డ్యూయల్ పోర్ట్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో షియోమి ఎంఐ కార్ ఛార్జర్...
భారతదేశంలో ఎంఐ కార్ ఛార్జర్ ప్రో 18W ధర రూ. 799.ఎంఐ.కామ్ వెబ్‌సైట్ ద్వారా ఛార్జర్ అందుబాటులో ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు ఎంఐ కార్ ఛార్జర్ ప్రో 18W డ్యూయల్-పోర్ట్ ఇంటెలిజెంట్ డిస్ట్రిబ్యూషన్ ఫీచర్ దీనిలో ఉంది.
షియోమి కంపెనీ ఒక కొత్త డివైజ్ ఇండియాలో లాంచ్ చేసింది. కొత్త కార్ ఛార్జర్ మెటాలిక్ ఫినిష్, 18w ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, డ్యూయల్ ఛార్జింగ్ పోర్ట్ ఫీచర్స్ తో దీని ప్రత్యేకతలు. షియోమి డ్యూయల్-పోర్ట్ ఇంటెలిజెంట్ డిస్ట్రిబ్యూషన్ ఫీచర్‌ను దీనికి అందించింది. ఇది కనెక్ట్ చేసిన ప్రతి డివైజ్ కి తగిన శక్తిని అందించెల రూపొందించారు.
also read అతి తక్కువ ధరకే కోడాక్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ...
చైనా కంపెనీ ఎంఐ ఒకేసారి రెండు డివైజ్లు ఛార్జ్ చేయడానికి డ్యూయల్ యుఎస్‌బి పోర్ట్‌లు ఉన్న కార్ ఛార్జర్ బేసిక్ మోడల్ మొదటిగా డిసెంబర్ 2018లో విడుదల చేసింది. భారతదేశంలో ఎంఐ కార్ ఛార్జర్ ప్రో 18W ధర రూ. 799. ఎంఐ.కామ్ వెబ్‌సైట్ ద్వారా అందుబాటులో ఉంది.
18W ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇవ్వడానికి ఒక ప్రత్యేకమైన పోర్ట్ ఉంది. ఎంఐ కార్ ఛార్జర్ బేసిక్ మోడల్ లాగా కాకుండా కొత్త మోడల్ రెండు యుఎస్‌బి పోర్ట్‌ల నుండి ఫాస్ట్ ఛార్జింగ్ అందిస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ పొందడానికి మీరు రెండు పోర్టులలో దేనికైనా మీ డివైజ్ ప్లగ్ చేయవచ్చు. కాకపోతే రెండు పోర్టులలో ఒకేసారి 18W ఫాస్ట్ ఛార్జింగ్ అందించలేదు.
also read ఎంతోగానో ఎదురు చూస్తున్న మోటోరేజర్ స్మార్ట్ ఫోన్ వచ్చేసింది...ధరెంతంటే.?
ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు ఎంఐ కార్ ఛార్జర్ ప్రో 18W డ్యూయల్-పోర్ట్ ఇంటెలిజెంట్ డిస్ట్రిబ్యూషన్ ఫీచర్ దీనిలో ఉంది. ఛార్జర్‌లో ఐదు రెట్లు సర్క్యూట్ ప్రొటక్షన్ ఐసి చిప్, ఓవర్‌కరెంట్ ప్రొటెక్షన్, షార్ట్-సర్క్యూట్ ప్రొటెక్షన్, ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్ ఉన్నాయి. ఇంకా మూన్లైట్ వైట్ ఎల్ఈడి ఇండికేటర్ ఉంది. ఎంఐ కార్ ఛార్జర్ ప్రో 18W 61.8x25.8x25.8mm సైజులో ఉంటుంది.