పెండింగ్ బిల్లుల కోసం రోడ్డెక్కిన చంద్రబాబు
First Published Dec 4, 2020, 9:50 AM IST
పెండింగ్ లో ఉన్న రూ.2500కోట్లు తక్షణమే చెల్లించాలంటూ సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి చంద్రబాబు అధ్యక్షతన టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన ర్యాలీ చేపట్టారు. జగన్ సీఎం అయ్యాక రాష్ట్రాభివృద్ధికి గ్రహణం పట్టిందని శాసనసభ పక్ష ఉపనేత నిమ్మకాయల చినరాజప్ప మండిపడ్డారు.

సంక్షేమం పేరుతో మభ్యపెడుతున్నారని, గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు జరగట్లేదు. ఒక్క రోడ్డయినా వేశారా అని ప్రశ్నించారు. నరేగా నిధుల్ని సద్వినియోగం చేసుకుని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తెదేపా చేపట్టిందని అన్నారు. ప్రభుత్వం మారిన వెంటనే నరేగా బిల్లులు నిలుపుదల చేయటం దుర్మార్గం అని దుయ్యబట్టారు.
ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ రూ.2500కోట్ల తో గ్రామాల్లో 2018-19లో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఎన్నికలు రావటంతో ఆ బిల్లులు నిలిపేశారు. కొత్త ప్రభుత్వం వచ్చి రెండేళ్లవుతున్నా కక్ష సాధింపుతో జగన్ ఆ బిల్లులు చెల్లించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?