: టి వెంకటరావు, కాకినాడ: దాడిశెట్టి రాజా, పెండెం దొరబాబు, విజయనగరం: కంబాల జోగులు, బొత్స అప్పల నర్సయ్య, అల్లూరి సీతారామరాజు: ధనలక్ష్మి, భాగ్యలక్ష్మి, చెట్టి ఫాల్గుణ, అనకాపల్లి: గుడివాడ అమరనాథ్, బూది ముత్యాలనాయుడు, గొల్ల బాబూరావు, కరణం ధర్మశ్రీ, శ్రీకాకుళం: తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాదరావు, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, పార్వతీపురం మన్యం: విశ్వసరాయ కళావతి, రాజన్నదొర