ఇండియాలోనే అత్యధికంగా కండోమ్స్ వాడేది తెలుగోళ్లే : ఎంతమంది వాడుతున్నారో తెలుసా?
భారత దేశంలో అత్యధికంగా కండోమ్స్ వాడుతున్న రాష్ట్రాల్లో ఆంధ్ర ప్రదేశ్ టాప్ లో నిలిచింది. ఇక్కడ సగటున ప్రతి 10వేల మందిలో ఎంతమంది కండోమ్స్ వాడతారో తెలుసా?
Condoms
భారత ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా ఎయిడ్స్, సుఖ వ్యాధుల నివారణకు కండోమ్స్ వాడకాన్ని ప్రోత్సహిస్తూ వస్తోంది. ముఖ్యంగా యువతకు సెక్స్ ఎడ్యుకేషన్ తో పాటు సామాన్య ప్రజలకు కండోమ్స్ వాడకంపై అవగాహన కల్పిస్తూ రోగాల బారిన పడకుండా ముందుజాగ్రత్తలు చేపడుతోంది. దీని ఫలితంగానే ప్రస్తుతం సమాజంలో సెక్స్ గురించి అపోహలు తొలగిపోయి చాలామంది సుఖసంతోషాలతో జీవిస్తున్నారు. ఇదే క్రమంలో కండోమ్స్ వినియోగమూ భారీగా పెరిగిపోయింది.
Condoms
భారత్ లో కండోమ్స్ వినియోగం :
సురక్షత శృంగారంపై ప్రజల్లో అవగాహన పెరగడంతో కండోమ్స్ వినియోగం బాగా పెరిగింది. ఎయిడ్స్ తో మరికొన్ని ప్రాణాంతక సుఖవ్యాథుల బారిన పడకుండా కండోమ్స్ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అంతేకాదు అవాంచిత గర్భం, కుటుంబ నియంత్రణకు కూడా ఇవి పనికొస్తాయి.
ఇలా అనేక విధాలుగా ఉపయోగపడుతున్న కండోమ్స్ వినియోగంపై జాతీయ కుటుంబ ఆరోగ్య విభాగం ఓ సర్వే చేపట్టింది. ఇందులో ఆసక్తికర విషయాలు బైటపడ్డాయి. దేశంలో అత్యధికంగా కండోమ్స్ ఉపయోగిస్తున్నది తెలుగు ప్రజలేనని ఈ సర్వే తేల్చింది.
Condoms
కండోమ్స్ వినియోగంలో టాప్ 5 రాష్ట్రాలు :
భారతదేశంలో కండోమ్స్ ని అత్యధికంగా ఉపయోగిస్తున్నది కేంద్ర పాలిత పాంత్రం దాద్రానగర్ హవేలి ప్రజలు. ఇక్కడ సగటున 10 వేల మందిలో 993 మంది కండోమ్స్ ఉపయోగించి సురక్షితంగా సెక్స్ లో పాల్గొంటున్నారు.
రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్ర ప్రదేశ్ టాప్ లో వుంది. తెలుగు ప్రజలు మంచి లైంగిక విజ్ఞానాన్ని కలిగివుండటం వల్లే ఇలా సురక్షిత శృంగారానికి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ఏపీలో సగటున 10వేల మందిలో 978 మంది కండోములు వినియోగిస్తున్నట్లు కేంద్ర సర్వేలో తేలింది.
ఇక ఆంధ్ర ప్రదేశ్ తర్వాత అత్యధిక కండోమ్స్ వినియోగంలో పుదుచ్చెరి రెండోస్థానంలో వుంది. ఇక్కడ ప్రతి 10వేల మందిలో 960 మంది కండోమ్స్ వినియోగిస్తున్నారు. ఆ తర్వాత పంజాబ్ 895, హర్యానా 685, హిమాచల్ ప్రదేశ్ 530 మందితో వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. అలాగే రాజస్థాన్ లో ప్రతి 10వేల మందిలో 514, గుజరాత్ లో 430 మంది కండోమ్స్ ఉపయోగిస్తున్నారు.
ఇక అతి తక్కువగా కండోమ్స్ ఉపయోగిస్తున్న రాష్ట్రాల్లో కర్ణాటక మొదటిస్థానంలో వుంది. ఆ రాష్ట్ర రాజధాని బెంగళూరులో ప్రతి 10వేల మందిలో కండోమ్ ఉపయోగించేది కేవలం 307 మందే. బాగా అభివృద్ది చెందిన ఐటీ సిటీలోనే పరిస్థితి ఇలా వుంటే కన్నడ పల్లెల్లో పరిస్థితి ఎలా వుంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆ రాష్ట్రంలో 6 శాతం మందికి అసలు కండోమ్ గురించే తెలియదట.
Condoms
దేశవ్యాప్తంగా కండోమ్స్ వినియోగం :
దేశవ్యాప్తంగా చూసుకుంటే ప్రతి సంవత్సరం 3.307 బిలియన్స్ కండోమ్స వినియోగిస్తున్నారట. ఇలా అత్యధికంగా కండోమ్స్ ను వినియోగించే రాష్ట్రంగా ఉత్తర ప్రదేశ్ నిలిచింది. ఇక్కడ ప్రతి ఏటా 530 మిలియన్స్ కండోమ్స్ వినియోగిస్తున్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య శాఖ 2021-22 సంవత్సరానికి నిర్వహించిన సర్వే వివరాలు చెబుతున్నాయి.
అయితే ఈ సర్వేలో మరో ఆందోళనకర విషయం బైటపడింది. ప్రతి ఏటా దేశంలో కండోమ్స్ వినియోగం తగ్గుతోందని ఈ సర్వే తేల్చింది. కాబట్టి కండోమ్ ల వినియోగంలో బాగా వెనకబడ్డ రాష్ట్రాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించేందుకు జాతీయ కుటుంబ ఆరోగ్య శాఖ కృషి చేస్తోంది.