'ఈడీబీ'లో ఆంధ్రప్రదేశే నంబర్ వన్: వెబినార్ లో మంత్రి గౌతమ్ రెడ్డి

First Published 2, Jun 2020, 7:24 PM

నైపుణ్యం కలిగిన మానవ వనరులే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బలమని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు.

విజయవాడ: నైపుణ్యం కలిగిన మానవ వనరులే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బలమని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో ఏ రంగంలోనైనా  పెట్టుబడులు పెట్టే అనుకూలమైన వాతావరణం , సహజవనరులు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకత అని మంత్రి మేకపాటి స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా కర్ణాటక, తమిళనాడు, కర్ణాటక సహా పలు రాష్ట్రాలకు చెందిన  ఐ.టీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రులు, కార్యదర్శులతో ‘ఇన్వెస్ట్ ఇండియా ఎక్స్ క్లూజివ్ ఇన్వెస్ట్ మెంట్ ఫోరమ్’ మంగళవారం వెబినార్ ను నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున పరిశ్రమలు, ఐ.టీ, వాణిజ్యం, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు.

విజయవాడలోని ఏపీటీఎస్ భవనంలో ఈ వెబినార్ జరిగింది.ఆన్ లైన్ వేదికగా జరిగిన ఈ వెబినార్ లో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ..జాతీయ స్థాయిలో నైపుణ్యాన్ని పెంచే ఐఐటీ, ఐఐఎమ్, ఐఐఎస్ఈఆర్ విద్యాసంస్థలు, 300కు పైగా నైపుణ్యాన్ని అందించే ఇంజనీరింగ్ కాలేజీలు, మరో 300 పాలిటెక్నిక్ కాలేజీలు, 500కు పైగా ఐటీఐ వంటి విద్యా సంస్థలతో పరిశ్రమలకు కావలసిన నైపుణ్యం కలిగిన  మానవవనరులను తీర్చిదిద్దే శక్తి  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ప్రత్యేకమని మంత్రి మేకపాటి వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని  తీర్చిదిద్దుతోందని..పరిశ్రమలకు కావలసిన నైపుణ్యత సాధించే 30 ప్రత్యేక నైపుణ్య కాలేజీలను ఏర్పాటుకు సిద్ధమైందని మంత్రి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. అంతేకాకుండా, 2 పారిశ్రామిక కారిడార్లు, 40 వేల ఎకరాల ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్,  6 పోర్టులు, మరో 6 ఎయిర్ పోర్టులు అందులో 3 అంతర్జాతీయ విమానాశ్రమాలు, ప్రతీ చోటికి ప్రయాణం చేయగలిగేలా  రోడ్లతో ఏపీ ప్రత్యేకతను చాటే అంశాలని మంత్రి పేర్కొన్నారు.

పరిశ్రమలకు అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా, నీరు పుష్కలంగా ఉండడం, నెలకు 3.5 లక్షల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన మొబైల్ తయారీ యూనిట్లు, జపాన్, చైనా, దక్షిణ కొరియా వంటి దేశాలకు చెందిన పరిశ్రమలు, పరిశ్రమల ఏర్పాటుకు అయ్యే ఖర్చు కూడా మిగతా ఏ రాష్ట్రంలోనూ లేనంత చౌక కావడం కూడా ఏపీకి సానుకూలమైన అంశాలని మంత్రి ఇన్వెస్ట్ ఇండియా వెబినార్ లో వివరించారు. ఎలక్ట్రానిక్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించే 3 ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్లు,  ఒక మెడ్ టెక్ జోన్, డిఫెన్స్ ఎలక్ట్రానిక్ క్లస్టర్, మరొక కన్యజూమరర్ ఎలక్ట్రానిక్స్ క్లస్టర్లు ఏపీలో ఉండడంతో ఏపీ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారడం ఖాయమని మంత్రి తెలిపారు.

పాలసీ రీఫామ్స్, ప్రోత్సాహకాలు, విద్యుత్, పన్ను రాయితీలతో ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి కేరాఫ్ అడ్రస్ గా మారనుందని మంత్రి వెబినార్ లో రాష్ట్ర ప్రత్యేకతలను వినిపించారు. వెబినార్ లో మంత్రి గౌతమ్ రెడ్డితో పాటు ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి కోన శశిధర్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రమణ్యం , ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్, ఈడీబీ బృందం పాల్గొన్నారు.

loader